వీటిని చెక్కు తీయకుండానే తినచ్చు!

చాలా సందర్భాల్లో కూరగాయలు, పండ్లను చెక్కు తీసి మరీ తింటుంటాం. అయితే కొన్నింటికి చెక్కు తీయాల్సిన అవసరమే లేందంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం రండి..

Published : 27 Feb 2022 14:45 IST

చాలా సందర్భాల్లో కూరగాయలు, పండ్లను చెక్కు తీసి మరీ తింటుంటాం. అయితే కొన్నింటికి చెక్కు తీయాల్సిన అవసరమే లేదంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందాం రండి..

బంగాళాదుంపలు...

వీటిని చాలా వరకు చెక్కు తీసేసి వాడుతుంటాం. కానీ బంగాళాదుంపలో ఉండే పీచు, కొన్ని రకాల విటమిన్లు, ఖనిజాల్లో దాదాపు ఇరవై శాతం దాకా చెక్కులోనే ఉంటాయట. అందుకే చెక్కు తీయకుండా వాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వాడే ముందు.. బాగా శుభ్రం చేయడం వల్ల దానికున్న మట్టి తొలగిపోతుంది. అలాగే చిలగడదుంపనూ చెక్కు తొలగించకుండానే తినడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందులోనూ విటమిన్‌ ‘సి’, పొటాషియం, బీటా కెరోటిన్‌.. లాంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

కీరదోస

దీన్ని కూడా శుభ్రంగా కడిగి వీలైనంత వరకు చెక్కుతో సహా తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, పీచు ఉంటాయి. ఈ రెండు పోషకాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. అలాగే జీర్ణ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి.

క్యారట్లు

వీటిని శుభ్రంగా ఒకటికి రెండుసార్లు కడిగితే గనుక అసలు చెక్కు తీయాల్సిన అవసరమే లేదు. ఈ చెక్కులోనే సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

యాపిల్స్‌

ఈ పండును చెక్కుతో సహా తినడం వల్ల అరగడానికి ఎక్కువ సమయం పడుతుందని, పైగా పొట్టుపై మైనపు పూత ఉంటుందని.. అందుకే తీసేయడమే మంచిదని చాలామంది అభిప్రాయం. కానీ ఇందులోనే పీచు ఎక్కువగా ఉంటుంది. అదే పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది. అరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్‌ ‘సి’తో పాటు కొన్ని రకాల పోషకాలు క్యాన్సర్‌ కారకాలతో పోరాడతాయి. అయితే ముందుగా యాపిల్‌పై ఉండే మైనపు పూత తొలగిపోయేలా రుద్ది మరీ కడగడం మర్చిపోవద్దు.

అయితే.. అన్నిట్లోనూ కాలుష్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో పండ్లు, కూరగాయలను తినేముందు శుభ్రంగా కడగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్