Women Health: ఆ సమస్యా... అయితే ఇలా చేయండి

సాధారణంగా మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారూ, యాంటీబయోటిక్స్‌ తరచూ వాడేవారిలో ఈ ఇబ్బంది ఎక్కువ. దీన్ని మందులతోనే కాదు... ఆహారపు అలవాట్లతోనూ అధిగమించొచ్చు అంటారు నిపుణులు.

Published : 29 May 2023 00:11 IST

సాధారణంగా మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారూ, యాంటీబయోటిక్స్‌ తరచూ వాడేవారిలో ఈ ఇబ్బంది ఎక్కువ. దీన్ని మందులతోనే కాదు... ఆహారపు అలవాట్లతోనూ అధిగమించొచ్చు అంటారు నిపుణులు. అదెలాగంటే...

కొబ్బరి నీళ్లతో చల్లగా... మూత్రం తక్కువగా వస్తున్నా, ఆ ప్రాంతంలో మంట అనిపిస్తున్నా మీ శరీరంలో నీటి శాతం తగ్గిందని గుర్తుంచుకోండి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఈ సమయంలో కొబ్బరినీళ్లు చక్కటి ఔషధంలా పనిచేస్తాయి. ఎలక్ట్రోలైట్స్‌తో పాటు ఇతర పోషకాలను అందించి...నిస్సత్తువ దరిచేరకుండా, డీహైడ్రేషన్‌నీ తగ్గిస్తాయి.

ప్రోబయోటిక్స్‌..  వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు చెడు బ్యాక్టీరియాపై పోరాడేందుకు సాయపడతా యి. అంటే పెరుగు, మజ్జిగ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ప్రోబయోటిక్‌ పిల్స్‌ కూడా తీసుకోవచ్చు.

విటమిన్‌ ‘సి’ తో.. తాజా పండ్లు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాటిల్లోనూ విటమిన్‌ సి అధికంగా ఉండేవైతే ఇంకా మేలు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉడికించుకొని తినాలి. వేపుళ్లు, మసాలా ఆహారానికి దూరంగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు తగ్గేవరకూ పచ్చళ్లు, ఉప్పు, కారం కూడా తక్కువగా తీసుకుంటే మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్