ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేకపోతుంటే..
'ప్రేమనేది లైఫ్‌లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు..' అయితే ప్రేమే జీవితం కాకపోయినా... ప్రేమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం మన సొంతమవుతుందో.. ఒకవేళ అందులో విఫలమైతే.. అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది. ప్రేమించిన వ్యక్తిని, వారి సాహచర్యంలో చోటుచేసుకున్న సంఘటనలను.....
'ప్రేమనేది లైఫ్‌లో చిన్న పార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు..' అయితే ప్రేమే జీవితం కాకపోయినా... ప్రేమలో విజయం సాధిస్తే ఎంత ఆనందం మన సొంతమవుతుందో.. ఒకవేళ అందులో విఫలమైతే.. అంతకంటే రెట్టింపు విషాదం మనల్ని చుట్టుముడుతుంది. ప్రేమించిన వ్యక్తిని, వారి సాహచర్యంలో చోటుచేసుకున్న సంఘటనలను మర్చిపోవడం అంత సులభం కాదు. అలాగని పదేపదే వారిని, వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుని బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనమేమీ ఉండదు. కాబట్టి ఆ జ్ఞాపకాల్లోంచి వీలైనంత త్వరగా బయటపడి మామూలు మనిషిగా మారాలి. అప్పుడే ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు. మరి అందుకూ కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం రండి..
అంతా మన మంచికే!
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగడం అవసరం. 'బ్రేకప్ అయి అసలే మనసంతా బాధగా ఉంటే.. సానుకూలంగా ఆలోచించడమెలా' అనుకుంటున్నారా? కానీ ఏది జరిగినా మన మంచికే అనుకొని ముందుకు సాగితే.. మన మనసును కలచివేసే విషయాలన్నీ వీలైనంత త్వరగా సమాధైపోతాయి. 'అప్పటివరకు తోడుగా ఉన్న వ్యక్తి అనుకోకుండా మన జీవితం నుంచి పక్కకు జరిగితే.. దాన్ని నెగెటివ్‌గా తీసుకుని బాధపడడం కంటే.. ఇలా జరగడం మన మంచికేనేమో! భవిష్యత్తులో ఇంతకంటే మంచి వ్యక్తి మన జీవితంలోకి వస్తారేమో!' అన్న సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది. ఇలాంటి పాజిటివ్ ఆలోచనల వల్ల ప్రేమించిన వ్యక్తిని త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలాగే అంతకు మించిన మధుర క్షణాలు భవిష్యత్తులో మళ్లీ మన సొంతమవ్వచ్చు కూడా!
టచ్‌లో వద్దు.. దూరమే ముద్దు..
కొంతమంది ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయిన తర్వాత కూడా వారికి పదే పదే ఫోన్ చేయడం, మెసేజ్‌లు పెట్టడం, వారు ఎదురుపడినప్పుడు దగ్గరికి వెళ్లి మాట్లాడడం.. చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారికి ఒక్కోసారి కోపం పెరిగే అవకాశం ఉంటుంది. పైగా వారి నుంచి సానుకూల స్పందన లభించనందువల్ల మనపై మనకే కోపం రావడం, ఎవరితోనూ సరిగ్గా కలవలేకపోవడం.. వంటి ప్రతికూల భావాలు చోటుచేసుకుంటాయి. ఇది రాన్రానూ జీవితంపై ఆసక్తి కోల్పోయేలా చేసే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ఇంత దూరం రాకముందే.. ఎవరికి వారు జాగ్రత్తపడడం మంచిది. ఈ క్రమంలో.. మొబైల్లో వారికి సంబంధించిన కాంటాక్ట్స్ తొలగించడం, వారికి సంబంధించిన వస్తువులను, జ్ఞాపకాలను దూరం చేయడం, తన స్నేహితులను ఎక్కువగా కలవకపోవడం.. ఇలా చేయడం ద్వారా వారిని క్రమంగా మర్చిపోయే అవకాశం ఉంటుంది.
వీటికి తావివ్వద్దు..
