దీంతో సింక్‌ని ఈజీగా శుభ్రం చేసేయచ్చు..!

కిచెన్ సింక్‌లో నిండిన గిన్నెలు శుభ్రం చేశాక సింక్‌ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మనకు అలవాటే. అయితే ఈ క్రమంలో సింక్ గోడలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయాలంటే చేత్తో నీటిని పోస్తూ....

Updated : 30 Aug 2022 11:39 IST

కిచెన్ సింక్‌లో నిండిన గిన్నెలు శుభ్రం చేశాక సింక్‌ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మనకు అలవాటే. అయితే ఈ క్రమంలో సింక్ గోడలు, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్ని శుభ్రం చేయాలంటే చేత్తో నీటిని పోస్తూ క్లీన్ చేస్తుంటాం. తద్వారా ఆ గోడలకు అంటుకున్న నూనె జిడ్డు, ఇతర పదార్థాల అవశేషాలు అంత సులభంగా వదలవు. అలాకాకుండా ఈ పని మరింత సులభంగా పూర్తవ్వాలంటే మీ సింక్ ట్యాప్‌కి ఓ 'ఫ్లెక్సిబుల్ ఫాసెట్ స్ప్రేయర్'ని అమర్చుకోవాల్సిందే!

ఫొటోలో చూపించినట్లుగా పై భాగంలో ట్యాప్‌కి ఫిక్స్ చేసుకునేలా ఉండి, కింది భాగంలో నీళ్లు స్ప్రే మాదిరిగా ఒత్తిడితో బయటికి వచ్చేలా ఉంటుందీ సింక్ యాక్సెసరీ. ఇక, మధ్య భాగంలో ఉండే స్ప్రింగ్ అటాచ్‌మెంట్ పైప్ దీన్ని ఎటు పడితే అటు సులభంగా వంచడానికి వీలుగా ఉంటుంది. సో.. ట్యాప్ ఆన్ చేసుకొని ఈ స్ప్రేయర్ సహాయంతో సింక్ గోడలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్ని క్షణాల్లో శుభ్రం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని