
బరువులెత్తే వ్యాయామాలు మనకు మంచివా? కాదా?
కీర్తన తన అధిక బరువును తగ్గించుకోవడానికి బరువులెత్తే వ్యాయామాలు ఎంచుకుంది. అయితే ఈ వ్యాయామాలు మహిళలకు మంచివి కాదని ఇంట్లో వాళ్లు చెప్పడంతో ఆ ఆలోచన మానుకుంది.
బరువులెత్తే వ్యాయామాలు ఎంచుకుంటే తనకూ పురుషుల్లా కండలు తిరిగిన దేహం వస్తుందేమోనని భయపడి ఈ వర్కవుట్స్ జోలికే వెళ్లట్లేదు శృతి.
ఇలా బరువులెత్తే వ్యాయామాలంటే.. అవి కేవలం పురుషులకు మాత్రమే పరిమితమనుకుంటారు చాలామంది. కానీ మహిళలకూ వీటి వల్ల ఫిట్నెస్ పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు నిపుణులు. శరీరంలోని అనవసర కొవ్వులు కరిగించడం దగ్గర్నుంచి మానసిక దృఢత్వం దాకా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం దగ్గర్నుంచి చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకునే దాకా.. ఇలా ఈ వ్యాయామాలతో బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయట! అయితే ఇన్ని తెలిసినా కొంతమందిలో బరువులెత్తే వ్యాయామాలపై ఇంకా పలు సందేహాలు, అపోహలు నెలకొన్నాయి. అలాంటి కొన్ని అపోహలు, వాటి వెనకున్న అసలు వాస్తవాల గురించి నిపుణులేమంటున్నారో తెలుసుకుందాం రండి..
* బరువులెత్తితే సిక్స్ ప్యాక్ బాడీ వస్తుంది.
మహిళల విషయంలో ఇది ముమ్మాటికీ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కండరాల సామర్థ్యం పెంచి చక్కటి దేహ దారుఢ్యాన్ని అందించడంలో టెస్టోస్టిరాన్ హార్మోన్ పాత్ర కీలకం. ఇది మహిళలతో పోల్చితే పురుషుల్లో 14 నుంచి 20 రెట్లు అధికంగా ఉంటుందట! కాబట్టి మందులు, స్టెరాయిడ్స్, సప్లిమెంట్లు.. వంటివి వాడితే తప్ప కేవలం బరువులెత్తడం వల్ల మనలో కండలు తిరిగిన దేహ దారుఢ్యం వచ్చే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయులు క్రమంగా తగ్గిపోతుంటాయి. దీనివల్ల ఎముకల సాంద్రత కూడా తగ్గుతుంది. ఈ సమస్య తలెత్తకూడదంటే బరువులెత్తే వ్యాయామాల్ని రోజువారీ వర్కవుట్ రొటీన్లో భాగం చేసుకోమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజూ ఐదు నుంచి ఏడు కిలోల దాకా బరువులెత్తడం సురక్షితం అంటున్నారు.
* కొన్నాళ్లకు బరువులెత్తడం ఆపేస్తే కండరాలు కొవ్వుగా మారతాయి.
కండరాలు కొవ్వుగా మారడం, కొవ్వు కండరాలుగా మారడం అసలు జరగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కండరాల కణజాలాలు, కొవ్వు కణజాలాలు వేర్వేరు నిర్మాణాలను కలిగి ఉంటాయని, ఈ రెండూ పరస్పరం మార్పు చెందవని చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే కండరాలు శరీరంలోని కొవ్వు కణజాలాల్ని కరిగించడంలో సహకరిస్తాయట! అయితే ఒకవేళ సడెన్‌గా బరువులెత్తడం ఆపేసినట్లయితే అప్పటిదాకా బిగుతుగా, దృఢంగా ఉన్న కండరాలు క్రమంగా బలహీనమైపోతుంటాయి. తద్వారా శరీరాకృతిలో మార్పు కనిపిస్తుంది. అందుకే ఏదైనా సమస్య ఉంటే తప్ప బరువులెత్తడం ఆపకూడదంటున్నారు నిపుణులు. తద్వారా అటు శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు.. ఇటు ఫిట్‌గానూ ఉండచ్చు.
* కీళ్ల నొప్పులుంటే బరువులెత్తకూడదు..
ఇదీ చాలామందిలో ఉన్న ఓ అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు.. వారు ఎత్తగలిగినంత బరువును రోజూ నాలుగు నెలల పాటు ఎత్తినట్లయితే.. వారిలో నొప్పి దాదాపు 43 శాతం తగ్గినట్లు జర్నల్ ఆఫ్ రుమటాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. బరువులెత్తని వాళ్లతో పోల్చితే ఇలాంటి వారు తమ రోజువారీ పనుల్ని సైతం ఎంతో చురుగ్గా చేసుకుంటారట! అంటే.. ఒకరకంగా బరువులెత్తే వ్యాయామాలతో కీళ్లకు చక్కటి వ్యాయామం అంది అవి మరింత దృఢమవుతాయంటున్నారు నిపుణులు. అందుకే డాక్టర్ సలహా మేరకు కీళ్ల నొప్పులున్న వారూ బరువులెత్తే వ్యాయామాలను సాధన చేయచ్చు.. అయితే అది కూడా మీరు ఎత్తగలిగినంత, మీకు సౌకర్యంగా ఉన్నంత వరకే అని గుర్తుపెట్టుకోండి.
* ఈ వ్యాయామాలతో బీపీ పెరుగుతుంది.
బరువులెత్తే క్రమంలో రక్తపోటు పెరుగుతుంది కాబట్టి బీపీ సమస్య ఉన్న వారు ఈ వ్యాయామాలకు దూరంగా ఉండమని డాక్టర్లు సాధారణంగా సలహా ఇస్తుంటారు. అయితే నిజానికి ఏరోబిక్ వ్యాయామాలు, బరువులెత్తే వ్యాయామాలు సిస్టోలిక్ రక్తపోటును రెండు శాతం, డయాస్టోలిక్ రక్తపోటును నాలుగు శాతం తగ్గిస్తాయట! అందుకే బీపీ ఉన్న వారూ బరువులెత్తచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సంస్థ. ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే అధిక రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతోంది. అయితే - బీపీ సమస్య ఉన్న వారు ఇలా బరువులెత్తే విషయంలో వ్యక్తిగత వైద్యులను సంప్రదించి వారి సలహా పాటించడం ఉత్తమం.
* గర్భిణులు బరువులెత్తే వ్యాయామాలు చేయకూడదు.
ఇది కొంతవరకు నిజమే అయినా.. అందరు గర్భిణులకు ఇది వర్తించదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొత్తగా ఈ వర్కవుట్‌ను తమ రొటీన్లో భాగం చేసుకోవాలనుకునే గర్భిణులు దీనికి పూర్తి దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అలాగే రిస్కీ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలు సైతం దీనికి దూరంగా ఉంటేనే మంచిదట! ఇక ఇదివరకే ఈ వ్యాయామం సాధన చేస్తున్నట్లయితే అలాంటి వారు డాక్టర్ సలహా మేరకు ఈ వ్యాయామాన్ని నిస్సందేహంగా కొనసాగించచ్చట! మరీ ముఖ్యంగా గర్భిణిగా ఉన్నప్పుడు బరువులెత్తడం వల్ల కొన్ని ప్రయోజనాలు సైతం చేకూరతాయట! ఇందులో భాగంగా.. క్రమంగా పొట్ట పెరుగుతున్న కొద్దీ వచ్చే నడుంనొప్పి.. వంటి శారీరక నొప్పులు తగ్గడంతో పాటు, సుఖ ప్రసవం అయ్యే అవకాశాలూ ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే - ఈ విషయంలో మీ వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం మాత్రం మర్చిపోవద్దు.
ఇలా వీరే కాదు.. ఏ వయసులో ఉన్న మహిళలైనా ఈ వ్యాయామాలు సాధన చేయచ్చట! అయితే కొత్తగా మొదలుపెట్టే వారు మాత్రం అనుభవజ్ఞులైన నిపుణుల్ని ఎంచుకొని వారి పర్యవేక్షణలో సాధన చేస్తే సత్ఫలితాలుంటాయట!
బరువులెత్తే వ్యాయామాలు చేసే విషయంలో కొంతమందిలో ఉన్న పలు సందేహాలు-వాటికి నిపుణులు చెబుతోన్న సమాధానాలేంటో తెలుసుకున్నారుగా! అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు కొత్తగా మొదలుపెట్టే వారు, గర్భిణులు, ఇతర అనారోగ్యాలున్న వారు మాత్రం ఒకసారి మీ ఆరోగ్యాన్ని డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని.. వారి సలహా తీసుకున్నాకే ఈ వ్యాయామాలు ప్రారంభించడం మంచిదని గుర్తు పెట్టుకోండి.
Advertisement
మరిన్ని

గర్భిణులకు ఏబీసీ జ్యూస్..
విమలకు ఆరోనెల వచ్చింది. ఆకలి తీరేలా ఆహారం తీసుకుంటుంది. పోషకాలకూ పెద్దపీట వేస్తుంది. అయినా అప్పుడప్పుడు నీరసించి పోతుంటుంది. ఇలాకాకుండా ఉండాలన్నా తక్షణ శక్తినివ్వాలన్నా ఏబీసీ జ్యూస్ సరైనది అంటున్నారు నిపుణులు. ఇది శక్తినే కాదు, శరీరంలోని మలినాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని, సౌందర్యాన్నీ పెంపొందిస్తుందని సూచిస్తున్నారు.తరువాయి

రెండు నెలలుగా నెలసరి రావట్లేదు.. ఆ మందులు వాడచ్చా?
హాయ్ మేడమ్. నాకు గత రెండు నెలల నుంచి పిరియడ్స్ రావట్లేదు. దాంతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మూత్రంలో రక్తం కనిపించింది. డాక్టర్ని సంప్రదిస్తే మరోసారి హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమన్నారు. అప్పటికీ నెగెటివ్ వస్తే పిరియడ్స్ రావడానికి....తరువాయి

అష్టాంగ యోగా ప్రయత్నిద్దామా...
మామూలుగానే మనం కాస్త నాజూగ్గా ఉంటాం. దానికి తోడు రోజంతా పనులూ కుటుంబ బాధ్యతల మూలంగా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. దీనికి స్వస్తి పలకాలంటే అష్టాంగ యోగ సాధనే ఉత్తమం. వివరంగా చెప్పాలంటే.. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి - వీటి సమాహారమే అష్టాంగ యోగం....తరువాయి

ప్రయాణాల్లో.. చర్మం జాగ్రత్త!
వేసవిలో పిల్లలకు సెలవులనో...చల్లదనం కోసమో ప్రయాణాలు కట్టేస్తుంటాం. కావాల్సినవన్నీ జాగ్రత్తగా సర్దేసుకుంటాం. చర్మసంరక్షణ జాగ్రత్తలకీ చోటిచ్చారా మరి? చాలాసార్లు వెళ్లేది మనవాళ్ల ఇంటికేగా అని క్రీములు వగైరా తీసుకెళ్లం. వేరే ప్రాంతాలకు వెళితే హోటళ్లలో ఇస్తారనో, అక్కడే ఏదో ఒకటి కొనుక్కోవచ్చనుకుంటాం. కొత్త చేయడం అన్న మాట విన్నారా? అది...తరువాయి

థైరాయిడ్.. అవగాహనతో ముప్పు తప్పించుకుందాం!
18 ఏళ్ల ప్రియకు నెలసరి సరిగ్గా రావడం లేదు సరికదా చాలా తొందరగా బరువు పెరిగిపోతోంది. 30 ఏళ్ల లతకు పెళ్త్లె ఏడేళ్లయినా ఇంకా పిల్లలు పుట్టలేదు.. వీరిద్దరి సమస్యలూ వేరైనా అందుకు కారణం మాత్రం ఒక్కటే అని వైద్యులు తేల్చారు. అదేంటంటే; థైరాయిడ్. ఈ పరిస్థితి కేవలం....తరువాయి

‘సత్తు’వనిచ్చే పానీయాలు!
మండే ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బోలెడు సహజ సిద్ధమార్గాలున్నాయి. అందులో ఒకటి చల్లటి పానీయాలు తీసుకోవడం. ఇవి దాహార్తి తీర్చడంతోపాటు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూస్తాయి. అందరికీ అందుబాటులో ఉండే ఆ రసాలు/పానీయాలు ఏంటో చూద్దామా.. మజ్జిగ... దీంట్లో ప్రొటీన్లు, క్యాల్షియం, విటమిన్ బి12 మెండుగా ఉంటాయి. కప్పు పెరుగులో రెండు కప్పుల ...తరువాయి

జుట్టు ఎక్కువగా ఊడుతోందా...
జుట్టు ఊడటానికి రకరకాల కారణాలుంటాయి. అయితే కొన్ని పనులకు దూరంగా ఉంటే ఈ రాలడం కొద్దిగా అదుపులో ఉంటుంది. లేదంటే మరింతగా ఊడిపోతుంది. కాబట్టి చేయకూడని పనులేంటంటే... హెయిర్ ట్రీట్మెంట్స్ వద్దు... జుట్టు సమస్యలున్నప్పుడు కురులను మృదువుగా చేయించుకోవడం, హెయిర్ రీబాండింగ్ లాంటి రకరకాల కేశ చికిత్సలకు వెళ్లొద్దు.తరువాయి

బెల్లాన్ని ఇలా తీసుకుంటే ప్రయోజనాలెన్నో!
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే బెల్లం తినాల్సిందే! మలబద్ధకం వేధిస్తోందా? దానికీ బెల్లమే పరిష్కారం! నెలసరి నొప్పులతో సతమతమవుతున్నారా? బెల్లం ఉందిగా! ఇలా చెప్పుకుంటూ పోతే బెల్లం తింటే నయం కాని అనారోగ్యమంటూ ఉండదంటే అది అతిశయోక్తి కాదు. అయితే ఈ బెల్లాన్ని....తరువాయి

పుచ్చకాయతో పాటు గింజలూ తినాలట.. ఎందుకో తెలుసా?
వేసవిలో మండుటెండల నుంచి ఉపశమనం పొందాలంటే పుచ్చకాయకు మించిన పండు మరొకటి లేదు. దాదాపు 95 శాతం నీటిని నింపుకొన్న ఈ సీజనల్ ఫ్రూట్లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలామంది ఈ పండును తినేటప్పుడు గింజలను పక్కన పడేస్తుంటారు. మరికొంతమంది తినేందుకు సులభంగా.....తరువాయి

Sexual Health: శృంగార జీవితం బాగుండాలంటే వ్యాయామాలు చేయాల్సిందే!
దాంపత్య జీవితంలో శృంగారం పాత్ర కీలకం! అయితే కొన్ని జీవనశైలి మార్పులు, అనారోగ్యాలు లైంగిక జీవితాన్ని దెబ్బ తీస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా స్థూలకాయం కారణంగా 43 శాతం మంది మహిళలు, 31 శాతం మంది పురుషులు లైంగిక జీవితానికి....తరువాయి

అక్కడ చెమటా? ఉపశమనం పొందండిలా!
ఈ వేసవి కాలం చెమట ఎన్నో సమస్యలకు దారితీస్తుంది.. వాతావరణంలోని తేమ వల్ల శరీరానికి గాలి తగిలినా.. జిడ్డుదనం, దురద, మంట.. వంటివి సహజం. ఇదిలా ఉంటే.. గాలి తగలని వ్యక్తిగత భాగాల్లో తలెత్తే ఇబ్బందుల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వేసవిలో వచ్చే వెజైనా ఇన్ఫెక్షన్ కూడా ఇలాంటిదే! సిగ్గు, బిడియంతో ఈ సమస్య గురించి....తరువాయి

ఇమ్యూనిటీని పెంచే పుదీనా షర్బత్.. చిటికెలో రడీ!
వేసవిలో అధిక వేడికి శరీరంలోని శక్తి ఇట్టే అయిపోతుంటుంది. దాంతో డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండడం కోసం చాలామంది జ్యూస్‌లు తాగుతుంటారు. ఈ క్రమంలో శరీరానికి తేమను అందించి, వ్యాధినిరోధక శక్తిని పెంచే పుదీనా షర్బత్...తరువాయి

గర్భిణులకు కొబ్బరి నీళ్లు
మితిమీరిన ఎండలతో గొంతెండిపోవడం, తలనొప్పి, చెమటలు లాంటి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటా బయటా పనిచేసే మహిళలకు ఈ కాలం మరింత అలసటగా ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరి బొండాంని చూస్తే ప్రాణం లేచొస్తుంది కదూ! నిస్సత్తువను తరిమికొట్టే కొబ్బరినీళ్లలో ఎన్ని సుగుణాలున్నాయో చూడండి...తరువాయి

నీటిని ఇలా తాగేద్దాం!
నీరు.. మన శరీరంలోని అన్ని జీవక్రియలకు అవసరమైనది. సరిపడినన్ని నీళ్లు తాగితే మనకెదురయ్యే సగం ఆరోగ్య సమస్యలను ఇట్టే తగ్గించుకోవచ్చట! కిడ్నీలో రాళ్లు, అధిక బరువు వంటి సమస్యలు కూడా తక్కువ నీరు తాగడం వల్లే ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ తెలిసినా.. నీళ్లు తాగడానికి ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. రోజు మొత్తంలో కలిపి లీటరు కంటే ఎక్కువ నీరు తాగని వారు ఎందరో. అందుకే నీళ్లు తాగడానికి కాస్త భిన్నమైన మార్గాలను వెతుక్కోవడం.....తరువాయి

లాభాలు పండంత!
వేసవి వచ్చేసింది. ఎండలు చిటపటలాడుతున్నాయి. ఒంట్లోంచి చెమటలు కారడం, చిన్న పనికే అలసిపోవడం, చిరాకు, అసహనం... ఇదంతా మామూలే కదూ! అబ్బబ్బ.. ఇంకెన్ని రోజులిలా అవస్థపడాలి- అంటూ అశాంతికి లోనయ్యే బదులు గ్రీష్మతాపం నుంచి బయట పడే మార్గాల గురించి ఆలోచించడం మేలు కదూ! అప్పుడు ముందుగా గుర్తొచ్చేది పుచ్చకాయ.. పైన ఆకుపచ్చగా, లోపల ఎర్రగా ఉండే పుచ్చకాయ పిల్లలకు మరీ మరీ ఇష్టం...తరువాయి

నెలసరి నొప్పిని తగ్గించే జల్జీరా!
ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చల్లచల్లగా.... రుచికరమైన స్పైసీ జల్జీరా తాగితే చాలా బాగుంటుంది. ఇది శరీరానికి చలువతోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. జల్జీరా శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. దాంతోపాటు జీర్ణక్రియను మెరుగు పరిచి గ్యాస్ సమస్యను దూరం చేస్తుంది. దీంట్లో వాడే నల్లుప్పు గుండెలో మంట, కడుపు ఉబ్బరాలను తగ్గించి, శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది....తరువాయి

నవమి నైవేద్యంతో మేలైన ఆరోగ్యం!
కోరిన కోర్కెలు తీర్చే కోదండరాముడి పుట్టినరోజునే మనం 'శ్రీరామనవమి'గా జరుపుకొంటాం. ఇందులో భాగంగా శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి.. నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ పదార్థాల్ని అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. ఈ క్రమంలో వీటి తయారీ విధానం.....తరువాయి

ఈ హెల్దీ డైట్‌తో వేసవి సమస్యలను అధిగమించండి!
ఇతర సీజన్లతో పోల్చితే వేసవిలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్ స్థాయుల్లో మార్పులు....తరువాయి

అవాంఛిత రోమాలకు అదే కారణమా?
నమస్తే మేడమ్.. నా వయసు 18. ఎత్తు 5’1’’. బరువు 40 కిలోలు. నేను గత ఏడాది కాలంగా పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నా. ఎనిమిది నెలల నుంచి Dronis 20, మూడు నెలల నుంచి Krimson 35 మాత్రలు వాడుతున్నా. బ్లీడింగ్ రెండు రోజులే అవుతుంది. ప్రస్తుతం నేను మాత్రలు వాడడం ఆపేశాను. 40 రోజుల నుంచి....తరువాయి

శరీరానికి తక్షణ శక్తినిచ్చే ‘ఖర్జూరం’!
ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ క్రమంలో ముస్లింలు ఆచరించే కఠిన ఉపవాస దీక్షకు అత్యంత ప్రాధాన్యం ఉంది. రోజూ ఈ దీక్ష విరమించేటప్పుడు వారు తీసుకునే ఆహార పదార్థాల్లో ‘ఖర్జూరాలు’ తప్పకుండా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఈ పండు....తరువాయి

ఇమ్యూనిటీని పెంచే ‘ఉగాది పచ్చడి’!
ప్రతి పండక్కీ ఏదో ఒక ప్రత్యేకమైన వంటకం ఉండనే ఉంటుంది. పాత కాలపు సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూ తయారు చేసుకునే ఈ విభిన్న వంటకాల్లో మన ఆరోగ్యాన్ని పెంచే సుగుణాలు బోలెడుంటాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి చేసుకునే ఉగాది పచ్చడీ ఇందుకు మినహాయింపు కాదు. ఆరు రుచులు మేళవించి తయారుచేసుకునే ఈ ప్రత్యేకమైన......తరువాయి

షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం!
మన సంస్కృతి సంప్రదాయాల్లో ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మనం వండుకునే వంటకాలన్నీ ఆరోగ్యాన్ని ప్రసాదించేవే! ఉగాది పచ్చడి కూడా అలాంటిదే! తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు.. వంటి షడ్రుచులు కలగలిసిన ఈ పచ్చడితో శారీరక, మానసిక ఆరోగ్యాల్ని......తరువాయి

ప్రసవం తర్వాత ఈ నొప్పులు సహజమేనా?
నమస్తే డాక్టర్. నాకు పాప పుట్టి ఏడాది దాటింది. సహజ ప్రసవం కోసం ప్రయత్నించినా కాకపోయే సరికి సిజేరియన్ చేశారు. అయితే ఆ తర్వాత నాకు కటి వలయంలో నొప్పులు ఎక్కువగా వచ్చాయి. డాక్టర్ని సంప్రదిస్తే పరీక్షలు చేసి సమస్య లేదన్నారు. అయినా ఇప్పటికీ నొప్పులు తగ్గట్లేదు. పడుకున్నప్పుడు, పక్కకు తిరిగినప్పుడు.. ఇలా భంగిమ మార్చినప్పుడల్లాతరువాయి

అందుకే వేసవిలో ఈ జావ తాగాల్సిందే!
వేసవికాలంలో ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. అలాగని ఏమీ తినకపోతే నీరసం ఆవహిస్తుంది.. ముఖ్యంగా ఉదయం తీసుకునే ఆహారం రోజంతా మనం హుషారుగా పనిచేయడానికి కావాల్సిన శక్తినిచ్చేలా ఉండాలి. ఇందుకు సరైన ఎంపిక చిరుధాన్యాలతో చేసిన జావ. ఇది సులువుగా అరుగుతుంది. రోగనిరోధక శక్తి.....తరువాయి

Summer : ఇవి ఎందుకు తినకూడదో తెలుసా?!
ఆరేళ్ల సహస్రకు ఐస్‌క్రీమ్ అంటే ప్రాణం.. అందుకే వేసవిలో రోజుకొకటి తప్పకుండా తింటుంది. పద్దెనిమిదేళ్ల శాషాకు జంక్‌ఫుడ్ అంటే చాలా ఇష్టం. వేసవిలోనూ వాటిని వదలదు. 24ఏళ్ల సురభి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే రెండు లేదా మూడుసార్లు టీ /కాఫీ తాగాల్సిందే..! మీరూ అంతేనా..? అయితే వెంటనే మీ ఆహారపుటలవాట్లలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వేసవి కాలంలో కొన్ని రకాల.....తరువాయి

Irregular Periods : నా అధిక బరువుకు అదే కారణమా?
హాయ్ మేడం. నేను గత కొన్ని రోజుల నుంచి నీటి బుడగలతో బాధపడుతున్నా. ఫలితంగా బరువు పెరగడం, జుట్టు రాలడం, చుండ్రు, అవాంఛిత రోమాలు.. మొదలైన సమస్యల్ని ఎదుర్కొంటున్నా. నేనొక సాధారణ ఉద్యోగిని. 8 గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఎన్ని.....తరువాయి

చెమటకాయలకు చెక్ పెట్టండిలా!
వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతకు తోడు శరీరంలో నుంచి ఎక్కువ మొత్తంలో నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. ఈ క్రమంలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామందిని వేధించే సమస్యే చెమటకాయలు. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, వీపు, పొట్ట, చేతులు.. మొదలైన భాగాల్లో ఏర్పడతాయి. దీనివల్ల ఒళ్లంతా దురద పుట్టి.. ఆయా భాగాల్లో ఎర్రగా....తరువాయి

