అభిరుచిగా మొదలుపెట్టిందే లక్షల వ్యాపారమైంది!
నేను మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. నాతో పాటు నలుగురూ ఎదగాలనుకోవడం మంచితనం.. ఈ నిస్వార్థ భావనతోనే వందలాది మంది గృహిణులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది ఉత్తరప్రదేశ్‌లోని సురోలీ గ్రామానికి చెందిన పూజా షాహి. చదువు అబ్బకపోయినా.. తన తల్లి స్ఫూర్తితో ప్రాచీన హస్తకళపై ఆసక్తి చూపిన ఆమె.. ఈ అభిరుచినే వ్యాపారంగా....
(Photos: Facebook)
నేను మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. నాతో పాటు నలుగురూ ఎదగాలనుకోవడం మంచితనం.. ఈ నిస్వార్థ భావనతోనే వందలాది మంది గృహిణులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది ఉత్తరప్రదేశ్‌లోని సురోలీ గ్రామానికి చెందిన పూజా షాహి. చదువు అబ్బకపోయినా.. తన తల్లి స్ఫూర్తితో ప్రాచీన హస్తకళపై ఆసక్తి చూపిన ఆమె.. ఈ అభిరుచినే వ్యాపారంగా మార్చుకోవాలనుకుంది. అయితే అదంత సులభం కాలేదు.. ఇటు ఇంటా, అటు సమాజం నుంచి వివక్షను ఎదుర్కొన్నా.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది పూజ. ఆ స్వీయ నమ్మకమే ఇప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచానికీ పాకేలా చేసింది. ‘ఇంటా, బయటా ప్రోత్సాహం లేకపోయినా.. మన కెరీర్ పట్ల మనకు ఓ స్పష్టత ఉండాలి.. కచ్చితంగా విజయం సాధిస్తాం..’ అంటూ తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న పూజ విజయ గాథ ఇది!
ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని సురోలీ గ్రామానికి చెందిన పూజా షాహికి చిన్నతనం నుంచి చదువంటే ఇష్టం లేదు. కుటుంబ ఒత్తిడితో ఎలాగోలా ఇంటర్ పూర్తిచేసిన ఆమె.. ఇక పుస్తకాలు పక్కన పెట్టి తన తల్లి చేసే క్రోషే కళపై దృష్టి పెట్టింది. అమ్మమ్మలు, నాన్నమ్మల కాలం నాటి ప్రాచీన హస్తకళ అయిన ఇందులో క్రోషే హుక్, మ్యాక్రేమ్ అనే దారం సహాయంతో వివిధ వస్తువుల్ని అల్లుతారు. ఇలా క్రమంగా దీనిపై మక్కువ పెంచుకున్న పూజ.. దీన్నే తన కెరీర్‌గా మలచుకోవాలని నిర్ణయించుకుంది.
‘ఇంటి పరువు నీ చేతిలో ఉంద’న్నారు!
నిర్ణయమైతే తీసుకుంది కానీ.. దాన్ని ఆచరణలో పెట్టడం ఆమెకు అంత సులభం కాలేదు. ఈ కళలో మెలకువలు నేర్చుకుంటానంటే ఇంట్లో అమ్మానాన్నలే అడ్డుపడ్డారు.. ‘ఇల్లొదిలి ఎక్కడికో వెళ్తుంది’ అని నలుగురూ నానా రకాలుగా మాట్లాడుకున్నారు. అయినా స్వీయ నమ్మకంతో ముందుకు సాగానని చెబుతోంది పూజ.
‘మనలోని ఆసక్తుల్ని, ప్రత్యేకతల్ని ఈ లోకం ఎప్పుడూ ఒప్పుకోదు. నాకు చదువుపై ఆసక్తి లేకపోవడంతో క్రోషే కళపై మక్కువ చూపా. మా అమ్మ చేతిలో ఎన్నో క్రోషే వస్తువులు రూపుదిద్దుకున్నాయి. ఆమెను చూస్తూ పెరిగిన నాకు వయసుతో పాటే దీనిపై ఆసక్తి కూడా పెరిగింది. జాగృతి యాత్రా అనే సంస్థ సహకారంతో ఈ కళలో నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి ముంబయి వెళ్తానంటే నలుగురూ నానా రకాలుగా మాట్లాడుకున్నారు.. ఇక నాన్నేమో.. ‘మన కుటుంబ పరువు నీ చేతిలోనే ఉందమ్మా!’ అంటూ నన్ను నిరుత్సాహపరిచేవారు. అయినా నేను వెనకడుగు వేయలేదు..’ అంటూ చెప్పుకొచ్చిందీ యూపీ ఆంత్రప్రెన్యూర్.
క్రోషేకు కొత్తందం!
