Published : 10/02/2023 20:11 IST

Egg Holder: గుడ్డు పగలదిక!

కోడిగుడ్లు అతి సున్నితంగా ఉంటాయి. ఏదైనా వస్తువు వాటికి తగిలినా, అవి ఆయా వస్తువులకు తగిలినా గుడ్లు పగిలిపోతుంటాయి. అందుకే వాటిని బయటి నుంచి కొని తెచ్చేటప్పుడు, ఫ్రిజ్‌లో భద్రపరిచేటప్పుడు ఎగ్‌ కార్టన్‌ ఉపయోగిస్తుంటాం. ప్రస్తుతం ఇలాంటి ఎగ్‌ హోల్డర్స్‌ విభిన్న ఆకృతులు, డిజైన్లలో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఎక్కువ మొత్తంలో గుడ్లను అమర్చడానికి, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా ఉంటాయివి.

అరలు, డ్రాలు, బీపీ మెషీన్, పెంగ్విన్ ఆకృతిలో ఉన్నవి, చెక్కతో రూపొందించినవి, కోడి పుంజు ఆకృతిలో ఉన్నవి.. ఇలా వివిధ డిజైన్లలో లభిస్తోన్న వీటిలో గుడ్లను అమర్చి జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోవచ్చు.. అలాగే ఫ్రిజ్‌లోనూ భద్రపరచుకోవచ్చు. వివిధ ఆకృతుల్లో ఉన్న కొన్ని హోల్డర్స్‌లో ఎగ్స్‌ని భద్రపరచడమే కాదు.. వాటిని నేరుగా వేడి నీళ్లలో ఉంచి అలాగే గుడ్లను ఉడికించుకోవచ్చు కూడా! ఇవి సిలికాన్‌తో తయారుచేసినవి కాబట్టి.. నీళ్ల వేడికి కరిగిపోతాయన్న భయం ఉండదు. పైగా ఉడికేటప్పుడు గుడ్లు ఒకదానికొకటి తగిలి పగిలిపోయే ఆస్కారమూ ఉండదు. మరి, అలాంటి కొన్ని వెరైటీ ఎగ్‌ హోల్డర్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని