విమానం తోక చూపిస్తే.. అది ఏ దేశానిదో చెప్పేస్తుంది!
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు ఈ మధ్య కాలంలో పిల్లలు తమలో ఉన్న అద్భుత మేధోశక్తిని, జ్ఞాపక శక్తిని వివిధ రకాలుగా చాటుకుంటున్నారు. కొందరు ప్రపంచ దేశాల పేర్లతో పాటు వాటి రాజధానులు, కరెన్సీలను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే.. మరికొందరు వివిధ భాషల్లో పాటలు పాడుతున్నారు.. శ్లోకాలు చెబుతున్నారు.
Photo: Screengrab
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు ఈ మధ్య కాలంలో పిల్లలు తమలో ఉన్న అద్భుత మేధోశక్తిని, జ్ఞాపక శక్తిని వివిధ రకాలుగా చాటుకుంటున్నారు. కొందరు ప్రపంచ దేశాల పేర్లతో పాటు వాటి రాజధానులు, కరెన్సీలను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే.. మరికొందరు వివిధ భాషల్లో పాటలు పాడుతున్నారు.. శ్లోకాలు చెబుతున్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన ఆర్నా గుప్తా కూడా ఈ కోవకే చెందుతుంది. విమానం తోక చూసి అది ఏ దేశానికి చెందినదో చిటికెలో చెప్పేస్తోందీ ఆరేళ్ల చిన్నారి. ఈ క్రమంలో నిమిషంలోనే 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తుపట్టి ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది.
సింగపూర్ టు స్విట్జర్లాండ్!
మన జాతీయ జెండా మినహా ఇతర దేశాల జాతీయ జెండాలను చూపించి అది ఏ దేశానిదో గుర్తుపట్టమంటే అన్నీ గుర్తుపట్టలేం. అలాంటిది కేవలం విమానం తోక చూపించగానే ఒక్క సెకను కూడా గ్యాప్ ఇవ్వకుండా అది ఏ దేశానికి చెందిన విమానయాన సంస్థో ఇట్టే చెబుతోంది ఆర్నా. ఈ నేపథ్యంలో ఇటీవల ఒకే ఒక్క నిమిషంలో 93 దేశాలకు చెందిన విమానాలను గుర్తించి ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అతిపెద్ద సింగపూర్ ఎయిర్ లైన్స్ నుంచి మలేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన విమానయాన సంస్థలన్నీ ఆర్నా గుర్తుపట్టిన వాటిలో ఉన్నాయి.
రెండేళ్ల వయసు నుంచే!
చండీగఢ్‌లోని ఓ పాఠశాలలో చదువుతోన్న ఆర్నాకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఎంతో ఆసక్తి. కేవలం తెలుసుకోవడమే కాదు.. వాటిని ఎప్పటికప్పుడు తన మెదడులో పదిలంగా దాచుకోవడమూ ఈ చిన్నారికి అలవాటు. అందుకే వాటి గురించి నిద్రలో లేపి అడిగినా టక్కున చెప్పేస్తుంటుంది. దీనికి ఆమె తల్లి నేహా గుప్తా ప్రోత్సాహం కూడా తోడైంది. ఫలితంగా తన జ్ఞాపక శక్తితో ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది.
‘నా తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మ అందించిన ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఆమె చెప్పినట్లు ప్రాక్టీస్ చేసినందుకే ప్రతి విషయాన్నీ సులభంగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాను. ఇక తాజాగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం వెనక అమ్మానాన్నలతో పాటు మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి కూడా ఉంది. అందుకు వారికీ ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను’ అని చెప్పుకొచ్చిందీ సూపర్ కిడ్.
గతంలోనూ!
ఆర్నా ప్రపంచ రికార్డులు సృష్టించడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 120 మంది ప్రముఖుల పేర్లను గతేడాది ఆగస్టులో కేవలం 92 సెకన్లలో చెప్పి ‘Triumph World Records’ లో చోటు దక్కించుకుంది. ఇలా తన ప్రతిభతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఆర్నాను చూసి ఆమె తల్లి నేహా గుప్తా తెగ సంబరపడిపోతున్నారు. ‘రెండేళ్ల వయసులోనే నా కూతురుకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని గ్రహించాను. అప్పటినుంచే మేం ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నాం. నా గారాల పట్టి భవిష్యత్‌లో మరెన్నో ప్రపంచ రికార్డులు సృష్టించగలదు’ అని ధీమాగా చెబుతున్నారు నేహా.
ప్రోత్సహిస్తే చిన్న వయసులోనే పిల్లలు అద్భుతాలు సృష్టించగలరు అనడానికి ఆర్నానే చక్కటి ఉదాహరణ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!