ప్రేమలో విఫలమైన వారిలో కొంతమందికి ఓపిక, సహనం నశిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కాక చిరాకు పెరుగుతుంది. దీంతో ప్రేమించిన వారిని అసహ్యించుకోవడం, వారిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించడం.. వంటివి చేస్తుంటారు. దీంతో ముందూ వెనకా ఆలోచించకుండా తప్పటడుగు వేస్తుంటారు. ఇలాంటి ఆవేశపూరిత ప్రవర్తన వల్ల మనశ్శాంతిని కోల్పోవడమే కాక, ఒక్కోసారి భారీ మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 'ఫలానా వ్యక్తిని మర్చిపోవాలి..' అని నిర్ణయించుకున్న క్షణం నుంచీ వారి గురించి ఏ రకమైన ఆలోచనలనైనా మనసులోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఇలా మనసును నెమ్మదిగా అదుపు చేసుకుంటే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అంత కష్టమేమీ కాకపోవచ్చు.
కెరీర్‌పై దృష్టి..
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోయే క్రమంలో వారి గురించి ఆలోచించడం పూర్తిగా మానేసి.. మన గురించి, మన భవిష్యత్తు గురించి దృష్టి సారించాలి. 'ఇప్పటిదాకా జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపోయి.. మన కెరీర్ ఏంటి? భవిష్యత్తులో ఇప్పటి దాకా ఏం సాధించాం? ఇంకా మన ముందు ఎలాంటి లక్ష్యాలున్నాయి?' ఇలా కెరీర్‌కు సంబంధించిన విషయాలన్నీ ఒక్కసారి నెమరువేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలన్నీ పాత జ్ఞాపకాల్ని క్రమంగా మర్చిపోయేలా చేస్తాయి. ఫలితంగా మంచి కెరీర్ సొంతమవుతుంది. తద్వారా మునుపటి కంటే ఎంతో ఆనందంగా గడపొచ్చు.
ప్రతిక్షణం ఆనందంగా..
ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం.. అంత త్వరగా, అంత సులువుగా జరిగే ప్రక్రియ కాదన్నది వాస్తవమే కావచ్చు.. కానీ దాన్ని కాస్త వేగవంతం చేయాలంటే మాత్రం.. ప్రతిక్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగని ఒంటరిగా కూర్చొని ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మధుర క్షణాలను నెమరువేసుకుని ఆనందించడం కాదు.. వీలైనంత ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ వారితో ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే కొన్నిరోజులు ఇతర ప్రదేశాలకు వెళ్లి రావడం వల్ల కూడా స్థలమార్పిడి జరిగి ప్రేమించిన వ్యక్తిని, వారికి సంబంధించిన జ్ఞాపకాలను నెమ్మదిగా మర్చిపోవచ్చు. ఇలా సన్నిహితులతో సంతోషంగా ఉంటూ; బాధైనా, సంతోషమైనా వారితో పంచుకుంటూ ఉంటే మనసులో ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు లేకుండా ఉంటాయి. తద్వారా పాత విషయాలన్నీ నెమ్మదిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది.
ఇంతకుముందు చెప్పుకొన్నట్లు ప్రేమించిన వ్యక్తిని అంత సులభంగా మర్చిపోవడం సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ 'ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతేతప్ప ప్రేమే జీవితం కాదు..' అనే విషయాన్ని గ్రహించి.. ముందుకెళ్తే.. పాత జ్ఞాపకాలతో పాటు ప్రేమించిన వ్యక్తిని కూడా క్రమంగా మర్చిపోయే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
- బుట్ట బొమ్మకు... బియ్యపు ముత్యాలు!
- కురులకు.. ఉల్లి నూనె!
ఆరోగ్యమస్తు
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
- కర్రతో చేద్దామా కసరత్తు!
- వేసవిలో చలువ చేసేందుకు..!
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- ఆమె పోరాటం.. అక్కడి అత్యాచార చట్టాన్నే మార్చేసింది!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
- ఆటకు దూరమైనా... అభిమానులు పెరిగారు!
'స్వీట్' హోం
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
- విరిగిన పాలతో ఇలా!
- భలే భలే బెడ్‌ల్యాంప్స్!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..