Kiran Nadar: కళపై ప్రేమకు ఫ్రెంచి పురస్కారం
శివ్ నాడార్ భార్యగా కంటే.. అభిరుచితోనే తనకంటూ గుర్తింపు సాధించారు కిరణ్ నాడార్! జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కళా రంగానికి చేసిన సేవకుగానూ ఫ్రెంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్నీ అందుకున్నారు.
శివ్ నాడార్ భార్యగా కంటే.. అభిరుచితోనే తనకంటూ గుర్తింపు సాధించారు కిరణ్ నాడార్! జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కళా రంగానికి చేసిన సేవకుగానూ ఫ్రెంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్నీ అందుకున్నారు.
ఎంసీఎంలో కమ్యూనికేషన్స్ అండ్ బ్రాండ్స్ ప్రొఫెషనల్‌గా కిరణ్ కెరియర్ ప్రారంభమైంది. అక్కడే హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్‌ను కలిశారీమె. స్నేహం కాస్తా పెళ్లి వైపునకు అడుగులు వేసేలా చేసింది. కళాకృతులను సేకరించడమంటే ఆసక్తి ఈవిడకి. 1988 నుంచి ఇంటి కోసమని దేశ విదేశాల్లో మనసుకి నచ్చిన వాటన్నింటినీ కొనడం మొదలుపెట్టారు. వేలల్లో ఉన్న వాటిని ఇంటికే పరిమితం చేయడం నచ్చలేదావిడకి. దీంతో సొంత మ్యూజియం ప్రారంభిం చాలనుకున్నారు. అలా 2005లో ‘కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (కేఎన్‌ఎంఏ)’ ప్రారంభమైంది. ఏటా దీన్ని సందర్శించేవారు లక్షల్లోనే!
ఆవిడ సేకరించిన కళాకృతుల సంఖ్య అయిదు వేలకు పైనే! అందుకే ఆవిడను భారతీయ కళలకు ‘మహారాణి’గానూ చెబుతుంటారు. న్యూయార్క్‌లోని మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎంఓఎంఏ)కి అంతర్జాతీయ కౌన్సిల్ మెంబర్ కూడా. శివ్ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా భారత్- ఫ్రెంచ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పురోభివృద్ధికీ, కళల సహకారానికీ కృషి చేస్తున్నారు. ఆ దేశ మ్యూజియాలతో కలిసి పనిచేస్తున్నారు కూడా. ఆ సేవలకు గుర్తింపుగానే ఫ్రెంచి ప్రభుత్వం నుంచి అత్యుత్తమ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 72 ఏళ్ల కిరణ్.. దాతృత్వంలోనూ ముందే! 2010లో ఫోర్బ్స్ ఏషియన్ మ్యాగజైన్ ఆవిడను ‘హీరో ఆఫ్ ఫిలాంత్రపీ’గా అభివర్ణించింది. ఎస్‌ఎస్‌ఎన్ ట్రస్టు నిర్వహిస్తూనే, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, రసాజా ఫౌండేషన్‌లకు పని చేస్తున్నారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముస్లిం బాలికలకు విద్యనందించడంలోనూ సాయం అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.