అందుకే నవ్వుదాం..!

నవ్వు నాలుగు విధాల మంచిది.. అని కొందరంటే, నవ్వు నాలుగు విధాల చేటు.. అని మరికొందరంటారు. ఏదేమైనా.. ఎవరెలా అన్నా.. ‘అందమైన చిరునవ్వు ముందు అన్నీ దిగదుడుపే’ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనసారా రువ్వే ఓ చిరునవ్వు ఇచ్చే అనుభూతిని, ఆత్మవిశ్వాసాన్ని మరేదీ ఇవ్వలేదు.

Published : 08 Jul 2024 12:14 IST

నవ్వు నాలుగు విధాల మంచిది.. అని కొందరంటే, నవ్వు నాలుగు విధాల చేటు.. అని మరికొందరంటారు. ఏదేమైనా.. ఎవరెలా అన్నా.. ‘అందమైన చిరునవ్వు ముందు అన్నీ దిగదుడుపే’ అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనసారా రువ్వే ఓ చిరునవ్వు ఇచ్చే అనుభూతిని, ఆత్మవిశ్వాసాన్ని మరేదీ ఇవ్వలేదు. మరి, నవ్వుతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందామా?!

ఆనందం.. ఆత్మవిశ్వాసం..

మీరు నిజంగా ఆనందంగా ఉన్న విషయం మీ ముఖ కవళికల ద్వారా తెలిసిపోతుంది. ఈ సమయంలో రక్తం మెదడుకి ప్రసరిస్తుంది. నవ్వు మనసుకి ప్రశాంతతని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మనం ఇతరులను నవ్వుతూ పలకరిస్తే వారి నుంచి జవాబు మరింత పాజిటివ్‌గా వస్తుంది. దీంతో మనలో ఆత్మవిశ్వాసం, ఆనందం మరింత రెట్టింపవుతాయి. మీ నవ్వు ద్వారానే మీలో ఉన్న పాజిటివ్ గుణాలు బయటపడతాయి. దీంతో ఎదుటివారు కూడా మీకు నిజాయతీగా దగ్గరవుతారు.

చిరునవ్వుతో చిక్కులు దూరం!

నవ్వు మన అందాన్ని ఇనుమడింపజేయడమే కాదు.. ఆరోగ్యం, పనిలో చురుకుదనాన్నీ అందిస్తుంది. కళ్ల ద్వారా ఎదుటివారి భావాలను ఎలా తెలుసుకోవచ్చో.. అలాగే నవ్వుతో కూడా ఎదుటివారి భావాలు, ప్రవర్తనను ఇట్టే కనిపెట్టేయచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఏదైనా చిన్న సమస్యలో ఉన్నప్పుడు ఓ చిరునవ్వు నవ్వితే చాలు.. మన సమస్యలన్నీ దూరమై మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ఇదేవిధంగా ఇదే నవ్వుతో ఇతరుల సమస్యల్నీ దూరం చేస్తూ వారిలో పాజిటివిటీని నింపచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్