బ్యాగోగులు చూడండి!

బ్యాగ్‌ని కొనేటప్పుడే స్పష్టత ఉండాలి. ఎందుకంటే... అన్ని అవసరాలకూ ఒకటే బ్యాగుని వాడితే సౌకర్యమూ ఉండదు.స్టైల్‌గానూ అనిపించదు. అవసరానికి తగ్గట్టు రెండు మూడు రకాలను కొనిపెట్టుకోవాలి. ఆఫీసుకి ఒకరకమైనవి, పార్టీలకు మరో తరహా... ఇలా సందర్భానికి అనువైనవి మార్కెట్లో ఎన్నో రకాలున్నాయి.

Published : 27 Dec 2022 00:19 IST

అమ్మాయిలు వెంట ఉంచుకోవాల్సిన నిత్యావసరాల్లో బ్యాగు కూడా ఒకటిగా మారింది. అయితే చాలా మంది దీని సంరక్షణ విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోరు.

బ్యాగ్‌ని కొనేటప్పుడే స్పష్టత ఉండాలి. ఎందుకంటే... అన్ని అవసరాలకూ ఒకటే బ్యాగుని వాడితే సౌకర్యమూ ఉండదు.
స్టైల్‌గానూ అనిపించదు. అవసరానికి తగ్గట్టు రెండు మూడు రకాలను కొనిపెట్టుకోవాలి. ఆఫీసుకి ఒకరకమైనవి, పార్టీలకు మరో తరహా... ఇలా సందర్భానికి అనువైనవి మార్కెట్లో ఎన్నో రకాలున్నాయి. ఉదాహరణకు ఉద్యోగానికి వెళ్లేవారు... లంచ్‌బాక్స్‌, చిన్న చిన్న ఫైల్స్‌ వంటివీ పట్టేట్లు టోటే తరహావి ఎంచుకోవచ్చు. అదే ఏ పార్టీకో వెళ్తుంటే ఎంబ్లిష్డ్‌ క్లచ్‌లు.

బ్యాగులో కనిపించిన ప్రతి వస్తువునీ పెట్టేస్తుంటారు. ఇలా చేస్తే ఎక్కువకాలం మన్నదు. ఆకృతీ దెబ్బ తింటుంది. మేకప్‌ సామగ్రి, చిల్లర పైసలు, మందులూ వంటివన్నీ వంటివి జిప్‌లాక్‌ కవర్లలో లేదా చిన్న చిన్న పౌచెస్‌లో విడిగా పెట్టి బ్యాగులో సర్దుకోవాలి. అప్పుడే అవసరానికి దొరుకుతాయి. బ్యాగూ చక్కగా కనిపిస్తుంది.

హ్యాండ్‌బ్యాగ్‌లో ఆహార పదార్థాలను నేరుగా పెట్టేస్తుంటారు కొందరు. అలాంటి ఆహారం తినడమూ మంచిది కాదు...బ్యాగూ శుభ్రంగా ఉండదు. అందుకే వీలైనంతవరకూ పదునైన వస్తువులు, పాడుచేసే ఆహార పదార్థాలను ఇందులో పెట్టవద్దు.

బ్యాగ్‌ కొన్న వెంటనే దానిపై ఉండే ట్యాగ్‌ను తీసి భద్రపరచండి. దానిపై శుభ్రపరిచే విధానం రాసి ఉంటుంది. కనీసం వారంలో ఒకసారైనా వస్తువులన్నీ బయటకు తీసి గాలికి ఆరనివ్వాలి. దుర్వాసన వస్తోంటే మెత్తటి పొడివస్త్రంతో తుడవండి. లేదా కాస్త వంటసోడాను లోపల చల్లి తరువాత దులిపేయాలి. ప్రత్యేకించి లెదర్‌ బ్యాగుల క్లీనింగ్‌ సొల్యూషన్‌ బయట దొరుకుతోంది. దాన్ని ఎంచుకున్నా సరే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్