ఫోన్‌ శుభ్రం చేద్దాం...

మనకు నిత్యం హస్తాభరణంలా మారిన ఫోన్‌లో చేరే వైరస్‌లు దాని పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో, అలాగే ఫోన్‌పై పేరుకొనే బ్యాక్టీరియాలు మనకి పలు అనారోగ్యాలనూ.. తెచ్చి పెడతాయంటున్నారు నిపుణులు.

Published : 04 Jan 2023 00:48 IST

మనకు నిత్యం హస్తాభరణంలా మారిన ఫోన్‌లో చేరే వైరస్‌లు దాని పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో, అలాగే ఫోన్‌పై పేరుకొనే బ్యాక్టీరియాలు మనకి పలు అనారోగ్యాలనూ.. తెచ్చి పెడతాయంటున్నారు నిపుణులు. పిల్లల చేతికీ అందే ఫోన్‌ను రెండు రోజులకొకసారి శుభ్రపరిచి అనారోగ్యాలను దరిచేరకుండా చేయాలని సూచిస్తున్నారు. హ్యాండ్‌బ్యాగుకు ఆకర్షణీయంగా, అలాగే ఫోన్‌ను శుభ్రపరచడంలో ఉపయోగపడే పలు టూల్స్‌ గురించి తెలుసుకుందాం.

కీచెయిన్‌.. క్లీనింగ్‌ వైప్స్‌ ఉండే స్క్రీన్‌ క్లీనర్‌ కీచెయిన్‌ను హ్యాండ్‌బ్యాగుకు లేదా ఫోన్‌కు తగిలించుకొనే సౌకర్యం ఉంటుంది. వీలైనప్పుడల్లా ఈ వైప్స్‌తో ఫోన్‌ను శుభ్రపరుచుకో వచ్చు. ఈ కీచెయిన్‌ బ్యాగుకు అదనపు అలంకరణగానూ మారుతుంది.

స్క్రీన్‌ క్లీనర్‌ కిట్‌ ఐగ్లాస్‌ వాష్‌ కీచెయిన్‌ హ్యాండుబ్యాగు లేదా వాహనతాళానికి తేలికగా అటాచ్‌ చేసుకోవచ్చు. ఇందులో మృదువుగా పఫ్‌లా ఉండే టూల్‌తో సమయం ఉన్నప్పుడు ఫోన్‌పై మురికిని తొలగించుకోవచ్చు. అలాగే మొబైల్‌ స్టాండు, స్క్రీన్‌ క్లీనర్‌ కలిసి ఉండే ప్రత్యేక కీచెయిన్‌ హ్యాండుబ్యాగుకు తగిలించుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు ఫోన్‌ను శుభ్రం చేసుకోవచ్చు.

క్లీనింగ్‌ కిట్‌.. చిప్‌, ఛార్జింగ్‌ వైర్‌ను ఇన్సెర్ట్‌ చేసే ప్రాంతాలను శుభ్ర పరచడానికి ఇయిర్‌బడ్స్‌లాంటి మినీ ఫోం టిప్డ్‌ క్లీనింగ్‌ స్వాబ్స్‌, స్టిక్స్‌ ఈ క్లీనింగ్‌ కిట్‌లో ఉంటాయి. వీటితోపాటు ఫోన్‌ స్క్రీన్‌ను శుభ్రపరచడానికి డస్ట్‌ క్లీనింగ్‌ క్లాత్‌ కూడా ఉంటుంది. వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ కిట్‌ను వినియోగించి బ్యాక్టీరియాను దూరం చేయడం మంచిది.

గ్వీ బటన్‌.. మైక్రోఫైబర్‌ సెల్‌ఫోన్‌ స్క్రీన్‌ క్లీనర్‌లో ఉండే మృదువైన గ్వీ బటన్‌తో ఫోన్‌ను సునాయసంగా శుభ్రం చేయొచ్చు. కంటికి కనిపించని మురికిని ఇది పూర్తిగా పీల్చడమే కాకుండా ఫోన్‌ను మెరిసేలా మారుస్తుంది. అలాగే ఐ రోలర్‌తో ఫోన్‌ స్క్రీన్‌పై మృదువుగా రోల్‌ చేస్తే చాలు. ఇందులోని ద్రావణం ఫోన్‌పై మురికిని క్షణాల్లో మటుమాయం చేస్తుంది. దీంతో ఫోన్‌పై పేరుకున్న బాక్టీరియా తొలగిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్