నూనె రుద్దడానికో బ్రష్!
దోసె, ఆమ్లెట్.. వంటివి వేసే ముందు ప్యాన్‌పై నూనె వేస్తాం. ఇక గ్రిల్, బేకింగ్ చేసే పదార్థాలపై వెన్న, నెయ్యి, నూనె.. వంటివి అప్లై చేయడం మనకు అలవాటే! అయితే ఇలా వేసిన నూనె ప్యాన్‌పై, ఆయా పదార్థాలపై....
దోసె, ఆమ్లెట్.. వంటివి వేసే ముందు ప్యాన్‌పై నూనె వేస్తాం. ఇక గ్రిల్, బేకింగ్ చేసే పదార్థాలపై వెన్న, నెయ్యి, నూనె.. వంటివి అప్లై చేయడం మనకు అలవాటే! అయితే ఇలా వేసిన నూనె ప్యాన్‌పై, ఆయా పదార్థాలపై సమానంగా పరచుకోవాలంటే ‘ఆయిల్ అప్లైయింగ్ బ్రష్’లను ఉపయోగించాల్సిందే! ప్రస్తుతం అలాంటి బ్రష్‌లు మార్కెట్లో విభిన్న మోడల్స్‌లో దొరుకుతున్నాయి.
చెక్కతో చేసినవి, టి-ఆకృతిలో ఉన్నవి, ఎరేజర్ తరహాలో తయారుచేసినవి, నేలను తుడిచే మాప్‌ను పోలి ఉన్నవి, మేకప్ తరహాలో రూపొందించినవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డిజైన్లలో ఆయిల్ అప్లైయింగ్ బ్రష్‌లు లభ్యమవుతున్నాయి. వీటిలోనూ కొన్ని బ్రష్‌లు ఆయిల్ బాటిల్‌కు అనుసంధానితమై ఉన్నాయి.. వీటిలో ఆయిల్ నింపి ప్రెస్ చేస్తే.. బ్రష్ బ్రిజిల్స్‌పై నూనె చేరుతుంది.. దాంతో ప్యాన్/ఆయా పదార్థాలపై రుద్దితే సరి.. అలాంటి కొన్ని బ్రష్‌లపై మీరూ ఓ లుక్కేసేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.