పుట్టే బిడ్డల్లో అవయవలోపాలు ఎందుకొస్తాయి?
నమస్తే మేడం. నా వయసు 26. పెళ్లై ఆరేళ్లయింది. నాకు 4 ఏళ్ల బాబున్నాడు. ఈమధ్యే మళ్లీ బాబు పుట్టాడు. అయితే మా రెండో బాబు రెండు చెవులు, ఒక ముక్కు రంధ్రం మూసుకుపోయి పుట్టాడు. కిడ్నీలో వాపుందని, గుండె సమస్య కూడా ఉందని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోలేకపోతున్నాడని.....తరువాయి

ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తున్నారా?
'వాడికి అస్సలు నేనంటే లెక్కే లేదు.. ఎప్పుడూ చెప్పిన టైంకి రాడు.. ఈసారి గట్టిగా క్లాస్ తీసుకోవాల్సిందే’ అని తిట్టుకుంటూ ప్యాకెట్ల మీద ప్యాకెట్లు చిప్స్ ఖాళీ చేసేస్తోంది నా ఫ్రెండ్ మాధవి.. విషయమేంటా అని కనుక్కుంటే తన లవర్‌తో ఓ చిన్న గొడవ. ఆ తర్వాత నేను సర్దిచెప్పడం, తను ఫోన్ చేసి నార్మల్‌గా మాట్లాడట......తరువాయి

పొట్ట చుట్టూ కొవ్వు కరగాలంటే..!
మనకు నచ్చిన ఆహారం తీసుకోవడం, మొబైల్ మాయలో పడిపోయి ఏ అర్ధరాత్రికో పడుకోవడం, వ్యాయామం చేయడానికి బద్ధకించడం.. మన జీవనశైలిలో వచ్చే ఈ మార్పులే పొట్ట చుట్టూ కొవ్వు (బెల్లీ ఫ్యాట్) పేరుకుపోవడానికి కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. నిజానికి మనలో చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తారు కానీ.. ఇది మన శరీరంలో ఇన్సులిన్‌ను...తరువాయి

World Sleep Day : అపోహలు - వాస్తవాలు!
ఉద్యోగం చేసే రాగిణికి ఇంట్లో పనులన్నీ పూర్తయ్యే సరికే అర్ధరాత్రి అవుతుంటుంది. ఇక ఉదయాన్నే లేచి మళ్లీ పనులతో పరుగులు పెట్టాల్సిందే! దీంతో ప్రయాణంలో పడుకుంటూ నిద్ర సరిపెట్టుకుంటుంది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా గ్యాడ్జెట్లతోనే గడుపుతుంటుంది మాలిని. దీంతో నిద్ర సరిపోక ఆఫీస్‌లో కునుకు తీస్తుంటుంది. సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే తీరిక లేని పనులు, నైట్ షిఫ్టులు, జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లతో పాటు నిద్ర గురించి మనలో....తరువాయి

హోలీ వేళ.. నోరూరించే దేశీ డ్రింక్స్..!
చూడచక్కని రంగుల మెరుపుల మధ్య హోలీ మళ్లీ రానే వచ్చింది. ఈ పండక్కి కేవలం రంగుల ఆటలే కాదు.. రకరకాల పోటీలూ ప్రాధాన్యం వహిస్తాయి. బంధుమిత్రులందరితో కలిసి రంగులు చల్లుకుంటూ చేసుకునే పండగే ఇది.. ఈ రోజున రంగులకున్నంత ప్రాధాన్యం హోలీ వేళ తీసుకునే ఆహారపదార్థాలకూ ఉంటుంది. అసలే ఎండాకాలం.. ఎండ వేడిమి నుంచి తప్పించుకోవడానికి....తరువాయి

వేసవిలో డీహైడ్రేషన్‌కి ఇలా చెక్ పెట్టండి..
వేసవి మొదలైపోయింది. నిన్న మొన్నటి వరకూ హాయిగా తాకిన చల్లగాలులు క్రమంగా వేడి పుంజుకుంటున్నాయి. తరచూ పెదాలు ఎండిపోవడం, నాలుక తడారిపోవడం వాతావరణంలో వేడి పెరిగేకొద్దీ తీవ్రమౌతాయి. కేవలం మంచినీళ్లతో ఈ సమస్యను అధిగమించడం కష్టం. కానీ ఆ మంచినీటినే మరింత శక్తిమంతంగా.....తరువాయి

కలయిక తర్వాత బ్లీడింగ్.. ఇది ప్రమాదకరమా?
హలో మేడమ్. నా బరువు 67 కిలోలు. ఎత్తు 4’8’’. నాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. మూడేళ్లుగా పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. నా సమస్యల్లా Post-Coital Bleeding (కలయిక తర్వాత బ్లీడింగ్). డాక్టర్ సలహా మేరకు పాప్‌స్మియర్ టెస్ట్ చేయించుకుంటే Cervical Erosion, Bacterial Vaginosis ఉన్నాయని....తరువాయి

నూనెల్ని పూర్తిగా మానక్కర్లేదు!
ఏమాత్రం నూనె వాడకుండా వంటలు రుచికరంగా ఉండాలంటే అది అన్నిటి విషయంలో సాధ్యం కాదు. అయితే నూనెల్లో ఉండే కొవ్వుల్లో మన శరీరానికి మంచివి, హాని చేసేవి.. రెండూ ఉంటాయి. ఈ క్రమంలో శరీరానికి కొవ్వులు కూడా కొంతవరకు అవసరమే. అయితే ఒక్కో నూనెలో ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కోదాని నుంచి ఒక్కో రకమైన ప్రయోజనం కలుగుతుంది.తరువాయి

అక్కడి కొవ్వును కరిగిద్దాం...
పద్మ ఏ దుస్తులను ఎంపిక చేసుకున్నా అసౌకర్యంగానే ధరిస్తుంది. భుజానికి కింద వైపు, ఛాతీకి ఇరుపక్కలా అదనపు కొవ్వు కారణంగా అక్కడ ఆకృతి మారిపోతోంది. టాప్ లేదా బ్లవుజు ఏది వేసుకున్నా ఆ ప్రాంతంలో ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఈ భాగంలో కొవ్వు ఎందుకు పేరుకుంటుంది? దాన్ని తగ్గించుకోవడం ఎలానో చెబుతున్నారు నిపుణులు...తరువాయి

మీ ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
పిండి రుబ్బాలంటే గ్రైండర్, బట్టలుతకాలంటే వాషింగ్ మెషీన్... బిల్లు కట్టాలంటే ఆన్లైన్ పేమెంట్.. ఏ పనైనా సరే.. ఇప్పుడు శరీరం అలిసిపోకుండా క్షణాల్లో ఇట్టే చేసేయచ్చు. ఆధునిక టెక్నాలజీ నిజంగా మన జీవితాలను ఎంత సుఖమయం చేస్తోందో గదండీ.. అలాగని తెగ ఆనందపడిపోకండి. ఎందుకంటే శారీరక శ్రమ లేని 'సెడెంటరీ లైఫ్‌స్త్టెల్' మనకు ఎన్నో రోగాలనూ 'బహుమతి'గా.....తరువాయి

మనం పవర్‌ఫుల్‌గా ఉండాలంటే ఇలా చేయాల్సిందే!
'అపురూపమైనదమ్మ ఆడజన్మ' అన్నాడో కవి. అవును.. నిజంగా ఆడజన్మ అపురూపమైందే! తల్లిగా, ఇల్లాలిగా, కూతురిగా, కోడలిగా.. మహిళల పాత్ర కేవలం ఇంటికే పరిమితం కాదు. సమాజాభివృద్ధిలో కూడా ఎంతోమంది మహిళలు కీలక పాత్ర పోషించడం చూస్తూనే ఉన్నాం. అయితే అటు ఇంట్లో, ఇటు సమాజంలో మహిళలు ఉన్నతి సాధించాలంటే వారు శారీరకంగా....తరువాయి

World Obesity Day: స్థూలకాయం.. ఈ విషయాలు మీకు తెలుసా?
మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం. అయితే ఒక్కోసారి ఇలాంటి మార్పులే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. కొన్ని అనారోగ్యాల్ని, దీర్ఘకాలిక సమస్యల్ని కట్టబెడతాయి. స్థూలకాయం కూడా అలా వచ్చిందే! చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ......తరువాయి

తల్లులకు, పిల్లలకు ఈ గింజలతో ప్రయోజనాలెన్నో..!
ప్రగతికి నాలుగు నెలల పాప ఉంది. ముందు నుంచీ తన జుట్టు ఒత్తుగా, పొడవుగా ఉండేది. కానీ ప్రసవమయ్యాక మాత్రం తన జుట్టు విపరీతంగా రాలుతోంది. బాబు పుట్టాక మధురిమ విపరీతమైన బరువు పెరిగింది. ప్రసవం తర్వాత ఇది సర్వసాధారణమే అయినప్పటికీ.. తానెంత ప్రయత్నించినా బరువు తగ్గట్లేదని, అందరూ ‘ఏంటి.. ఇంత లావుగా తయారయ్యావ్!’ అంటూ ఆశ్చర్యపోతున్నారని చెబుతోంది.తరువాయి

పిరియడ్స్ రావడం లేదు.. ఆ మాత్రే కారణమా?
నమస్తే డాక్టర్. నా వయసు 39. ఈమధ్య కొన్ని సందర్భాల్లో నెలసరి రాకుండా ఉండేందుకు మూడు Primolut-N మాత్రలు వేసుకున్నా. అవి ఆపేశాక ఒకసారి పిరియడ్స్ మామూలుగానే వచ్చినా, ఆ తర్వాత నుంచీ రెగ్యులర్‌గా రావడం లేదు. నాకు సాధారణంగా 28 రోజులకే నెలసరి వస్తుంటుంది. ఈ క్రమంలో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాను. Sysron-N 5mg ట్యాబ్లెట్స్ మూడు రోజులకు రాసిచ్చారు. మొదటి ట్యాబ్లెట్ వేసుకున్న మూడు గంటలకు కొద్దిగా బ్లీడింగ్ అయింది...తరువాయి

ఉదయాన్నే ఇలా చేయద్దు..!
చాలామంది ఉత్సాహంగా ఉండాలని ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం, టైమవుతోందని బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్లడం.. వంటివి చేస్తుంటారు. వీటివల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లేంటో తెలుసుకుని......తరువాయి

ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఉపశమనమిలా..!
శరీరతత్వానికి నప్పని ఆహార పదార్థం తిన్నా లేదా తినుబండారాల్లో ఉన్న రసాయనాల కారణంగా కూడా పదార్థాలు విషపూరితంగా మారి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉంటుంది. ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా ఎక్కువరోజులు ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఇందుకు ఆహార పదార్థాల్లో ఉండే బ్యాక్టీరియా, వైరస్.. వంటి సూక్ష్మక్రిములు కూడా కారణం కావచ్చు....తరువాయి

Weight Loss: అన్నానికి బదులుగా ఇవి!
మన భోజనంలో అన్నానిదే కీలక పాత్ర! అయితే బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు, కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలనుకునే వారు, సమతులాహారానికి ప్రాధాన్యమిచ్చే వారు అన్నం తినే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం బోలెడన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.తరువాయి

ప్రెగ్నెన్సీ డయాబెటిస్.. చంకలో గడ్డలు.. ఎలా తగ్గించుకోవాలి?
నమస్తే డాక్టర్. నా వయసు 29. నాకు 18 నెలల బాబున్నాడు. నాకు ప్రెగ్నెన్సీ డయాబెటిస్ ఉంది. దాన్నెలా తగ్గించుకోవాలి? అలాగే నాకు తరచుగా చంకలో గడ్డలు వస్తుంటాయి. వేసవి కాలం ఈ సమస్య మరింతగా ఉంటుంది. ఈ రెండు సమస్యలకు తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరితరువాయి

వయసుని తగ్గించుకుందామిలా!
వయసు పెరుగుతున్నప్పుడు జీవక్రియల వేగం నెమ్మదిస్తుంది. దాంతో హార్మోన్ల పనితీరు తగ్గుతుంది. ఈ ప్రభావం మగవాళ్లతో పోలిస్తే మహిళలపై ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయసుని లెక్క చేయకుండా జీవక్రియల్లో చురుకు పుట్టించి మునుపటి ఉత్సాహాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఇవి చేసి చూడండి...తరువాయి

బాలింతల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే..
గర్భం ధరించినప్పటి నుంచీ బిడ్డ పుట్టే దాకా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులో ఆహార నియమాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఇదే క్రమంలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తల్లీ, బిడ్డా.. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. అలాగే బిడ్డకు పాలివ్వాలంటే తల్లికి పాలు ఉత్పత్తి కావాలి. పాల ఉత్పత్తిలో తల్లి తీసుకునే....తరువాయి

అందుకే ఒక్క పూటైనా చపాతీ తినాలట!
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి విషయంలోనూ ప్రత్యామ్నాయాల్ని వెతుక్కుంటుంటారు. రాత్రుళ్లు అన్నం మానేసి చపాతీ (గోధుమ పిండితో తయారు చేసింది) తీసుకోవడం కూడా ఇలాంటిదే! మరి, నిజానికి దీనివల్ల ఏదైనా ఫలితం ఉంటుందంటారా? అని సందేహించే వాళ్లూ లేకపోలేదు. అయితే ఆ సందేహం అక్కర్లేదని, రాత్రి భోజనంలో చపాతీని భాగం చేసుకోవడం వల్ల బరువు....తరువాయి

బరువు పెరుగుతామేమోనని ఈ పదార్థాలను దూరం పెట్టకండి!
సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా క్యాలరీలు, కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలను దూరం పెడతారు. ప్రత్యేకించి క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ శక్తి అందుతుందని, దీనివల్ల బరువు పెరుగుతామని చాలామంది భావిస్తారు.తరువాయి

వక్షోజాలు మళ్లీ బిగుతుగా మారాలంటే ఏం చేయాలి?
హలో మేడమ్.. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు నాలుగున్నరేళ్లు. పాపకు రెండున్నరేళ్లు. పాపకు పాలిచ్చినన్ని రోజులు నా వక్షోజాలు మంచి ఆకృతిలో, బిగుతుగా ఉండేవి. కానీ పాలు మానేసిన తర్వాత వదులుగా, తేలికగా మారిపోయాయి. అలాగే నేను బరువు కూడా బాగా తగ్గిపోయాను. పాప పుట్టినప్పుడు 53 కిలోలుండేదాన్ని.. ఇప్పుడు 40 కిలోలున్నాను.తరువాయి

బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు అదుపులో ఉండాలంటే..!
ఎత్తుకు తగ్గ బరువున్నప్పుడే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటాం. కానీ అనారోగ్యపూరిత జీవనవిధానం తక్కువ సమయంలోనే చాలామందిని ఊబకాయులుగా మారుస్తోంది. తద్వారా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఇక ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోయే సరికి.. శస్త్రచికిత్సల్ని (బేరియాట్రిక్ సర్జరీ - బరువు తగ్గించే ఆపరేషన్లు) ఆశ్రయిస్తుంటారు కొందరు.తరువాయి

అనారోగ్యానికి వైట్ కార్పెట్ వేయద్దు!
ఆహార పదార్థాలు.. సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేవైనా.. అనారోగ్యాల పాలు చేసేవైనా.. అవే! అదేంటి.. అన్ని ఆహార పదార్థాలు అలా ఉండవు కదా.. అనుకుంటున్నారా? నిజమే.. కానీ రోజూ మనం తీసుకునే ఆహారంలోని కొన్ని తెలుపు రంగులో ఉండే పదార్థాల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు నిపుణులు.తరువాయి

మయూరాసనంతో మేలెంతో!
ఇంటా బయటా ఊపిరాడని పనులతో వ్యాయామం చేయలేకపోతున్నామని, వాకింగుకు వెళ్లలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఉదయానే ఒక్క పావుగంట యోగా కోసం కేటాయించండి. వజ్రాసనం, శవాసనం లాంటి సులువైన ఆసనాలతో మొదలు పెట్టండి. క్రమంగా కాస్త కాస్త చొప్పున సమయాన్ని పెంచండి. శరీరం ఫ్లెక్సిబుల్‌గా తయారయ్యాక మయూరాసనం వేశారంటే.. సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.తరువాయి

వామాకు... అందం... ఆరోగ్యం!
వాము అందరికీ చిర పరిచితమే కానీ వామాకు కొందరికే తెలుసు. అది ఎంత అందమైందో, అద్భుతమైందో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కల్ని తెచ్చి పెంచేస్తారు. ఇది మనసుకు హాయిగొల్పుతూ ఆరోగ్యాన్నీ ఇస్తుంది...ఆకుపచ్చటి దళసరి ఆకులుండే వాము మొక్క చూడచక్కగా ఉండి మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికీ ఎంతో మేలు చేస్తుంది.తరువాయి

గర్భం దాల్చాక నిద్ర పట్టడం లేదా?
మాతృత్వం.. ఈ పదం వింటేనే మహిళలందరికీ ఎంతో ఆనందం..! అందుకే గర్భం ధరించామన్న విషయం తెలియగానే అమితమైన సంతోషం కలుగుతుంది. ఎందుకు కలగదు చెప్పండి? మరికొన్ని నెలలు పోతే ఓ పండంటి పసిబిడ్డ మన చేతుల్లో ఉంటుందంటే ప్రతి ఒక్కరికీ ఆనందమేగా! అందుకే గర్భం ధరించారని తెలియగానే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అపురూపంగా..తరువాయి

Weight Loss: అలా 92 నుంచి 81 కిలోలకు తగ్గా..!
గర్భిణిగా ఉన్నప్పుడు, బిడ్డ పుట్టాక మహిళలు బరువు పెరగడం సహజమే! అయితే దీన్ని తగ్గించుకోవడమే కష్టమనుకుంటారు చాలామంది. కానీ గట్టిగా అనుకుంటే ఇదీ సాధ్యమే అంటోంది అందాల అమ్మ సమీరా రెడ్డి. తల్లయ్యాక కాస్త బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దాన్ని తగ్గించుకునేందుకు కసరత్తులు చేస్తోంది.తరువాయి

పప్పుల్ని ఇలా తింటే మంచిదట!
మనం ఏది తిన్నా ఆరోగ్యం కోసమే! అయితే ఆయా ఆహార పదార్థాల్ని తీసుకునే రీతిలో కొన్ని కచ్చితమైన నియమాలు పాటిస్తేనే అందులోని పోషకాలు శరీరానికి అందుతాయంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఈ క్రమంలోనే పప్పుల్ని తీసుకునే విషయంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. మరి, అదెలాగో మనమూ తెలుసుకుందాం రండి..తరువాయి

ఇలా చేస్తే ఆ ఇబ్బంది ఉండదు!
నెలసరి.. ఆడవారిని నెలనెలా పలకరించే ఈ పిరియడ్స్ వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజం. కడుపునొప్పి, నడుంనొప్పి, చికాకు, ఒత్తిడి, ఆందోళన.. ఇలా ఈ సమయం మహిళల్ని చాలా రకాలుగానే ఇబ్బంది పెడుతుంటుంది. అయితే ప్రతి నెలా ఎదురయ్యే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి కొందరు మాత్రలు వేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.తరువాయి

కలయికను ఆస్వాదించలేకపోతున్నా.. ఎందుకు?
హలో డాక్టర్. నా వయసు 27. నాకు పెళ్త్లె మూడేళ్త్లెంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ నాకు వెజైనా ఎక్కువ సమయం పాటు పొడిగా ఉండడంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ముందు ఒత్తిడి నుంచి బయటపడమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ నేను సెక్స్‌ని ఆస్వాదించలేకపోతున్నాను.తరువాయి

5 వేల అడుగులు చాలు...
సునీతకు ఉదయాన్నే నడక అలవాటు. ఎంత పనున్నా ఓ అరగంట నడవాల్సిందే. కానీ కనీసం 10వేల అడుగులైనా వేయాలనే స్నేహితురాలి సలహాతో మరో పావుగంట అదనపు నడకకు సిద్ధపడింది. దాని వల్ల తను మరింత అలసిపోతోంది. అయితే రోజుకి 5 నుంచి 6 వేల అడుగులు వేయగలిగితే చాలు అంటోంది తాజా అధ్యయనం. ఇందులో తేలిన మరిన్ని విషయాలేంటంటే...తరువాయి

నిల్వపచ్చళ్లు తింటే...
ప్రాంతం, రుతువు మారినప్పుడు లేదా జన్యుపరంగా బాధించే పార్శనొప్పి నుంచి ఉపశమనం పొందే కొన్ని అంశాలను చెబుతోంది అమెరికాకు చెందిన మైగ్రేన్ రిసెర్చి ఫౌండేషన్. అవేంటో తెలుసుకుందాం. కాఫీ, టీ... కెఫిన్ ఎక్కువగా ఉండే ఈ పదార్థాల కారణంగా పార్శనొప్పి మరింత పెరిగే ప్రమాదం ఉంది. కాఫీ, టీ, చాక్లెట్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. పార్శనొప్పి మొదలైన కొంతతరువాయి

పోషకాహారంతో సంతాన భాగ్యం!
అమ్మతనం కోసం ఎంతగానో పరితపిస్తుంటారు మహిళలు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యల కారణంగా ప్రస్తుతం ఎంతోమంది స్త్రీలు మాతృత్వానికి దూరమవుతున్నారు. మరికొంతమంది ఐవీఎఫ్, అద్దె గర్భం.. వంటి కృత్రిమ పద్ధతుల్లో గర్భం ధరించి అమ్మలవుతున్నారు. ఏదేమైనా మనం తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారంతో అమ్మయ్యే...తరువాయి

అప్పుడు.. 60 ల్లోనూ ఆనందమే!
సుజాతకు 30 ఏళ్లు నిండాయంతే. అప్పుడే ఎక్కువదూరం నడిచినా, నాలుగు మెట్లు ఎక్కినా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. తన శరీరం తనకే బరువుగా అనిపించడం ఆమెను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలితోపాటు పాటించే కొన్ని నియమాలు... 60లోనూ ఆనందంగా గడిపేలా చేస్తాయంటున్నారు వైద్యనిపుణులు. అవేంటంటే..తరువాయి

వాటిని ఎదుర్కోవాలంటే ఇవి తప్పవు..!
కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణ ధాన్యాలు, పెరుగు.. తదితర ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగవుతుందన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో- అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న తరుణంలో- ఇమ్యూనిటీని పెంచే బలవర్ధకమైన ఆహారం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.తరువాయి

విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది.. పరిష్కారమేంటి?
హలో డాక్టర్. నా వయసు 22. ఎత్తు 5’3’’. బరువు 55 కిలోలు. నాకు పీసీఓఎస్ ఉంది. డాక్టర్ మూడు నెలల కోర్సు ఇచ్చారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత రెండు నెలలు పిరియడ్స్ బాగానే వచ్చాయి. ఆ తర్వాత ఒక నెల పిరియడ్స్ రాలేదు. తర్వాతి నెలలో వచ్చినా బ్లీడింగ్ అవ్వలేదు. ఆపై నెలలో పిరియడ్స్ రెండు రోజుల ముందే వచ్చాయి..తరువాయి

World Cancer Day: క్యాన్సర్ నిర్ధరణకు మార్గాలివిగో!
మనకు తెలియకుండా చాప కింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణవ్యవస్థ పనితీరు అదుపు తప్పడం వల్ల ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే క్యాన్సర్ వస్తే ఇక అంతేనని.. దీనికి మందు లేదని.. చాలామంది భయపడుతుంటారు. కానీ క్యాన్సర్‌ని ప్రారంభంలోనే గుర్తిస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య పరిజ్ఞానంతో దానిని నయం...తరువాయి

శక్తినిచ్చే ఈ అయిదు పదార్ధాలూ మీ డైట్ లో ఉన్నాయా?
కరోనా మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో కీడు చేస్తున్నా.. టెక్నాలజీ విషయంలో మాత్రం మనల్ని ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పటిదాకా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆప్షన్ లేని సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి.తరువాయి

క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయివి..!
మనం తీసుకునే ఆహారం, పాటించే లైఫ్స్త్టెల్లో భాగంగా మనకు తెలిసీ తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటాం. అందులో క్యాన్సర్ మహమ్మారి కూడా ఒకటి. దీన్ని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్నే కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.తరువాయి

ఆ సమస్య ఉంది.. నేను తల్లిని కాగలనా?
హలో డాక్టర్. నాకు పుట్టుకతోనే కుడి మూత్రపిండం, కుడి వైపు అండాశయం లేవు. పిరియడ్స్ కూడా ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. డాక్టర్ని సంప్రదిస్తే హార్మోన్ల అసమతుల్యత ఉందని చెప్పారు. పదేళ్ల నుంచి మందులు వాడుతున్నాను.. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. నేను తల్లిని కాగలనా? దయచేసి చెప్పండి. - ఓ సోదరితరువాయి

