Summer Fashion: ‘స్కర్ట్’తో స్టైలిష్‌గా మెరిసిపోదాం!
కాలాన్ని బట్టి సౌకర్యవంతమైన దుస్తులు ఎంచుకోవడం మనకు అలవాటే! ముఖ్యంగా వేసవిలో కాస్త వదులుగా, శరీరానికి గాలి తగిలేలా ఉండే ఫ్యాషన్లకే ఓటేస్తుంటాం. వాటిలో స్కర్ట్స్ ముందు వరుసలో ఉంటాయి. అటు సౌకర్యాన్నిస్తూనే.. ఇటు స్టైలిష్‌గా కనిపించేలా....
(Photos: Instagram)
కాలాన్ని బట్టి సౌకర్యవంతమైన దుస్తులు ఎంచుకోవడం మనకు అలవాటే! ముఖ్యంగా వేసవిలో కాస్త వదులుగా, శరీరానికి గాలి తగిలేలా ఉండే ఫ్యాషన్లకే ఓటేస్తుంటాం. వాటిలో స్కర్ట్స్ ముందు వరుసలో ఉంటాయి. అటు సౌకర్యాన్నిస్తూనే.. ఇటు స్టైలిష్‌గా కనిపించేలా చేసే వీటిలో ఇప్పుడు చాలా రకాలు దొరుకుతున్నాయి. పొడవు ఎక్కువగా/తక్కువగా, ప్లీటెడ్ తరహాలో ఉన్నవి, డెనిమ్‌తో రూపొందించినవి, మిడ్డీని పోలి ఉన్నవి.. ఇలాంటి ట్రెండీ స్కర్ట్స్‌కి ఓ స్టైలిష్ టాప్‌ని జోడించామంటే లుక్ అదిరిపోతుంది. మరి, అలాంటి కొన్ని స్కర్ట్ కాంబినేషన్స్ మీకోసం..!
స్కర్ట్‌పై షర్ట్!
స్కర్ట్‌పై క్రాప్‌టాప్ వేసుకోవడం కామన్.. అదే స్కర్ట్‌కు షర్ట్‌ను జోడించడం.. లేటెస్ట్ ట్రెండ్. ఈ కాలపు అమ్మాయిలు ఈ నయా ట్రెండ్‌నే కోరుకుంటున్నారు. ఫ్లోరల్, యానిమల్, జామెట్రిక్.. వంటి విభిన్న ప్రింట్లతో కూడిన షర్ట్స్‌ని తమ స్కర్ట్స్‌కి మ్యాచ్ చేస్తూ ఫ్యాషనబుల్‌గా మెరిసిపోతున్నారు. ఇందులోనూ షార్ట్ స్లీవ్స్ ఉన్నవి ఎంచుకోవచ్చు.. నప్పితే ఫుల్ స్లీవ్స్ ఉన్నవి కూడా ధరించచ్చు. అయితే మీరు ఎంచుకునే స్కర్ట్ రంగుకు వ్యతిరేక రంగుల్లో ఉండే షర్ట్స్ మరింత ఆకర్షణీయమైన లుక్‌ని అందిస్తాయి. వీటిని సాధారణంగా ధరించడం కాకుండా.. ఇన్‌షర్ట్ చేసుకుంటే బాసీ లుక్‌ని సొంతం చేసుకోవచ్చు.
షిమ్మరీతో మెరిసిపోదామా?
కాంట్రాస్ట్ రంగులు అందరికీ నప్పకపోవచ్చు. ఇలాంటప్పుడు టాప్-బాటమ్.. రెండూ ఒకే రంగులో ఉన్నవి ఎంచుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మరింత అందంగా కనిపించాలంటే.. స్కర్ట్‌కి మనం మ్యాచ్ చేసే టాప్.. అదే రంగులో షిమ్మరీ ఫ్యాబ్రిక్‌తో రూపొందించినది ఎంచుకుంటే బాగుంటుంది. ఇందులోనూ ఎవరికి నప్పినట్లుగా వారు షార్ట్/లాంగ్ స్లీవ్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవచ్చు. అది కూడా స్కర్ట్‌కి తాకకుండా కాస్త పొట్టిగా, వదులుగా ఉండేదైతే మరింత స్టైలిష్‌గా కనిపించేయచ్చు.
డెనిమ్‌తో.. హాయి హాయి!
వేసవిలో చాలామంది డెనిమ్‌ని దూరం పెడుతుంటారు. కానీ ఈ కాలానికీ ఇది పర్‌ఫెక్ట్ ఎంపిక అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అందులోనూ సాధారణ డెనిమ్ కాకుండా.. కాటన్ డెనిమ్‌తో రూపొందించినవి ఈ కాలంలో సౌకర్యాన్నిస్తాయి. ఇలాంటి స్కర్ట్స్ ప్రస్తుతం చాలామంది అమ్మాయిల్ని ఆకట్టుకుంటున్నాయి. వీటిలోనూ ఎ-లైన్ తరహాలో రూపొందించినవి, అక్కడక్కడా బటన్స్‌తో హంగులద్దినవి, స్లిట్ ఉన్నవి.. ఇలా చెప్పుకుంటూ ఫ్యాషనబుల్ స్కర్ట్స్‌కి మార్కెట్లో కొదవే లేదు. అయితే వీటికి జతగా కాటన్ డెనిమ్‌తో రూపొందించిన క్రాప్‌టాప్స్ అయినా ఎంచుకోవచ్చు.. లేదంటే సాధారణ క్రాప్‌టాప్స్, షర్ట్స్ తరహా టాప్స్, టీ-షర్ట్స్.. ఇలా మీ శరీరాకృతికి నప్పినది ధరించి మెరిసిపోవచ్చు.
బ్లౌజ్‌తో భలే లుక్!
అటు క్లాసీగా కనిపిస్తూనే.. ఇటు ట్రెండీగా మెరిసిపోవాలనుకుంటారు కొందరమ్మాయిలు. అలాంటి వారు తాము ఎంచుకునే స్కర్ట్స్‌కి బ్లౌజ్ తరహా క్రాప్‌టాప్స్‌ని జత చేయమంటున్నారు ఫ్యాషనర్లు. అది కూడా స్కర్ట్‌కి మ్యాచింగ్‌గా ఉండేలా ప్లీటెడ్ తరహా స్లీవ్స్ ఉన్నవి, మ్యాచింగ్ కలర్‌లో రూపొందించినవి లేదంటే వ్యతిరేక రంగుల్లో ఉన్నవి.. ఇలా మీకు నప్పినది ఎంచుకోవచ్చు. అయితే ఈ బ్లౌజ్ క్రాప్‌టాప్స్‌లోనూ పొడవుగా ఉన్నవి, నడుం భాగంలో స్కర్ట్‌కి తాకకుండా పొట్టిగా ఉన్నవీ దొరుకుతున్నాయి. ఈ రెండింట్లో స్కర్ట్‌కి మ్యాచయ్యేలా, మీ శరీరాకృతికి నప్పేలా చూసుకుంటే సరిపోతుంది.
లేడీ బాస్‌లా..!
కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు రోజూ కంటే.. బిజినెస్ మీటింగ్స్, కార్పొరేట్ సెమినార్స్.. వంటి సందర్భాల్లో మరింత హుందాగా మెరిసిపోవాలనుకుంటారు. అలాంటి వారికి లెదర్ స్కర్ట్స్ చక్కటి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో దీనిపై ఓ టర్టిల్ టీ-షర్ట్‌ని జత చేసి.. దానిపై నుంచి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బ్లేజర్‌ని ధరిస్తే.. అకేషన్‌లో మీరే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.