అంబానీ ఇంట సంగీత్‌.. సందడే సందడి!

ప్రస్తుతం ప్రపంచమంతా ‘జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’ వైపే చూస్తోంది. ఎందుకంటే అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్లి వేదిక ఇది! గుజరాతీ సంప్రదాయం ప్రకారం మమేరు వేడుకతో ఈ జంట పెళ్లి వేడుకలు ఇటీవలే మొదలయ్యాయి.

Published : 06 Jul 2024 20:04 IST

(Photos: Instagram)

ప్రస్తుతం ప్రపంచమంతా ‘జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’ వైపే చూస్తోంది. ఎందుకంటే అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్ల పెళ్లి వేదిక ఇది! గుజరాతీ సంప్రదాయం ప్రకారం మమేరు వేడుకతో ఈ జంట పెళ్లి వేడుకలు ఇటీవలే మొదలయ్యాయి. తాజాగా నిర్వహించిన సంగీత్‌ సెలబ్రేషన్స్‌ అంబరాన్ని తాకాయి. ఎప్పటిలాగే తారలు, ప్రముఖులంతా ఒక్క చోట చేరి ఆటపాటలతో సందడి చేశారు.. థీమ్‌కు తగ్గట్లే ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. అందుకే సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా అంబానీ సంగీత్‌ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే దర్శనమిస్తున్నాయి.

‘మమేరు’లో మెరిసింది!

రాధికా మర్చంట్‌-అనంత్‌ అంబానీ వివాహంతో ఒక్కటయ్యే సమయం సమీపిస్తోంది. గతేడాది నిశ్చితార్థం మొదలు.. ఘనంగా నిర్వహించిన రెండు ప్రి-వెడ్డింగ్‌ వేడుకల అనంతరం.. ఇటీవలే ఈ జంట పెళ్లి వేడుకల్ని ప్రారంభించింది అంబానీ కుటుంబం. గుజరాతీ సంప్రదాయం ప్రకారం ‘మమేరు వేడుక’తో ఈ సెలబ్రేషన్స్‌ మొదలయ్యాయి. వరుడి మేనమామలు, వారి కుటుంబ సభ్యులు కలిసి కాబోయే వధూవరులకు కానుకలిచ్చి వారిని ఆశీర్వదించే వేడుకే ఇది! ఇటీవలే నిర్వహించిన ఈ వేడుకలో కొత్త జంట గుజరాతీ సంప్రదాయానికి అనుగుణంగా బాంధనీ ప్రింటెడ్‌ దుస్తుల్లో మెరిసిపోయింది. ఇతర కుటుంబ సభ్యులూ, బంధువులు, అతిథులూ ఈ థీమ్‌కు తగినట్లుగా దుస్తులు ధరించి మెరిసిపోయారు. ఇక వధువు రాధిక.. దుర్గామాత శ్లోకాలతో ప్రత్యేకంగా ఎంబ్రాయిడరీ చేయించుకున్న ఆరెంజ్‌-పింక్‌ లెహెంగాను ధరించింది. ఇలా తన అటైర్‌కు మ్యాచింగ్‌గా ఆమె తన తల్లి బంగారు నగల్ని ధరించింది. వీటన్నింటిలోకెల్లా ఆమె ధరించిన హెయిర్‌ యాక్సెసరీ వేడుకకే హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు.

అంబానీ డ్యాన్స్‌.. అదుర్స్!

సాధారణంగానే అంబానీ ఇంట పండగైనా, పూజైనా.. తారలంతా ఇక్కడ వాలిపోతారు. అలాంటిది పెళ్లంటే.. వాళ్లు చేసే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా నిర్వహించిన ‘సంగీత్‌ వేడుక’లో ఇదే రిపీటైంది. కొత్త జంటతో కలిసి అంబానీ ఫ్యామిలీ.. ‘ఓమ్‌ శాంతి ఓమ్’ సినిమాలోని ‘దీవాంగీ దీవాంగీ’ అనే పాటకు డ్యాన్స్‌ చేసి అదరగొట్టింది. వీళ్ల పెర్ఫార్మెన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. గ్లోబల్‌ పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ పెర్ఫార్మెన్స్‌ కూడా ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. ఇక ఈ వేడుకలో థీమ్‌కు తగినట్లే మోడ్రన్‌ దుస్తుల్లో మెరిసిపోయారు కాబోయే వధూవరులు, వారి కుటుంబ సభ్యులు. మరోవైపు అతిథులూ స్టైలిష్‌ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.

