కొనే ముందు.. ఒక్క క్షణం!
కొంతమందికి దుస్తులు కొనడానికి ఓ సమయం, సందర్భం అంటూ ఉండదు. కనిపించిదల్లా కొనేస్తారు. కొన్ని రోజులు వాడగానే సరిపోలేదనో, పాతవైపోయాయనో పక్కన....
కొంతమందికి దుస్తులు కొనడానికి ఓ సమయం, సందర్భం అంటూ ఉండదు. కనిపించిదల్లా కొనేస్తారు. కొన్ని రోజులు వాడగానే సరిపోలేదనో, పాతవైపోయాయనో పక్కన పడేస్తారు. అలాంటి అలవాటు మీకూ ఉందా? అయితే దాన్నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండి!
* సరదా కోసం షాపింగ్‌కి వెళ్తే కొనకుండా ఉండలేకపోతున్నాం అంటారా..? అయితే ఈసారి ఓ పని చేయండి.. డెబిట్, క్రెడిట్ కార్డులను వెంట తీసుకెళ్లొద్దు. రానూ, పోనూ ఛార్జీలు, మధ్యలో మీ చిన్న చిన్న ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని మాత్రమే వెంట తీసుకెళ్లండి.
* అయినా ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా ఆన్లైన్ పేమెంట్సే కదా! కార్డులతో పనేముందన్న డౌట్ మీకు రావచ్చు. ఇలాంటి సమస్యకు ‘స్పెండింగ్ ట్రాకర్ యాప్స్’ చక్కటి పరిష్కార మార్గం చూపిస్తున్నాయి. దీన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని.. మీరు చేయబోయే షాపింగ్ కోసం ఎంత ఖర్చు పెడతారో.. ఆ మొత్తాన్ని అందులో ఉండే ఆప్షన్ల ద్వారా జమ చేసుకోవచ్చు. ఇది మీ సేవింగ్స్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మీరు అందులో యాడ్ చేసిన మొత్తం మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.. తద్వారా అనవసర ఖర్చులూ తగ్గుతాయి.
* కొంతమంది చివరి నిమిషంలో హడావిడిగా ఏవో ఒకటి అనుకొని కొనేస్తుంటారు. దీనివల్ల మీరు కొనుక్కున్న వాటిపై సంతృప్తి ఉండదు. అలా జరగకూడదంటే.. సందర్భానికి కొన్ని రోజుల ముందే షాపింగ్ చేయడం, షాపింగ్ బాగా తెలిసిన వారిని మీ వెంట తీసుకెళ్లడం మంచిది.
* కొందరు షాపింగ్‌కి వెళ్తారు.. కానీ ఏం కొనాలో స్పష్టత ఉండదు. దాంతో ఖర్చు సంగతి గమనించుకోకుండా బడ్జెట్ గీత దాటేస్తుంటారు. అందుకే షాపింగ్‌కి వెళ్లే ముందు ఓసారి మీ బీరువా తెరిచి చూడండి. ఇదివరకే ఉన్న దుస్తులు పరిశీలిస్తే.. ఇప్పుడేం కొనాలో ఒక అవగాహన వస్తుంది.
* చాలామంది దుస్తులు కొనేటప్పుడు వాటికి ఇచ్చే రాయితీలను దృష్టిలో పెట్టుకొని.. అప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా పడుంటుందిలే అని కొనేస్తుంటారు. దానికంటే ముందు వాటి నాణ్యత, అవి మీకు నప్పుతాయో, లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి! ఇలా చేయడం వల్ల ఆ తర్వాత మీరు అసౌకర్యంగా ఫీలవ్వాల్సిన అవసరం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!