గర్భం దాల్చినప్పుడు జలుబు చేస్తే..?
గర్భవతిగా ఉన్న సమయంలో ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తుంది. ఈ సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. ఆ ప్రభావం తనతో పాటు పుట్టబోయే బిడ్డపై కూడా పడే అవకాశాలుండటమే దీనికి కారణం. అందుకే ఆ సమయంలో ఉపయోగించే మందుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు కాబోయే తల్లులు.తరువాయి

అందుకే లేట్‌నైట్‌లో ఇవి వద్దు..!
వివిధ కారణాల వల్ల్ల కొందరు రాత్రిపూట భోజనం బాగా లేటుగా చేస్తుంటారు. కొందరు ఇంట్లో ఉండి కూడా అర్ధరాత్రి వరకు భోజనం చేయకుండా.. టీవీ చూస్తూ, కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ సమయం గడిపేస్తారు. మరికొందరైతే అర్ధరాత్రి వరకు ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ.. నిద్ర రాకుండా మధ్యమధ్యలో స్నాక్స్, బిస్కట్స్.. వంటివి లాగించేస్తుంటారు.తరువాయి

మూత్రం లీకవుతోంది.. రొమ్ములో నొప్పి.. ఎందుకిలా?
డాక్టర్.. నా వయసు 38. నాకు ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ సిజేరియనే అయింది. అయితే ఈ మధ్య కొన్ని నెలల నుంచి నాకు మూత్రం లీకవుతోంది. నెలసరి పూర్తవగానే వెజైనా దగ్గర దురద, మంటగా ఉంటోంది. కలయికలో పాల్గొన్నా ఇదే సమస్య. అలాగే ఎడమవైపు రొమ్ములో కూడా నొప్పిగా ఉంటోంది. ఎందుకిలా జరుగుతుందో దయచేసి చెప్పండి. - ఓ సోదరితరువాయి

గర్భనిరోధక మాత్రలు వేసుకుంటే ఇక ఎప్పటికీ పిల్లలు పుట్టరా?
అప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి, నెలసరి సమస్యలతో బాధపడుతోన్న వారికి కాంట్రాసెప్టివ్ పిల్స్ చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా గర్భధారణను వాయిదా వేయాలనుకునే వారికి ఇతర గర్భనిరోధక పద్ధతులన్నింటిలోకెల్లా ఈ మాత్రలే ది బెస్ట్ అంటున్నారు. అయితే వీటిని వాడడం వల్ల భవిష్యత్తుల్లో సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందనితరువాయి

తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోందా?
ఇలాంటి అనుభవం వీళ్లకే కాదు.. మనలో చాలామందికి అప్పుడప్పుడూ ఎదురయ్యేదే. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, నీళ్లు ఎక్కువగా తాగినప్పుడు.. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. కానీ ఇది మరీ మితిమీరితే మాత్రం నిర్లక్ష్యం చేయద్దంటున్నారు వైద్యులు. ఎందుకంటే రోజులో పది కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తే అది ఇతరతరువాయి

Inner Wear: వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
చక్కటి ఎద సౌష్ఠవానికి, సాగినట్లుగా కనిపించే వక్షోజాలను పట్టి ఉంచడానికి అమ్మాయిలంతా బ్రా ధరించడం కామనే. ఆయా దుస్తులకు తగినట్లుగా సాధారణ బ్రా, స్ట్రాప్‌లెస్, బ్రాలెట్, స్పోర్ట్స్ బ్రా.. వంటివి ఎంచుకుంటాం. అయితే ఒక్కోసారి ఈ లోదుస్తులు ఎద భాగానికి పట్టినట్లుగా ఉండడం, తద్వారా ఛాతీలో నొప్పి రావడం, ఆ ప్రదేశంలో చెమట వచ్చి రాషెస్లా ఏర్పడడం..తరువాయి

Omicron: చంటి పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో మళ్లీ ఆందోళన మొదలవుతోంది. టీకా తీసుకున్నవారు సైతం వైరస్ బారిన పడుతున్న సంఘటనలు వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో- రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం.తరువాయి

జింక్ కావాలంటే ఈ పదార్థాలు తీసుకోవాల్సిందే!
కరోనా వచ్చాక అందరిలో ఆరోగ్య స్పృహ పెరిగింది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అలవాట్లను మార్చుకుంటున్నారు. పోషకాహారానికి బాగా ప్రాధాన్యమిస్తున్నారు. అయితే కొన్ని పోషకాలు సరిగా శరీరానికి అందకపోవడంతో పలు ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.తరువాయి

గొంతునొప్పికి వీటితో చెక్ పెట్టేయండి !
ఎండాకాలం, వానాకాలం, శీతాకాలంలో.. ఏ కాలం ఎక్కువ ఇష్టం ? అని ఎవరినైనా అడిగితే.. చాలామంది చెప్పే సమాధానం శీతాకాలమే ! తెల్లని పొగ మంచు పరిచే చల్లదనంలో.. వెచ్చదనం కోసం వెతికే ఆరాటం చాలామందికి మహా సరదాగా ఉంటుంది. అయితే ఈక్రమంలో కొన్ని ఇబ్బందులు మన ఆనందానికి అవరోధంగా మారుతుంటాయి.తరువాయి

పూలతో ఉత్తేజం
ఒక్కోసారి మనసు దేని మీదా లగ్నం కాదు. ఏకాగ్రత కుదరదు. రకరకాల ఆలోచనలు... ఏవీ స్థిరంగా సాగవు. అప్పుడు చికాకొస్తుంది. కానీ చేయాల్సిన పని ఎదురుగా తరుముతూ ఉంటుంది. అప్పుడు ఇలా చేయండి. పసుపు, నారింజ వంటి రంగుల్ని కాసేపు చూడండి. లేదా ఏ బంతో, చామంతి పూలనో చూడండి. చాలా త్వరగా అంటే ఒకటి రెండు నిమిషాల్లోనే ఏకాగ్రత కుదురుతుందట. ఈ రంగులు మెదడును కమ్ముకున్న పొగమంచులాంటి ఆలోచనలను తొలగించి ఏకాగ్రతను ఇస్తాయట.తరువాయి

పాప్‌కార్న్ ఆరోగ్యానికీ మంచిదే..!
పాప్‌కార్న్.. పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టపడే ఆహారపదార్థాల్లో ఇదీ ఒకటి. సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే మంచి స్నాక్ ఐటమ్ కూడా. అయితే పాప్‌కార్న్ తినడం ద్వారా టైం పాస్ మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా కూడా కొన్ని ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చట!తరువాయి

సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుందాం..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ముందు వరుసలో ఉంటుంది. మొదటి దశలో దీన్ని గుర్తించకపోవడం, అవగాహనా లోపం.. వంటి కారణాల వల్ల దీని బారిన పడి ఏటా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే మహిళల్లో క్యాన్సర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రొమ్ము క్యాన్సర్.తరువాయి

నీలికాంతితో జాగ్రత్త
స్మార్ట్ ఫోన్లు, ఇతర గాడ్జెట్ల మితిమీరిన వినియోగం వల్ల 30 ఏళ్ల లోపు మహిళలు ఎక్కువగా కంటి సమస్యలకు లోనవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి...కళ్లలో మంట, పొడిబారడం, అస్పష్టంగా కనిపించడం.. మెడ, వెన్ను నొప్పులు వంటి ఎన్నో సమస్యలకు స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాల తెరల నుంచి వెలువడే నీలిరంగు కాంతే కారణమని నిపుణులు...తరువాయి

కసరత్తులు కచ్చితంగా చేసేలా...
రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉంటాం. మళ్లీ కసరత్తులూ చేయాలా అని అనుకుంటుంటారు కొందరు అమ్మాయిలు. రోజులో పని కష్టం ఎంత పడినా... కసరత్తులు చేస్తే వచ్చే ఉపయోగం చాలా ఎక్కువ అని చెబుతున్నారు నిపుణులు. ఇందుకు ప్లేస్టోర్‌లో కొన్ని ఉపయోగకరమైన యాప్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి 7ఎం ఉమెన్. ఇందులో రకరకాల వ్యాయామాలు ఉంటాయి. ...తరువాయి

పండంటి ఆరోగ్యానికి
పండ్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలంటారు పోషకాహార నిపుణులు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు బోలెడు. దేనికదే ప్రత్యేకమైన రంగు, రుచితో వైవిధ్యాన్ని కలిగి, భిన్న పోషకాలతో నిండి ఉంటాయి. అవేంటో, వాటివల్ల మనకు కలిగే లాభాలేంటో చూద్దామా..గుండె ఆరోగ్యానికి... అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇది శరీరానికి కావాల్సిన తేమను అందించడంతోపాటు పోషకాలనూ ఇస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. గుండె...తరువాయి

Thyroid:జాగ్రత్తగా ఉంటే.. థైరాయిడ్ ఏం చేస్తుంది?
హలో అండీ.. నిన్న షాపింగ్‌కి వెళ్లినప్పుడు నా ఫ్రెండ్స్ సునీత, శ్రావణి, భవాని కనిపించారు. ఎంత ఆనందమేసిందో వాళ్లను చూసి..! మేం కలిసి దాదాపు ఆరు నెలలకు పైగానే అయింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ వాళ్లలో చాలా మార్పు. ముగ్గురూ చాలా లావయ్యారు. ఆ తర్వాత మాటల్లో తెలిసింది.. వాళ్ల ముగ్గురికీ థైరాయిడ్ సమస్య ఉందని.తరువాయి

మితంగా తింటే ఈ పిండివంటల్లో ఆరోగ్య ప్రయోజనాలూ ఎన్నో!
'సంబరాల సంకురాత్రి.. వూరంతా పిలిచింది..' అన్నట్లుగా సంక్రాంతి పండగ సంబరాలనే కాదు.. ఎన్నో రకాల పిండి వంటల్ని కూడా మోసుకొస్తుంది. ఈ పండక్కి ఏ ఇంటి ముంగిలి చూసినా రంగురంగుల రంగవల్లికలతో ఎలాగైతే కళకళలాడుతుంటుందో.. అలాగే ప్రతి ఇల్లూ వివిధ రకాల పిండివంటలతో ఘుమఘుమలాడుతుంటుంది.తరువాయి

నోటి పూత వేధిస్తోందా? అయితే ఇలా చేయండి..!
మనం తీసుకునే ఆహారంలో పోషకాలు తగ్గిపోతే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందులో నోటిపూత కూడా ఒకటి. శరీరంలో వేడి ఎక్కువవడం, అధిక ఒత్తిడికి గురవడం, డీహైడ్రేషన్.. వంటివన్నీ ఇందుకు కారణాలే! అయితే సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే కొన్ని సహజసిద్ధమైన మార్గాలున్నాయంటున్నారు నిపుణులు.తరువాయి

మీ ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!
పిండి రుబ్బాలంటే గ్రైండర్, బట్టలుతకాలంటే వాషింగ్ మెషీన్... బిల్లు కట్టాలంటే ఆన్లైన్ పేమెంట్.. ఏ పనైనా సరే.. ఇప్పుడు శరీరం అలిసిపోకుండా క్షణాల్లో ఇట్టే చేసేయచ్చు. ఆధునిక టెక్నాలజీ నిజంగా మన జీవితాలను ఎంత సుఖమయం చేస్తోందో గదండీ.. అలాగని తెగ ఆనందపడిపోకండి.తరువాయి

పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది.. పిల్లల్లేరు.. ఏ చికిత్స తీసుకోవాలి?
మేడమ్.. నాకు పెళ్లై ఎనిమిదేళ్లవుతోంది.. ఇంకా పిల్లల్లేరు. నాకు థైరాయిడ్ సమస్య ఉంది (TSH-6.19). అలాగే కిడ్నీలో రాళ్లున్నాయి. నేను, మా వారు చెకప్స్ చేయించుకుంటున్నాం.. మా వారికి స్పెర్మ్ కౌంట్ 30 మిలియన్లు ఉన్నాయి. మాకు పిల్లలు పుట్టే మార్గం చెప్పండి. - ఓ సోదరితరువాయి

