చర్మం బాగుండాలంటే.. ఈ జాగ్రత్తలు!

చర్మ సంరక్షణ విషయంలో మనం ఓ రకంగా అదృష్టవంతులమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుడ్‌ అలర్జీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఇక్కడి వారిలో ఉండవు. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో చర్మంలో కూడా చాలా మార్పులు కనిపిస్తుంటాయి.

Published : 19 Jun 2024 22:24 IST

చర్మ సంరక్షణ విషయంలో మనం ఓ రకంగా అదృష్టవంతులమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుడ్‌ అలర్జీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఇక్కడి వారిలో ఉండవు. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో చర్మంలో కూడా చాలా మార్పులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో- చర్మం రఫ్‌గా తయారవుతున్నా.. డల్‌గా కనిపిస్తున్నా ఓసారి వైద్య నిపుణులను సంప్రదించి అలర్జీ టెస్ట్ చేయించుకోవడం అవసరం. దీంతో పాటు చర్మ సంరక్షణకు సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

⚛ మన శరీరానికి సరిపడే ఆహారం మాత్రమే తీసుకోవాలి. అదే మన ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి జంక్‌ ఫుడ్స్‌, డెయిరీ ప్రొడక్ట్స్‌ తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి.

⚛ ఏ కాలమైనా సరే- బయటికి వెళ్లేటప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి.

⚛ అదేవిధంగా అవసరాన్ని బట్టి డెర్మటాలజిస్ట్‌ సలహా మేరకు సి-విటమిన్‌ అధికంగా లభించే సీరంను రోజూ చర్మానికి రాసుకోవాలి. ఇది చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది.

⚛ చర్మంలో తేమ స్థాయులు తగ్గకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ప్రత్యేకించి మెడ భాగంలో, కళ్ల కింద మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దన చేసుకోవాలి.

⚛ రోజుకు రెండుసార్లు శుభ్రమైన నీటితో ఫేస్‌ వాష్ చేసుకోవాలి. ముఖం కడుక్కునేటప్పుడు చేతులతో మరీ గట్టిగా రుద్దకూడదు. ఎందుకంటే ఇలా చేస్తే చర్మం పొడిబారిపోయే ప్రమాదముంది.

⚛ మచ్చలు, మొటిమలు ఏర్పడితే వాటిని గిల్లకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతం మరింత అందవిహీనంగా తయారవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్