విమర్శల్ని పక్కన పెట్టి ఈ కళలో మరిన్ని నైపుణ్యాలు కూడగట్టుకున్న పూజ.. తన సృజనాత్మకతతో విభిన్న అలంకరణ వస్తువులు, ఉత్పత్తుల్ని తయారుచేయడం మొదలుపెట్టింది. సాఫ్ట్ టాయిస్ దగ్గర్నుంచి, నగలు, గృహాలంకరణ వస్తువులు, పిల్లల ఉయ్యాలలు, హ్యామక్, సోఫా-టీవీ కవర్లు, మిర్రర్ వాల్ హ్యాంగర్స్, కర్టెన్లు, ఫొటో ఫ్రేమ్స్, బాటిల్ హోల్డర్స్, మ్యాట్ కవర్స్.. ఇలా ఎన్నెన్నో తన చేతిలో రూపుదిద్దుకున్నాయి. మరి, వీటిని అమ్మడం ఎలా అనుకున్న తరుణంలో ‘జాగృతి యాత్ర’ సంస్థ తనకో దారి చూపించిందని చెబుతోంది పూజ. ఈ సంస్థలో మార్కెటింగ్ మెలకువలతో పాటు ఇతర నైపుణ్యాల్ని ఒంటబట్టించుకున్న ఆమె.. ‘డియోరియా డిజైన్’ పేరుతో తానే సొంతంగా ఓ సంస్థను నెలకొల్పింది.
వాళ్లకు ఉపాధి కల్పన!
అప్పటికే తన ఉత్పత్తులకు మంచి స్పందన రావడంతో బిజీ అయిపోయిన పూజ.. తన సంస్థ ద్వారా మరికొంతమందికి ఉపాధి కల్పించాలనుకుంది. ఆ సమయంలోనే రోజంతా ఇంటి పనిలో మగ్గిపోయే గృహిణులు ఆమెకు గుర్తొచ్చారు. ఇలా స్థానికంగా ఎవరెవరున్నారని ఓ చిన్నపాటి సర్వే చేసిన ఆమె.. తొలుత కొంతమంది ఔత్సాహిక మహిళలకు శిక్షణ ఇచ్చి పనిలో పెట్టుకుంది. ఇలా ఇంతింతై అన్నట్లుగా తన ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది.. మరోవైపు తన సంస్థ ద్వారా ఉపాధి పొందే మహిళల సంఖ్యనూ అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది పూజ. ప్రస్తుతం సుమారు 350 మంది మహిళలు 100కు పైగా విభిన్న క్రోషే ఉత్పత్తులు తయారుచేస్తున్నారు. వాటిని దేశవ్యాప్తంగానే కాదు.. ఈ ఉత్పత్తులకు బాగా డిమాండ్ ఉన్న అమెరికా, జర్మనీ.. వంటి దేశాలకూ ఎగుమతి చేస్తోందామె.
‘ఎన్నో విదేశీ సంస్థలు మా ఉత్పత్తుల కోసం మమ్మల్ని సంప్రదించాయి. అందులో పేరున్న వాల్‌మార్ట్ కూడా ఉంది. ఇప్పటికే వేలాది మంది మహిళలు మా వద్ద శిక్షణ పొంది.. వివిధ సంస్థల్లో ఉద్యోగం సంపాదించారు. ఇక మా సంస్థ కోసం మరో మూడేళ్లలో పది వేల మంది శాశ్వత మహిళా ఉద్యోగుల్ని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటూ తన ఆశయం గురించి చెప్పుకొచ్చింది పూజ.
వాళ్లే నాకు తోడయ్యారు!
2019లో ఓ కంప్యూటర్ ఇంజినీర్‌ను వివాహం చేసుకుంది పూజ. ఆ తర్వాతే తన భర్త, అత్తింటి వారి సహకారంతో తన వ్యాపారం లక్షల ఆర్జన దిశగా దూసుకుపోయిందంటోందామె. ‘వివాహం తర్వాత మావారు, అత్తింటి వాళ్లు నాకు పూర్తి సహకారం అందించారు. మా అత్తగారు నాకు తల్లి కంటే ఎక్కువ.. మంచి స్నేహితురాలు కూడా! ప్రస్తుతం ఆమె నా సంస్థలో భాగస్వామి. ఒకప్పుడు నన్ను చూసి ఎగతాళి చేసిన వారే.. ఇప్పుడు నాకొస్తున్న పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు చూసి.. గర్వపడుతున్నారు.. ఆఖరికి మా పుట్టింటి వారితో సహా! చాలా సంతోషంగా ఉంది.. మనపై మనం నమ్మకముంచి.. లక్ష్యం పట్ల ఓ స్పష్టత ఉంటే.. ఎలాంటి కెరీర్‌లోనైనా సరే.. సగం విజయం సాధించినట్లే!’ అంటూ తన మాటలతోనూ నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతోంది పూజ. తన కృషికి గుర్తింపుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ‘దేవి’ పురస్కారం సైతం అందుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!