ఓ మహిళా.. కాస్త చూడిలా..
నేటి ఆధునిక మహిళకు నిత్యం ఇంటి పని, వంటపనితో పాటు బయట ఆఫీసు పనితో హైరానా. ఇంటా బయటా నెగ్గుకురావాలంటే పనితోపాటు ఆరోగ్యంపైనా అంతే శ్రద్ధ పెట్టాలి.. పిల్లల విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కొద్దిపాటి జాగ్రత్తలు, చిన్నచిన్న చిట్కాలతో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న వేళ.. మహిళలు, వారి పిల్లల ఆరోగ్య సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చూద్దాం... .తరువాయి

ఈ ‘స్వీట్’ రిజల్యూషన్స్ తీసుకున్నారా?
కొత్త ఏడాదిలోకి అడుగిడే క్రమంలో ఆరోగ్యం, ఫిట్నెస్.. విషయాల్లో పలు తీర్మానాలు తీసుకోవడం పరిపాటే! ఈ క్రమంలోనే స్వీట్స్ తినే అలవాటును అదుపు చేసుకోవాలనుకునే వారూ లేకపోలేదు. అయితే అలా నోరు కట్టేసుకున్న వారు కూడా ‘రేపట్నుంచి మానేద్దాంలే!’ అని తమ లక్ష్యాన్ని పక్కన పెట్టేస్తుంటారు.తరువాయి

చలికాలంలో ఇలా ఆరోగ్యంగా ఉండండి!
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్న కొద్దీ వేడివేడిగా ఆహారం తీసుకోవాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అయితే వేడివేడి ఆహారం లాగించాలనుకోవడం మంచిదే.. కానీ అది ఇంట్లో కాకుండా బయటి పదార్థాలకు, ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే మాత్రం అనారోగ్యం బారిన పడక తప్పదు.తరువాయి

స్వెటర్ వేసుకొని పడుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!
రగ్గులు, దుప్పట్లు కప్పుకున్నా.. స్వెటర్ వేసుకొని పడుకోవడం మనలో చాలామందికి అలవాటు! వెచ్చదనంతో పాటు హాయిగా నిద్రపడుతుందని ఇలా చేస్తుంటాం. అయితే దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇందుకు చర్మానికి గాలి తగలకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు. ఇంతకీ ఏంటా ఆరోగ్య సమస్యలు? రండి.. తెలుసుకుందాం..!తరువాయి

ఉడికించడానికీ ఓ లెక్కుంది!
పోషకాలతో నిండి ఉండే క్యారెట్, కీరాలాంటి వాటిని నేరుగా తినేస్తాం. అయితే అన్నింటినీ అలా తినలేం. అందుకే ఉడికించి కూర చేసుకుంటాం. ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. ఒక్కో కూరగాయను ఉడికించడానికి నిర్ణీత సమయం ఉంటుంది. అంత సమయంలోనే వాటిని వండాలి. ఎక్కువ నీళ్లతో ఉడికిస్తే కాయగూరల నుంచి సి, బి విటమిన్లని త్వరగా కోల్పోతాం.తరువాయి

వాయుకాలుష్యం... పుట్టబోయే బిడ్డకు శాపం
పుట్టబోయే పాపాయి సంరక్షణ బాధ్యత గర్భం దాల్చినప్పటి నుంచే ప్రారంభమవుతుంది. ప్రసవానికి ముందు నుంచి విటమిన్లు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడంతోపాటు మొత్తం లైఫ్‌స్టైల్‌ను మార్చుకోగలిగితేనే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. కాబోయే తల్లి పీల్చే గాలి కాలుష్య ప్రభావం గర్భస్థశిశువుపై పడుతుంది. ముఖ్యంగా...తరువాయి

ఈ జ్యూస్‌లతో ఇమ్యూనిటీ పెంచుకుందాం!
నిత్యం మన శరీరంపై ఎన్నో రకాల వైరస్లు దాడి చేస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ.. అందులో చాలా వాటిని మన రోగ నిరోధక శక్తే అంతం చేస్తుంటుంది. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే వ్యాధులు ప్రబలడం ఎక్కువవుతుంది. అందుకే చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల సహజంగానే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.తరువాయి

నిద్రకీ.. రోజ్‌వాటర్
సౌందర్య పోషణకు ఉపయోగించే ప్రధానమైన వాటిల్లో రోజ్‌వాటర్ ఒకటి. దీనివల్ల చర్మం నిగారించడమే కాదు.. ఇంకా బోలెడు ప్రయోజనాలున్నాయి. ఒక కప్పు నీటికి పావు కప్పు రోజ్ వాటర్ కలపండి. తలస్నానం పూర్తయ్యాక ఆఖర్లో ఈ మిశ్రమంతో జుట్టును కడిగేస్తే పట్టుకుచ్చులా మెరుస్తుంది. కేవలం రోజ్‌వాటర్‌కి కొన్ని చుక్కల జాస్మిన్/ లావెండర్...తరువాయి

నెలసరి సమయంలో హుషారుగా ఇలా...!
సాధారణంగా నెలసరి సమయంలో ఎక్కువమంది సతమతమయ్యేది అధిక రక్తస్రావం, కడుపునొప్పి సమస్యలతోనే. సరైన పోషకాహారం తీసుకుంటూ మన చుట్టూ ఉండే వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యదాయకంగా ఉండేలా చూసుకుంటే వీటి నుంచి బయటపడచ్చు. ఒకవేళ సమస్య మరీ తీవ్రమైతే వెంటనే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.తరువాయి

ఈ అలవాట్లే దీర్ఘాయువునిస్తాయట!
ఆహారం, వ్యాయామం, జీవనశైలిపై మన జీవితకాలం ఆధారపడి ఉంటుందంటున్నారు అమెరికాకు చెందిన దీన్ ఆర్నిష్, అన్నే ఆర్నిష్ అనే పరిశోధక జంట. ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్న వారిపై అధ్యయనం చేసి, ఆ వివరాలను ‘అన్ డు ఇట్ విత్ ఆర్నిష్’ పేరుతో ఈ జంట పుస్తకాన్ని విడుదల చేశారు.తరువాయి

రొమ్ముల్లో గడ్డలున్నాయి.. ప్రమాదకరమా?
హాయ్ మేడమ్.. నా రెండు రొమ్ముల్లో గడ్డలున్నాయి. వాటివల్ల కొన్నిసార్లు నొప్పిగా ఉంటుంది.. మరికొన్ని సార్లు నొప్పేమీ ఉండట్లేదు. స్కానింగ్ చేయించుకొని ట్యాబ్లెట్స్ వాడాను. మళ్లీ కొన్ని నెలల తర్వాత గడ్డలు ఏర్పడ్డాయి. అప్పుడు మళ్లీ స్కానింగ్ చేయించుకుంటే రిపోర్ట్స్‌లో నార్మల్ అని వచ్చింది.. కానీ నాకు మాత్రం గడ్డలున్నట్లుగా తెలుస్తోంది.తరువాయి

కాబోయే అమ్మలూ.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఏదేమైనా చలికాలంలో ఇలాంటి సమస్యలు చాలామందికి కామనే. అసలే చలికాలంలో రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగిస్తుందంటే.. గర్భిణుల్లో ఆ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. తద్వారా వారు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ! ఇక వీటికి తోడు ప్రస్తుతం ఒమిక్రాన్ ముప్పు కూడా పొంచి ఉంది.తరువాయి

సెరామిక్తో ఆరోగ్యం ఆదా!
మట్టి కుండల నుంచి స్టీలు పాత్రల దాకా సాగింది మన వంటింటి ప్రయాణం. ఇప్పుడిక ఆ జాబితాలోకి సెరామిక్ కూడా చేరింది. దీనితోనూ బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో చదివేయండి. సెరామిక్ పాత్రలు బరువు తక్కువ. చూడటానికి అందంగా ఉండటంతోపాటు వండేందుకూ అనుకూలం. ఎన్నాళ్లు వాడినా కొత్తగానే కనిపిస్తాయి. శుభ్రపరచడం కూడా చాలా సులువు...తరువాయి

టెక్.. కాపడం!
కాలంతో పనిలేకుండా ఉదయాన్నే మనకు పనులు చక్కబెట్టక తప్పదు. నొప్పులున్నా పంటి బిగువున భరించాల్సిందే. దీనికితోడు ఈకాలంలో పీరియడ్ సహా ఏ నొప్పైనా మామూలు కంటే ఎక్కువ మోతాదులో అనిపిస్తుంటుంది. ఈ పోర్టబుల్ ఎలక్ట్రానిక్ హీటింగ్ ప్యాడ్‌ను తెచ్చుకోండి. కాపడం పెట్టేస్తుంది. దీని బెల్ట్ సాయంతో శరీంలోని ఏ భాగానికైనా పెట్టేసుకుని పని చేసేసుకోవచ్చు....తరువాయి

Winter Food: రుచితో పాటు ఆరోగ్యమూ!
చలికాలంలో అరుగుదల క్షీణిస్తుంది.. విటమిన్ ‘డి’ లోపంతో రోగనిరోధక శక్తీ తగ్గుతుంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి. మరి, ఈ సమస్యను నివారించాలంటే ఈ కాలంలో లభించే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్.తరువాయి

పదేళ్ల లోపే పిరియడ్స్.. ఎందుకిలా?
వయసుకు తగ్గట్లు శారీరక మార్పులు జరిగితేనే ఆనందం. రుతుచక్రానికి కూడా ఇదే వర్తిస్తుంది. సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్ల లోపు మొదలవ్వాల్సిన రుతుక్రమం పదేళ్ల లోపే వచ్చేస్తే? దానిని ఒక సమస్యగానే భావించాలంటున్నారు నిపుణులు. సరైన అవగాహన పెంచుకుని, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.తరువాయి

రాగి పాత్రల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలివే!
ఇప్పుడైతే నీటిని శుద్ధి చేసుకోవడానికి వివిధ రకాల వాటర్ ఫిల్టర్లు, ప్యూరిఫైయర్లు పుట్టుకొస్తున్నాయి.. కానీ పూర్వకాలంలో ఇలాంటివన్నీ ఎక్కడివి? పైగా 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నట్లు ఆ కాలానికి చెందిన వారే ఎలాంటి అనారోగ్యాలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు కూడా! మరి ఎందుకలా?తరువాయి

బద్ధకంగా ఉంటే.. ఆహారం మార్చండి!
కొవిడ్ మన జీవితాల్లో చాలా మార్పులు తెచ్చింది. వ్యాయామం, నడక అన్నీ వదిలేశాం. దీనికితోడు ఇంటి నుంచే పని. వెరసి.. అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దొరికిన కాస్త సమయం విశ్రాంతికే సరిపోతోంది. ఇవన్నీ ఆరోగ్యాన్నీ, మనసునీ స్తబ్దుగా మార్చేస్తున్నాయి. గతంలోలా ఫిట్‌గా, ఉత్సాహంగా ఉండాలంటే..తరువాయి

తినే తీరూ గమనించుకోండి!
పని హడావుడిలో తిండిని పక్కన పెట్టేస్తాం. వేళలెలాగూ పట్టించుకోవట్లేదు.. తినే తీరైనా పాటిస్తున్నారా? అందరి తర్వాతే మనం అన్న ధోరణి మనలో చాలామందిలో ఉంటుంది. అందుకే ఆఖర్న తినడానికి మొగ్గు చూపుతాం. దీనికి తోడు కష్టపడి చేసింది వృథా అవుతుందని పిల్లలు వదిలేసినా.. కొద్దిగా మిగిలినా పొట్టలోకి చేర్చేస్తుంటాం. ఇది మంచి ధోరణి కాదు. తెలియకుండానే ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారం అనారోగ్యానికి దారి తీస్తుంది. మిగిలిందని వేయడానికి పొట్టేమీ చెత్త బుట్ట కాదు కదా!తరువాయి

సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులేవి?
హాయ్ మేడమ్. నాకు ఇటీవలే పెళ్లైంది. మాకు అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. అందుకోసం సురక్షితమైన గర్భ నిరోధక పద్ధతులు ఏమున్నాయో చెప్పగలరు. అలాగే గర్భం రాకూడదంటే రుతుచక్రంలో అండం విడుదలయ్యే రోజుల్ని ఎలా లెక్క పెట్టుకోవాలి? ఆ రోజుల్లో కలవకుండా, ఇతర రోజుల్లో కలిసినా గర్భం వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? దయచేసి సలహా ఇవ్వండి.తరువాయి

వీటితో బీపీ అదుపులో!
అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. సాధారణ వ్యక్తులతో పాటు సుమారు 50 శాతం మందికి పైగా వైద్యులు సైతం అధిక రక్తపోటు సమస్యతో సతమతమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.తరువాయి

అపోహలు తొలగిద్దాం.. అవగాహన పెంచుకుందాం..
మానవ జాతిని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధుల్లో ఎయిడ్స్ కూడా ఒకటి. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఈ వ్యాధికి మందు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. అలాగని హెచ్ఐవీ ఏమీ అంటువ్యాధి కాదు. ఈ వ్యాధి కేవలం కొన్ని మార్గాల ద్వారా మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.తరువాయి

పిల్లల్లో స్థూలకాయం రాకుండా ఉండాలంటే..!
చెబితే ఓ పట్టాన వినరు కానీ పిల్లల్లో ఉండే ఇలాంటి అలవాట్లే వారిని ఊబకాయులుగా మార్చుతున్నాయని చెబుతోంది ఇటీవలే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NHFS). గత ఐదేళ్ల కాలంలో ఈ రేటు 1.3 శాతం పెరిగినట్లు వెల్లడైంది. తద్వారా యుక్తవయసులోనే వారు మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, ఆస్తమా.. వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదంతరువాయి

ఆస్తమా ఉందా..? అయితే ఈ ఆహార నియమాలు మీకోసమే..!
మనిషిని కుంగదీసే దీర్ఘకాలిక వ్యాధుల్లో ‘ఆస్తమా (ఉబ్బసం)’ ఒకటి. ఊపిరితిత్తులకు ప్రాణవాయువును చేరవేసే శ్వాస నాళాల్లో వాపు రావడం, అక్కడ ఎక్కువ శ్లేష్మం ఉత్పత్తవడంతో కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందవుతుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడమనేది మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు.తరువాయి

టీనేజ్‌లో స్థూలకాయాన్ని ఆపేదెలా?
మీ పిల్లలు చిన్న వయసు నుంచే క్రమంగా బరువు పెరుగుతున్నారా? అయితే టీనేజ్‌కి వచ్చే సరికి వారు స్థూలకాయులుగా మారే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీనేజ్‌లోకి వచ్చే సరికి వారి శరీరంలో క్యాలరీలు కరగడం చాలా వరకు తగ్గుతుందట. ఈ సమయంలో సరైన వ్యాయామం లేకపోవడం, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.. వంటివన్నీ ఇందుకు ముఖ్య కారణాలుగా చెబుతున్నారు వారు.తరువాయి

రక్తహీనత ఉందా? ఇవి తినండి!
ఇనుము/ఐరన్.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన ఖనిజంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఐరన్ లోపిస్తే హెమోగ్లోబిన్ స్థాయులు తగ్గి రక్తహీనత బారిన పడే ప్రమాదం ఎక్కువ! ఇలాంటి సమస్యతో బాధపడుతోన్న మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెబుతున్నాయి తాజాగా విడుదలైన ‘గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్’, ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’.తరువాయి

కడుపు నిండా తిన్నా.. కెలరీలు తక్కువే
డైట్లో ఉన్న అమ్మాయిలకు ప్రతి కెలరీ లెక్కే మరి! కానీ కడుపు ఖాళీగా ఉంటే చేసే పనిపై మనసు మళ్లదు. మరేంటి పరిష్కారం? నెగెటివ్ కెలరీ ఆహారాన్ని తీసుకోమంటున్నారు నిపుణులు. అంటే.. అరగడానికి ఎక్కువ శక్తిని తీసుకునేవన్నమాట. అవేంటంటే..ప్రతి 100 గ్రాములకు 52 కిలోకెలరీలు అందుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్సి ఉంటాయి. అధిక మోతాదులో ఉండే ఫైబర్ బరువు తగ్గడంలోనూ క్వెర్సెటిన్ టైప్2 డయాబిటిస్కు...తరువాయి

తొడ భాగంలో కొవ్వు కరగాలంటే..
అందరి శరీరాకృతులు ఒకేలా ఉండవు. కొందరు సన్నగా, నాజూగ్గా ఉంటే.. మరికొందరు లావుగా ఉంటారు. ఇంకొందరికైతే శరీరమంతా సన్నగా ఉంటుంది.. కానీ తొడలు మాత్రం కాస్త లావుగా ఉంటాయి. దీనికి కారణం ఈ ప్రదేశంలో పేరుకుపోయిన కొలెస్ట్రాలే. ఎప్పుడైనా జీన్స్ లాంటి కొంచెం బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల ఇవి మరింత లావుగా కనిపిస్తాయి.తరువాయి

కాబోయే తల్లికి మెత్తని పడక...
పుట్టబోయే పండంటి బిడ్డ గురించి కలలుకనే తల్లికి ఈ పడకలు కంటినిండా నిద్రను అందిస్తాయి. సుతిమెత్తగా.. సౌకర్యంగా ఉండే వీటి మధ్య కాబోయే తల్లి కాసేపు నడుం వాలిస్తే చాలు. గర్భస్థ శిశువుపైనా ఒత్తిడి పడదు. పలురకాల ఆకారాల్లో ప్రత్యేకంగా డిజైన్చేసి రూపొందించిన ఈ మెత్తని పడకలను ఓసారి మీరూ చూడండి. తల్లీబిడ్డల నిద్రకు అంతరాయం కలగకుండా మెల్లగా పాడే జోలపాటలా అనిపిస్తున్నాయి కదూ...తరువాయి

ఈ కాలంలో హాయిగా..
బయట మంచు కురుస్తూ చల్లటి గాలులు వీస్తోంటే ఇల్లాలికి పొద్దున్నే పక్క దిగాలనిపించదు, ఇంకాసేపు పడుకుంటే బాగుండనిపిస్తుంది. కానీ చేయాల్సిన పనులు గుర్తొచ్చి ఉసూరుమంటూ లేవాల్సిందే! చలికాలం ఒక్క బద్ధకమే కాదు కొన్ని ఆరోగ్యసమస్యల్నీ తెచ్చిపెడుతుంది. వాటిని దూరంపెట్టి హుషారుగా ఉండేందుకు ఈ సూత్రాలు పాటించేయండి...తరువాయి

చలికాలంలో ఇవి తింటే సులభంగా బరువు తగ్గచ్చట!
‘బరువు తగ్గాలి.. నాజూగ్గా మారాలి..’ ప్రస్తుతం చాలామంది జపిస్తోన్న ఫిట్నెస్ మంత్ర ఇది. అందుకోసమే ఇటు చక్కటి ఆహారం తీసుకుంటూనే.. అటు కఠినమైన వ్యాయామాలు చేయడానికీ వెనకాడట్లేదు ఈ తరం అమ్మాయిలు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా ఈ చలికాలంలో మాత్రం బరువు తగ్గడం కాస్త కష్టమే అని చెప్పాలి.తరువాయి

మన ఆరోగ్యానికి... పరీక్ష!
ఇంట్లో అందరి మంచీచెడ్డా చూసే అమ్మ.. తన ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటుంది. కానీ కరోనా తర్వాత ఈ అశ్రద్ధ మరింత పెరిగింది. కుటుంబానికి కేంద్రబిందువు లాంటి మహిళ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటేనే కదా తక్కిన కుటుంబమూ సంతోషంగా ఉండగలిగేది. అందుకే కౌమారం నుంచి మొదలుపెట్టి తర్వాత వివిధ దశల్లో దృష్టి పెట్టాల్సిన ఆరోగ్య పరీక్షలు, పరిష్కారాల గురించి వివరిస్తునారు ప్రముఖ వైద్యులు శాంతకుమారి...తరువాయి

Winter Health: ఈ ఆసనంతో బద్ధకానికి చెక్..!
చలికాలమంటేనే ఏదో తెలియని బద్ధకం ఆవహిస్తుంటుంది.. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అలాగని ఎప్పుడూ ఇలా రిలాక్సవుతూ కూర్చోవడం కుదరని పని. అందుకే శరీరాన్ని లోలోపలి నుంచి వెచ్చగా, చురుగ్గా మార్చుకుంటే బద్ధకం దానంతటదే మాయమవుతుందంటోంది బాలీవుడ్ ఫిట్టెస్ట్ బ్యూటీ మలైకా అరోరా.తరువాయి

చలికాలంలో క్యారట్ హల్వా అందుకే తినాలట!
ఇంట్లో క్యారట్లు మిగిలిపోతే క్యారట్ హల్వా చేసుకుంటాం.. సాధారణ హల్వా బోర్ కొట్టినా క్యారట్ హల్వాకే ఓటేస్తుంటారు చాలామంది. సులభంగా, ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ హల్వాతో తీపి తినాలన్న కోరికను తీర్చుకునే వారూ ఎంతోమంది! ఇలాంటి యమ్మీ స్వీట్ రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ మేటి అని చెబుతున్నారు నిపుణులు.తరువాయి

భోజనం తర్వాత పండు.. మంచిదా? కాదా?
శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడంలో పండ్ల పాత్ర కీలకం. అందుకే ఆయా సీజన్లలో లభించే పండ్లను తప్పకుండా తినమని సూచిస్తారు నిపుణులు. అయితే కొందరేమో వాటిని పరగడుపున తినడం మంచిదనుకుంటే.. మరికొందరు భోజనం తర్వాత తీసుకోమంటారు.. ఇంకొందరు పండ్ల రసాలు తాగడం ఆరోగ్యదాయకం అంటుంటారు.తరువాయి

డెలివరీ తర్వాత పొట్ట తగ్గాలంటే..
గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలామంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే.. వారిని చూస్తే మళ్లీ గర్భం ధరించారేమో అనిపిస్తుంటుంది.తరువాయి

థైరాయిడ్ సమస్యా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ మీకోసమే!
థైరాయిడ్.. చాలామంది మహిళల ఆరోగ్యకరమైన జీవనశైలిపై దెబ్బ కొడుతుందీ సమస్య. శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, అలసట, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం.. వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి.తరువాయి

బరువు తగ్గాలంటే వంటగదిని మార్చాల్సిందే!
బరువు తగ్గాలనుకునేవారు కేవలం వ్యాయామం మాత్రమే చేస్తే సరిపోదు.. వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానాల్లో సైతం మార్పులు చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పద్ధతుల్లో సులభంగా బరువు తగ్గుతారు. ఇలా బరువు తగ్గించుకునే క్రమంలో వంటగది పాత్ర కూడా కీలకమే. ఏంటీ? బరువు తగ్గడానికి, వంటగదికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా? అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే..తరువాయి

అందానికి.. ఆరోగ్యానికి.. అయిదు!
అందంగా ఉండాలా... ఆరోగ్యం కూడా కావాలా... అయితే ఈ ఆరు రకాల గింజలను ఆహారంలో చేర్చుకోండి మరి. అవిసె గింజలు: వీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా. ఇవి హార్మోన్ల సమతుల్యతకు, కీళ్లు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.తరువాయి

రక్తహీనతను నివారించాలంటే..
శరీరంలో హెమోగ్లోబిన్ శాతం తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే మన శరీరంలో ఐరన్ తగ్గి రక్తహీనతతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళల్లో అయితే ప్రతి నెలా నెలసరి సమయంలో ఎక్కువ మొత్తంలో రక్తం బయటికి వెళ్లిపోతుంది. కాబట్టి శరీరంలో రక్తకణాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మరి దీనికోసం ఏం చేయాలి??తరువాయి

ఒకటే ఫాలోపియన్ ట్యూబ్.. సహజంగా గర్భం వస్తుందా?
నమస్తే డాక్టర్. నా వయసు 28. పెళ్లై మూడున్నరేళ్లైంది. ఈమధ్యే ల్యాప్రోస్కోపీ చేయించుకున్నా. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే అండాశయాన్ని సంరక్షించేందుకు డాక్టర్లు నా ఎడమ ఫాలోపియన్ ట్యూబ్‌ను తొలగించారు. ప్రస్తుతం కుడి అండాశయంలో 4 cm సిస్టు ఉంది.. ఇందుకోసం మందులు వాడుతున్నాను.తరువాయి

పోషకాల సలాడ్... మొలకల చాట్!
ఒక్కోసారి బద్ధకంగా ఉండి వంట చేయాలనిపించదు. అలాంటప్పుడు సులువుగా చేసే కొన్ని పదార్థాలివీ. వీటికి గ్యాస్ అవసరం లేదు. రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేసే అవేంటో చూసేద్దామా... ఉదయం పూట ఉరుకులు పరుగులు పెడుతున్న వేళ శరీరానికి ఇది పోషణనూ, శక్తిని అందిస్తుంది. గ్యాసూ అవసరం లేదు, తయారు చేయడానికి పట్టే సమయమూ తక్కువే. చాపర్ ఉంటే మీ పని మరింత...తరువాయి

Abortions: జాగ్రత్తగా లేకపోతే ఈ సమస్యలు తప్పవు!
లైంగిక హింస, సురక్షితమైన గర్భనిరోధక సాధనాలు/పద్ధతులు పాటించకపోవడం.. ఇలా కారణమేదైనా అవాంఛిత గర్భం దాల్చడం, సమాజానికి/కుటుంబానికి భయపడి గుట్టు చప్పుడుకాకుండా ఇంట్లోనే తమకు తామే అబార్షన్ చేసుకునే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.తరువాయి

షుగర్ ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
పండగ ఏదైనా ఆ పండక్కి సంబంధించిన పూజలు, వ్రతాలతో పాటు ఆ సందర్భంగా చేసుకునే పిండి వంటలూ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తాయి. అందులోనూ దీపావళి పిండి వంటలనగానే ముందుగా గుర్తొచ్చేవి స్వీట్లు. ఈ పండక్కి మిఠాయిలను ఇంట్లో తయారుచేయడమే కాదు.. బయట నుంచి కొనుగోలు చేయడం, వాటిని నలుగురికీ పంచుతూ ఆనందించడం మన సంప్రదాయం.తరువాయి

అందుకే మితిమీరి వ్యాయామాలు వద్దు.. అమ్మాయిలూ వింటున్నారా?
‘మితంగా తింటే అమృతం.. అతిగా తింటే విషం’ అంటుంటారు. ఆహారం విషయంలోనే కాదు.. మనం ఫిట్నెస్ కోసం చేసే వ్యాయామాల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. శారీరక దృఢత్వాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి వ్యాయామాలు చేయడం ముఖ్యమే అయినప్పటికీ.. అతిగా చేస్తే మాత్రం వివిధ రకాల దుష్ప్రభావాలు తప్పవంటున్నారు ఫిట్నెస్ నిపుణులు.తరువాయి

Dry Eyes: కళ్లు పొడిబారుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి!
కళ్లు... ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి దేవుడు ప్రసాదించిన ఓ గొప్ప వరం. కానీ డిజిటల్ మోజులో పడి చాలామంది ఆ దేవుడిచ్చిన కళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత మన కళ్లకు బాగా పని పెరిగింది. కంప్యూటర్/ మొబైల్‌కు గంటల తరబడి కళ్లప్పగించేస్తుండడంతో మన కంటి ఆరోగ్యాన్ని మనమే పాడుచేసుకుంటున్నాం.తరువాయి

సంతాన సాఫల్యతకు ‘సీతాఫలం’!
సీతాఫలం.. ఈ మధుర ఫలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ మధుమేహం, పీసీఓఎస్.. వంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యలున్న వారు మాత్రం దీన్ని పక్కన పెడుతుంటారు. ఎందుకంటే ఇది ఆయా సమస్యల్ని మరింత జటిలం చేస్తుందనేది వారి భయం.తరువాయి

పోషకాహారంతో వ్యాధిపై పోరాటం...
రొమ్ము క్యాన్సర్ బాధితులు రోజూ ఆహారంలో పోషక విలువ లుండేలా జాగ్రత్తపడితే ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడొచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి, రొమ్ముక్యాన్సర్‌తో పోరాడే శక్తిని పోషకాహారం అందిస్తుందంటున్నారు. ఆ ఆహారమేంటో కూడా సూచిస్తున్నారు.తరువాయి

చిన్న వయసులో మెనోపాజ్ ఎందుకొస్తుంది?
మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక్కో దశలో ఒక్కో రకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. నెలసరి ప్రారంభానికి ముందు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. పిరియడ్స్ మొదలయ్యాక వివిధ రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇవి వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తున్నాయి.తరువాయి

బరువు తగ్గాలని ఇప్పటికీ వాటిని బ్యాన్ చేశా!
సినిమాల్లోకి రాకముందు తాము బొద్దుగుమ్మల్లా ఉండే వాళ్లమంటూ చాలామంది తారలు అప్పుడప్పుడూ తమ ఫ్లాష్‌బ్యాక్ ఫొటోలు పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. తమ వెయిట్‌లాస్ సీక్రెట్స్, ఆరోగ్య రహస్యాల్ని కూడా పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు అందాల భామలు.తరువాయి

వయసు తగ్గాలా... వర్కవుట్లు చేయండి!
వ్యాయామం వల్ల దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడొచ్చు. కండరాలతోపాటు శరీరాన్నీ దృఢంగా మలుచుకోవచ్చు. మనసూ, తనువూ రెండూ చురుగ్గా ఉంటాయి. మరి ఇన్ని ప్రయోజనాలున్న వ్యాయామాన్ని చేసేస్తే పోలా? ఏం చేయాలి అంటారా? అయితే చూడండి... ఇది ఎక్కువ కాలం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండటానికి సాయపడుతుందన్నది నిపుణుల మాట. చురుకుగా ఉంచడంతో పాటు వయసునీ కనిపించ నీయదు. ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్రతరువాయి

ఇవి తింటే... బరువు తగ్గొచ్చు
శరీరంలో కెలొరీలు పెరగాలంటే ప్రత్యేకంగా ఆహారం తీసుకుంటాం. కొన్ని రకాల ఆహారంతో కెలొరీలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఈ ‘నెగటివ్ కెలొరీ ఫుడ్’ గురించి తెలుసుకుందాం. రెండు రకాలు... కెలోరీలు రెండు రకాలు. ఆహారం ద్వారా పెరిగే కెలోరీల్లో మొదటి రకంలో పోషక గుణాలు తక్కువగా ఉండి బరువును మాత్రమే పెంచడానికి సహకరిస్తాయి. రెండోరకంలో పీచు, నీరుతరువాయి

మెనోపాజ్ దశలో లైంగిక కోరికలు తగ్గితే...
మెనోపాజ్‌కు చేరువవుతోన్న మహిళలు ఇర్రెగ్యులర్ పిరియడ్స్, వేడి ఆవిర్లు, నిద్ర పట్టకపోవడం, బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్.. వంటి లక్షణాలతో బాధపడడం ఒకెత్తయితే.. ఈ దశ గురించి వారిలో నెలకొన్న సందేహాలు, భయాలు మరొక ఎత్తు. ఇలా ఇవన్నీ వారిని అటు శారీరకంగా, ఇటు మానసికంగా కుంగదీస్తున్నాయి.తరువాయి

Stone Fruits: ఆరోగ్యానికి.. అందానికీ!
సాధారణంగా చాలా పండ్లలో గింజలు/విత్తనాలు ఉండడం మనకు తెలిసిందే. అయితే కొన్ని పండ్లలో వీటిని కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్ ఫ్రూట్స్’ అంటారు. మామిడి, పీచ్, ఆప్రికాట్స్, ప్లమ్స్, చెర్రీస్, రాస్బెర్రీ.. వంటి పండ్లు ఇందుకు ఉదాహరణలు.తరువాయి

ఒవేరియన్ డ్రిల్లింగ్ చేస్తే పిల్లలు పుడతారా?
హాయ్ డాక్టర్. నాకు 32 ఏళ్లు. బరువు 84 కిలోలు. నాకు పీసీఓఎస్ ఉంది. ప్రస్తుతం మందులు వాడుతున్నా. ఆహార నియమాలు పాటిస్తున్నా. అయినా బరువు తగ్గట్లేదు.. గర్భం దాల్చట్లేదు. డాక్టర్ ఒవేరియన్ డ్రిల్లింగ్ చేద్దామన్నారు. దీనివల్ల ఏవైనా సమస్యలొస్తాయా? లేదంటే ఐయూఐకి వెళ్లడం మంచిదా? సలహా ఇవ్వగలరు.తరువాయి

తీరొక్క పూలు.. ఆరోగ్యానికి మేలు!
బతుకమ్మ.. మహిళాశక్తిని ప్రతిబింబించే గౌరీదేవి ప్రతిరూపం. ఈమెను వివిధ రకాల పేర్చిన పూల రూపంలో కొలుస్తాం. ఆ పూలన్నీ ఈ కాలంలో దొరికేవే. వీటిని ఉపయోగించడం వెనక ఆరోగ్య సూత్రాలూ ఉన్నాయన్న విషయం తెలుసా?పసుపు రంగులో ఉండే ఈ పూలే కాదు.. మొక్కలోని ప్రతి భాగమూ ఔషధ గుణాలున్నదే. వీటిని మధుమేహం, అల్సర్, మలబద్ధక నివారణకే కాకుండా సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు....తరువాయి

ఈ చిట్కాలు పాటిస్తే పండగ సీజన్లోనూ ఆరోగ్యంగా ఉండచ్చు!
పండగల సమయంలో ముఖ్యంగా పిండి వంటకాల్ని ఆస్వాదించే విషయంలో అస్సలు రాజీపడరు కొంతమంది. ఈ క్రమంలో తమకు నచ్చిన స్వీట్స్, డీప్ ఫ్రై చేసిన పిండి వంటకాల్ని మనసారా ఆస్వాదిస్తుంటారు. ఇవి తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే అజీర్తి, కడుపు ఉబ్బరం.. వంటి సమస్యలు మొదలవుతాయి.తరువాయి

రొమ్ము క్యాన్సర్.. కొన్ని అపోహలు - వాస్తవాలు!
రొమ్ముక్యాన్సర్.. ప్రస్తుతం మహిళలని భయపెడుతున్న వ్యాధుల్లో ముఖ్యమైనది. మన దేశంలో ఏటా దీని బారిన పడేవారు లక్షల్లో ఉంటున్నారంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. సరైన అవగాహన ఉంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి.. దాన్ని ఎదుర్కొనే వీలుంటుంది.తరువాయి

పోషకాల గని.. ఆరోగ్యపు నిధి.. 'కోడిగుడ్డు'!
ఉడికించిన కోడిగుడ్డు, పాలు అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు ఇందులో నిక్షిప్తమై ఉండడమే ఇందుకు కారణం. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి.తరువాయి

నవరాత్రుల్లో ఉపవాసం చేస్తున్నారా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!
నవరాత్రుల వంటి ప్రత్యేక పర్వదినాల్లో మనలో చాలామంది ఉపవాసానికి ఉపక్రమిస్తుంటారు. అయితే వీరిలోనూ కొంతమంది చాలా నిష్ఠగా ఉండాలని రోజంతా ఏమీ తినకుండా కడుపు మాడ్చుకుంటుంటారు. నిజానికి ఉపవాసం పేరుతో అలా కడుపు మాడ్చుకోవడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడతామంటున్నారు పోషకాహార నిపుణులు.తరువాయి

మెదడు చక్కగా పని చేయాలంటే ఇవి తినాల్సిందే!
పిల్లలైనా సరే.. పెద్దలైనా సరే.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. మరి మెదడు పనితీరుపై ప్రభావం చూపే ఆ ఆహార పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...తరువాయి

అందుకే గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవాలట!
సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే మనకు ముందుగా గర్భిణులే గుర్తుకొస్తారు. కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే పిల్లలు అందంగా, మంచి రంగుతో పుడతారని చాలామంది నమ్మకం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఇందులోని పోషకాలు మాత్రం బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.తరువాయి

గుండెకు కొండంత అండ!
మన శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన, సున్నితమైన భాగాల్లో గుండె కూడా ఒకటి. అటువంటి గుండె ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రతిఒక్కరూ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొంటూ సంరక్షించుకోవాలి. నేడు 'వరల్డ్ హార్ట్ డే'. ఈ నేపథ్యంలో- గుండెను సంరక్షించుకోవడం కోసం మన ఆహారంలో భాగం చేసుకోవాల్సిన పదార్థాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..తరువాయి

తాడుతో చేసే కసరత్తులు
ఆరోగ్యానికీ, అందానికీ వ్యాయామం అవసరం. కానీ కొవిడ్ పరిస్థితులు, ఇతరత్రా బాధ్యతలతో జిమ్‌కి వెళ్లే తీరిక ఉండదు చాలా మందికి. అలాంటి వారు రెసిస్టెన్స్ బ్యాండ్‌తో ఈ కసరత్తులు ప్రయత్నించండి. ఈ బ్యాండ్‌ని స్తంభానికో, కిటికీ గ్రిల్‌కో వేసి రెండు చేతులతో బలంగా పట్టుకుని గుంజిళ్లు తీయవచ్చు. ఇలా చేస్తే చేతి కండరాలు దృఢంగా మారతాయి. నడుము, పిరుదుల దగ్గర ఉన్న కొవ్వు...తరువాయి