Published : 10/01/2023 21:26 IST

చాక్లెట్ మసాజ్‌తో మెరిసే చర్మం..!

చర్మం ప్రకాశవంతంగా మెరవాలన్నా, నిర్జీవమైపోయిన చర్మాన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలన్నా అది శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగడం వల్లనే సాధ్యమవుతుంది. అందుకు చాక్లెట్ మసాజ్ చక్కగా తోడ్పడుతుంది. స్పా ట్రీట్‌మెంట్లలో భాగంగా చేసే ఈ మసాజ్‌లో డార్క్ చాక్లెట్‌తో పాటు ఏదో ఒక అత్యవసర నూనెని కూడా కలుపుతారు. ఈ మిశ్రమంతో శరీరమంతా మర్దన చేయడం ద్వారా శరీరంలోని అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాదు.. చాక్లెట్‌లోని కొకోవా శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల చేస్తుంది. అవి చర్మం కింద దాగున్న కొవ్వుల్ని కరిగించడంలో సహకరిస్తాయి. ప్రత్యేకించి చలికాలంలో పొడిబారిపోయి నిర్జీవమైన శరీరాన్ని తిరిగి పునరుత్తేజితం చేయడానికి, కండరాల నొప్పుల్ని తగ్గించడానికి కూడా ఈ మసాజ్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇలా మసాజ్ చేసే క్రమంలో మానసిక ప్రశాంతత చేకూరడంతో పాటు శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది.

మలినాల్ని తొలగించడానికి..

వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మపు రంధ్రాల్లో చేరిపోయి మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడుతుంటాయి. మనం ఎంతగా రుద్ది ముఖం కడుక్కున్నా వాటి అవశేషాలు ఇంకా ఆ రంధ్రాల్లోనే ఉండిపోతాయి. అత్యవసర నూనెలతో మసాజ్ చేయించుకోవడం వల్ల అవి తొలిగే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మపు రంధ్రాల్లో ఇరుక్కుపోయిన దుమ్ము, ధూళి అవశేషాలు మెత్తబడి త్వరగా వదిలిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. మర్దన చేసే క్రమంలో శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది. మనసుకూ హాయిగా ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని