కొన్నిసార్లు వదిలేయడమే మంచిది..!

‘‘సాధించేవారు ఎప్పటికీ వదలరు... వదిలిపెట్టే వారు ఎన్నటికీ విజయం సాధించలేరు’’ వైఫల్యాలు పలకరించిన ప్రతిసారీ మనకు వినిపించే మాటలే కదా ఇవి. ప్రేమ, పెళ్లి వైఫల్యం... వ్యాపారంలో నష్టాలు... నచ్చని కెరియర్‌లో కొనసాగడం... ఈ సందిగ్ధతలు మీ జీవితంలో ఉంటే ఏం చేస్తారు? దానిలో కొనసాగుతారా? లేదా వదిలేస్తారా? ఏది ఏమైనా అందులోనే కొనసాగుతాం... లేకుంటే పరాజితులుగా మిగిలిపోమూ అంటారా!

Updated : 03 Jun 2024 04:53 IST

‘‘సాధించేవారు ఎప్పటికీ వదలరు... వదిలిపెట్టే వారు ఎన్నటికీ విజయం సాధించలేరు’’ వైఫల్యాలు పలకరించిన ప్రతిసారీ మనకు వినిపించే మాటలే కదా ఇవి. ప్రేమ, పెళ్లి వైఫల్యం... వ్యాపారంలో నష్టాలు... నచ్చని కెరియర్‌లో కొనసాగడం... ఈ సందిగ్ధతలు మీ జీవితంలో ఉంటే ఏం చేస్తారు? దానిలో కొనసాగుతారా? లేదా వదిలేస్తారా? ఏది ఏమైనా అందులోనే కొనసాగుతాం... లేకుంటే పరాజితులుగా మిగిలిపోమూ అంటారా! అయితే, ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే...

అందరికీ జీవితం పూలపాన్పు కాదు. మనతోపాటు కష్టనష్టాలూ, సవాళ్లూ కలిసే ప్రయాణిస్తుంటాయి. అయితే, వాటిని ఎదుర్కొనే విధానం ఎవరికి వారిదే ప్రత్యేకం. కొందరు అమ్మాయిలు పట్టువిడవక ప్రయత్నిస్తుంటే, మరికొందరు ఓపిక తగ్గి వదిలేయొచ్చు కూడా. ఉదాహరణకు ఓ చెడ్డ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా, మనకు సరిపడని వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఏదైనా సరే. వదిలేసినంత మాత్రాన దానర్థం వాళ్లు చెడ్డవారనో, ఓడిపోయారనో కాదు. ఒక్కోసారి వదిలేయడం కూడా మన బలాన్ని సూచిస్తుందంటారు నిపుణులు. అదెలాగంటే... దేన్నైనా ఒకరు వదిలేస్తున్నారంటే దానివల్ల కలుగుతోన్న నష్టాల్ని ఎప్పుడు, ఎలా నివారించాలో తెలుసుకునే పరిణతి వారిలో ఉందని అర్థమట. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు, రిస్క్‌ తీసుకునే సత్తా వారిలో ఉందనీ భావిస్తున్నారు. అవును మరి, దాన్ని కొనసాగించడం వల్ల వచ్చే మేలు కంటే నష్టమే ఎక్కువుంటే దాన్ని వదిలేయడమే ఉత్తమం కదా! అధిగమించలేని సవాళ్లు ఎదుర్కొన్నప్పుడు, పరిస్థితులకు అనుగుణంగా, ప్రణాళిక ప్రకారం మన శ్రమ, వనరులను వేరేవైపు పెట్టుబడిగా మళ్లించుకుంటే తప్పేముంది?

వదిలేయాలనుకోవడం వెనక?

అమెరికా సైకాలజిస్ట్‌ మార్టిన్‌ సెలిగ్మన్‌ దీని గురించి కుక్కలపై ఓ ప్రయోగం చేశారట. అదే కండిషనింగ్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. కుక్కను ఇంట్లోనే ఉంచి, బయటకు వెళ్లిపోబోతుంటే చిన్న షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చారట. దాంతో అది బయటకు వెళ్లడానికి ప్రయత్నించకుండా ఉన్నచోటే ఉండటానికి అలవాటు పడింది. పరిస్థితుల మీద నియంత్రణ లేదనుకున్నప్పుడు మనమూ అలానే ఉన్నచోటే ఉండిపోతాం. కొత్తవి ప్రయత్నించాలన్నా చేతిలో ఉన్న పని వదిలేయాలన్నా భయపడతాం. ఇవే మనల్ని ఎటూ కదలనివ్వవట. అలాగని మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుందా? అసాధ్యమైన, ప్రాక్టికల్‌గా సాధ్యం కాని లక్ష్యాలను చేరుకోవాలనే ప్రయత్నంలో ఒత్తిడిని తీసుకొస్తుంది. ఫలితంగానే చిరాకు, అసంతృప్తులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అలాంటప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుని వదిలేయడమే మేలు. అది టాక్సిక్‌ బంధాలైనా, ఉద్యోగం, వ్యాపారం మరేదైనా!  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్