Kitchen Gadgets : గరిటకు ‘రెస్ట్‌’!

అన్నం, కూరలు, రసం.. ఇలా రోజూ వంట చేసే క్రమంలో వేర్వేరు పదార్థాల్ని కలపడానికి వేర్వేరు స్పూన్లు వాడుతుంటాం. అయితే వీటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక.. ప్లాట్‌ఫామ్‌ మీదో లేదంటే స్టౌపైనో ఉంచుతాం. కానీ దీనివల్ల ఆ ప్రదేశమంతా నూనె/పదార్థాల మరకలు పడి....

Published : 25 Aug 2022 17:04 IST

అన్నం, కూరలు, రసం.. ఇలా రోజూ వంట చేసే క్రమంలో వేర్వేరు పదార్థాల్ని కలపడానికి వేర్వేరు స్పూన్లు వాడుతుంటాం. అయితే వీటిని ఎక్కడ పెట్టాలో అర్థం కాక.. ప్లాట్‌ఫామ్‌ మీదో లేదంటే స్టౌపైనో ఉంచుతాం. కానీ దీనివల్ల ఆ ప్రదేశమంతా నూనె/పదార్థాల మరకలు పడి అపరిశుభ్రంగా తయారవుతుంది.. కొన్నాళ్లకు బొద్దింకల బెడదా మొదలవుతుంది. అందుకే ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి ప్రస్తుతం ‘స్పూన్‌ రెస్ట్‌ హోల్డర్స్‌’ మార్కెట్లోకొచ్చేశాయి.

వీటిలో కొన్ని అచ్చం స్పూన్‌ ఆకృతిలో ఉంటే.. మరికొన్ని హోల్డర్‌ మాదిరిగా ఉన్నాయి.. ఇంకొన్నేమో వేర్వేరు వంటల కోసం వాడిన గరిటల్ని విడివిడిగా అమర్చుకునేలా ర్యాక్‌ను పోలి ఉన్నాయి. అంతేకాదు.. కొన్ని స్పూన్‌ రెస్ట్‌ హోల్డర్స్‌కు పాత్రలపై పెట్టే మూతల్ని అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది. పైగా ఇవన్నీ సెరామిక్‌, సిలికాన్‌, చెక్క.. వంటి మెటీరియల్‌తో తయారుచేసినవి కాబట్టి.. వేడివేడి గరిటల్ని వీటిపై పెట్టినా ఇవి పాడవుతాయన్న సమస్య ఉండదు. మరి, అలాంటి కొన్ని స్పూన్‌ రెస్ట్‌ హోల్డర్స్‌ను ఇక్కడ చూసేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని