ఇలా చేస్తే కిచెన్‌లో పని ఎంతో ఈజీ!
వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చాలామందికి ఈ ఆప్షన్ ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పచ్చు. అయితే ఇలా ఎన్ని సౌకర్యాలున్నా ఆడవారికి ఇంటి పని నుంచి మాత్రం విముక్తి కలగట్లేదు. ఓవైపు ఇంటి నుంచి చేసే ఆఫీస్ పని, మరోవైపు ఇంటి పని చేసుకోవడం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్ చేయాలంటే కత్తి మీద సామే! అలాగని మరీ ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన పనిలేదు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. అటు వంటింట్లో పనిని త్వరగా పూర్తి చేసుకోవచ్చు..
వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చాలామందికి ఈ ఆప్షన్ ఎంతో సౌకర్యవంతంగా ఉందని చెప్పచ్చు. అయితే ఇలా ఎన్ని సౌకర్యాలున్నా ఆడవారికి ఇంటి పని నుంచి మాత్రం విముక్తి కలగట్లేదు. ఓవైపు ఇంటి నుంచి చేసే ఆఫీస్ పని, మరోవైపు ఇంటి పని చేసుకోవడం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలన్స్ చేయాలంటే కత్తి మీద సామే! అలాగని మరీ ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన పనిలేదు. చిన్నపాటి చిట్కాలు పాటిస్తే.. అటు వంటింట్లో పనిని త్వరగా పూర్తి చేసుకోవచ్చు.. ఇటు ఇంటి నుంచి చేసే పనిని సమర్థంగా నిర్వర్తించవచ్చు.. ఇంతకీ ఆ చిట్కాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
ఇలా చేస్తే క్లీనింగ్ పని తప్పినట్లే!
వంట చేయడమే పెద్ద పని అనుకుంటే.. ఇక వంటంతా పూర్తైన తర్వాత కిచెన్ శుభ్రం చేయాలంటే చుక్కలు కనిపించక మానవు. మరి ఈ బాధ తప్పాలంటే ఈ సింపుల్ చిట్కాను పాటించి చూడండి. అందుకోసం.. కిచెన్‌లో పని మొదలుపెట్టేముందే కిచెన్ ప్లాట్‌ఫామ్‌పై పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ లాంటివి పరచండి.. మీ కటింగ్ లేదా పిండి కలపడం లాంటివి చేస్తున్నప్పుడు చెత్తంతా పేపర్‌పై పడుతుంది. మీ పని పూర్తైన వెంటనే పేపర్ లేదా ప్లాసిక్ కవర్ని చుట్టి చెత్తడబ్బాలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చాలా వరకు క్లీనింగ్ పని తప్పించుకున్నట్లే!
సింగిల్ పాట్ వంటకాలు!
అందరూ ఇంట్లో ఉండడం వల్ల రుచికరమైన వంటకాలు కావాలని కోరుకుంటారు. అలాగని మనం వంట చేస్తూ కూర్చుంటే మన ఆఫీస్ పని కోసం గడిచే సమయం ఆగదు. కాబట్టి ఇలాంటి సమయంలో అటు రుచితో పాటు.. ఇటు మీ సమయాన్ని ఆదా చేసే సింగిల్ పాట్ వంటకాల్ని ఎంచుకోండి.. అంటే క్యారట్ రైస్, పుదీనా రైస్, పులిహోర, వెజిటబుల్ రైస్.. ఇలాంటివి చేయండి. వీటి వల్ల ప్రత్యేకంగా కూర వండాల్సిన పని ఉండదు. విభిన్న రుచిని మీ కుటుంబ సభ్యులకు అందించిన వారవుతారు. అలాగే పాత్రల వాడకం కూడా తగ్గి గిన్నెలు తోమడం కూడా సులువవుతుంది. మరి, మీకు ఉదయాన్నే సమయం సరిపోనప్పుడు ఇలాంటి తరహా వంటకాల్ని ట్రై చేసి చూడండి.. కచ్చితంగా అందరూ మారు మాట్లాడకుండా తినడం ఖాయం.
కటింగ్ అంతా ముందు రోజే..
కూరగాయల్ని ముందురోజే కట్ చేసి పెట్టుకోండి.. ఇది అందరూ కామన్‌గా చేసేదే అనుకోండి.. కానీ కొందరు బద్ధకం కొద్దీ రేపు ఉదయమే కట్ చేసుకోవచ్చులే అనుకుంటారు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడంతో ఇక పని అయినట్లే! కాబట్టి కాస్త ఓపిక తెచ్చుకొని రాత్రే కూరగాయలు కోసి పెట్టుకోండి. అయితే క్యారట్స్, బీన్స్, చిక్కుడు, బీట్రూట్, బెండకాయ.. వంటివి కట్ చేసి పెట్టుకుంటే పర్లేదు. కానీ వంకాయ, బంగాళాదుంప.. వంటివి రాత్రి కట్ చేసుకుంటే మరుసటి రోజుకి పాడైపోతాయి.. అలాగే కట్ చేసుకున్న కాయగూరల్ని ఫ్రీజర్ బాక్స్‌లు లేదా జిప్పర్ బ్యాగ్స్‌లో పెడితే రెండు మూడు రోజులైనా తాజాగా ఉంటాయి.
జిడ్డు వదిలించండిలా!
వంటింట్లో వంట చేయడంతో పని పూర్తవదు. వండిన పాత్రల్ని శుభ్రం చేయడం అంటేనే అబ్బా అని విసుక్కుంటుంటారు చాలామంది. కానీ చిన్న చిట్కా పాటిస్తే చకచకా గిన్నెలు తోమేయచ్చు. ఇందుకోసం బాగా జిడ్డుగా, మురికిగా ఉండే పాత్రల్ని ముందుగానే కాస్త సోప్ నీటిలో వేసి నానబెట్టండి. అలా ఓ గంటపాటు ఉండనిచ్చి.. మీరు మిగతా గిన్నెలు తోమే లోపు అవి నానిపోతాయి. తద్వారా వాటి జిడ్డు, మురికి త్వరగా వదిలిపోయి గంటల తరబడి అంట్లు తోమడానికి సమయం వృథా కాదు.
ఇవి కూడా!
* ఒక్కసారి కూర వండడానికే చిరాకొస్తుంది.. ఇక సాయంత్రం కూడా కూరంటే మా వల్ల కాదు బాబోయ్ అంటుంటాం.. కాబట్టి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు పులుసు కూరలు లేదంటే వీలైతే ఉదయాన్నే మరో కూర చేసి పెట్టుకుంటే ఇక రాత్రికి దిగులుండదు. దాంతో ఆఫీస్ పని పూర్తి కాగానే కాస్త విశ్రాంతి దొరుకుతుంది కూడా!
* ప్రస్తుతం ఒవెన్‌లో ఈజీగా చేసుకునే వంటలకు ఆదరణ పెరిగింది. కాబట్టి ఇంట్లో ఒవెన్ ఉన్న వాళ్లు ఇలాంటి వంటల్ని ట్రై చేయండి. పైగా ఒవెన్‌లో వంటలు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. అంతేకాదు.. ఇందుకోసం ఎక్కువ పాత్రలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.. కాబట్టి గిన్నెలు కడిగే శ్రమ కూడా తగ్గుతుంది.
చూశారుగా.. ఇంటి నుంచే పని చేయాల్సిన మహిళలు వంటింట్లో సులభంగా పని ముగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..! అటు త్వరగా పని ముగించుకోవచ్చు.. ఇటు సాయంత్రం పని పూర్తయ్యాక కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుంది.. ఏమంటారు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- అతను తగినవాడేనా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!