ఒక్కొక్కరిదీ.. ఒక్కో స్టైల్!

⚛ సంగీత్‌ వేడుక కోసం.. వధువు రాధిక అబుజానీ సందీప్‌ ఖోస్లా రూపొందించిన బీజ్‌ కలర్‌ లెహెంగాను ఎంచుకుంది. దీనిపై భారీగా ఎంబ్రాయిడరీ చేశారు. లెహెంగాకు మ్యాచింగ్‌గా ఆఫ్‌-షోల్డర్‌ బ్లౌజ్‌ను ధరించిన రాధిక.. భారీ జ్యుయలరీతో కట్టిపడేసింది. ఇక పార్టీ అనంతరం నలుపు రంగు సీక్విన్‌డ్‌ శారీలో ముస్తాబైందీ బ్యూటీ.

⚛ రాధిక-అనంత్‌ సంగీత్‌ వేడుకలో ఈషా అంబానీ ధరించిన టల్లే లెహెంగా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫల్గుణీ షేన్‌ పీకాక్‌ రూపొందించిన ఈ పీచ్‌ కలర్‌ లెహెంగాను 1.60 లక్షల సిల్వర్‌ క్రిస్టల్స్‌, స్వరోస్కీ స్టోన్స్‌, రంగురంగుల రత్నాలతో హంగులద్దారు. ఈ బ్యూటిఫుల్‌ లెహెంగాలో మరింత అందంగా కనిపించిందీ అంబానీ ఆడపడుచు.

⚛ ఎప్పటిలాగే నీతా అంబానీ కూడా సంగీత్‌ వేడుకలో తనదైన ఫ్యాషన్‌ స్టైల్‌తో కట్టిపడేసింది. పింక్ కలర్‌ భారీ ఎంబ్రాయిడరీ లెహెంగాను ఫల్గుణీ షేన్‌ పీకాక్‌ లేబుల్‌ నుంచి ఎంచుకుందామె. డైమండ్‌ జ్యుయలరీతో తన లుక్‌ని పూర్తిచేసిన నీతా.. తలపై ధరించిన మాతాపట్టి ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పచ్చు.

⚛ తనదైన ఫ్యాషన్‌ స్టైల్‌తో కట్టిపడేసే అంబానీ బహూ శ్లోకా మెహతా.. రాధిక-అనంత్‌ సంగీత్‌ పార్టీలో ఓ ఫ్యాషనబుల్‌ శారీ లుక్‌లో మెరిసిపోయింది. పేస్టల్‌ షేడెడ్‌ శారీలో ముస్తాబైన ఈ అంబానీ బ్యూటీ చీరపై ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీతో హంగులద్దారు. ఇక చీర కింది భాగంలో స్కర్ట్‌ తరహాలో అదనంగా వచ్చిన డిజైన్‌ చీరకే హైలైట్‌గా నిలిచిందని చెప్పచ్చు. ముత్యాలతో డిజైన్‌ చేసిన హాల్టర్‌ నెక్‌ బ్లౌజ్‌తో తన లుక్‌ని పూర్తిచేసిన శ్లోక.. మోడ్రన్‌ హెయిర్‌స్టైల్‌లో మెరుపులు మెరిపించింది.

ఇలా లేడీ అంబానీలే కాదు.. ఈ వేడుకకు హాజరైన బాలీవుడ్‌ తారలు ఆలియా భట్‌, దీపికా పదుకొణె, జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌, విద్యాబాలన్‌, మాధురీ దీక్షిత్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ అగర్వాల్‌, సారా అలీఖాన్‌.. తదితరులూ ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయారు. మరి, వాళ్ల ఫ్యాషన్‌ మేనియాను మీరూ చూసేయండి!Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్