అన్నం మిగిలిపోయిందా?అయితే ఈ రెసిపీ ట్రై చేయండి!

రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయడం చాలామందికి అలవాటు. అయితే ఇలా వృథాగా పడేయడం ఇష్టం లేని వారు.. చద్దన్నం, లెమన్‌ రైస్‌, పుదీనా రైస్‌.. అంటూ వివిధ రకాల వంటకాలను తయారుచేసుకొని తింటుంటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో ఏదైనా స్పైసీగా ట్రై చేయాలనుకుంటే పెప్పర్‌ రైస్‌ను ప్రయత్నించి చూడండి.

Published : 25 Sep 2021 17:40 IST

రాత్రి మిగిలిపోయిన అన్నం పడేయడం చాలామందికి అలవాటు. అయితే ఇలా వృథాగా పడేయడం ఇష్టం లేని వారు.. చద్దన్నం, లెమన్‌ రైస్‌, పుదీనా రైస్‌.. అంటూ వివిధ రకాల వంటకాలను తయారుచేసుకొని తింటుంటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో ఏదైనా స్పైసీగా ట్రై చేయాలనుకుంటే పెప్పర్‌ రైస్‌ను ప్రయత్నించి చూడండి.

పెప్పర్‌ రైస్‌/మిలాగు సదమ్‌

కావాల్సిన పదార్థాలు

* వెజిటబుల్ ఆయిల్‌ - 2 టేబుల్‌ స్పూన్లు

* ఆవాలు - ఒక టీస్పూన్‌

* మినప్పప్పు- ఒక టీస్పూన్‌

* శెనగపప్పు - ఒక టీస్పూన్‌

* కరివేపాకు - 10నుంచి 12 రెబ్బలు

* ఇంగువ – అర టీస్పూన్‌

* ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు

* జీడిపప్పు - 10 నుంచి 12

* మిరియాల పొడి - ఒక టీస్పూన్‌

* ఉప్పు - తగినంత

* మిగిలిపోయిన అన్నం - రెండు కప్పులు

తయారీ

ప్యాన్‌లో నూనె వేసి వేడిచేయాలి. ఆ తర్వాత ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు దోరగా వేయించాలి. ఇప్పుడు కరివేపాకు, ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు చిటపటలాడించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, జీడిపప్పు కూడా జతచేసి గోధుమరంగులోకి మారే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో అన్నం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాల తర్వాత స్టౌ కట్టేస్తే రుచికరమైన పెప్పర్‌ రైస్‌ రడీ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్