వంటింట్లో వీటితో జాగ్రత్త..!
సుమ ఓ మధ్య తరగతి గృహిణి.. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. అయితే ఈ మధ్యే వంటచేస్తూ ఉండగా మధ్యలో స్టౌ కిందకు ఓ బొద్దింక రావడంతో దాన్ని చంపాలని బొద్దింకలను చంపే ఓ స్ప్రేను కొట్టింది. దాంతో బొద్దింక చావడం సంగతి పక్కన పెడితే.. ఆ స్ప్రే నుంచి వచ్చిన రసాయనానికి స్టౌ మంట తోడై గదిలో మంటలు అంటుకున్నాయి.. సమయానికి స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. కేవలం ఇలాంటి స్ప్రేలు మాత్రమే కాదు..
సుమ ఓ మధ్య తరగతి గృహిణి.. ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటుంది. అయితే ఈ మధ్యే వంటచేస్తూ ఉండగా మధ్యలో స్టౌ కిందకు ఓ బొద్దింక రావడంతో దాన్ని చంపాలని బొద్దింకలను చంపే ఓ స్ప్రేను కొట్టింది. దాంతో బొద్దింక చావడం సంగతి పక్కన పెడితే.. ఆ స్ప్రే నుంచి వచ్చిన రసాయనానికి స్టౌ మంట తోడై గదిలో మంటలు అంటుకున్నాయి.. సమయానికి స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.. కేవలం ఇలాంటి స్ప్రేలు మాత్రమే కాదు.. రోజూ మనం వంటింట్లో ఉపయోగించే ఎన్నో వస్తువులు మంటలను వ్యాపింపజేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం రండి..
ఏరోసాల్ స్ప్రేలు..
ఏరోసాల్ స్ప్రేలలో రసాయన ద్రావణాన్ని, గాలితో కలిపి టిన్లలో నింపి ఉంచుతారు. వీటిలోపల గాలి ఉండడంతో పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వస్తువులకు మంట తగిలితే అందులోని పీడనం వల్ల అవి పేలిపోవడం, ఆ రసాయనాలు మంటలను వ్యాపింపజేయడం జరుగుతాయి. అందుకే క్రిమికీటకాలను చంపే కీటకనాశిని స్ప్రేలతో పాటు పెర్ఫ్యూమ్ బాటిళ్లను కూడా మంటలకు దూరంగా ఉంచడం మంచిది. అలాగే క్రిమికీటకాలను దూరంగా ఉంచేందుకు ఉపయోగించే నాఫ్తలీన్ బాల్స్ వంటివి కూడా మంటలను వ్యాపింపజేస్తాయి. కాబట్టి వాటిని కిచెన్‌లో ఉపయోగించకపోవడం మంచిది.
నెయిల్ పాలిష్
నెయిల్ పాలిష్‌లో Toluene, Formaldehyde, Dibutyl Phthalate వంటి రసాయనాలుంటాయి. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లోనూ ఎసిటోన్ అనే రసాయనం ఉంటుంది. ఇవన్నీ మంటలు అంటుకునే స్వభావం కలిగిన రసాయనాలే.. అందుకే వీటిని కూడా మంటలకు దగ్గరగా, కిచెన్‌లో అస్సలు ఉపయోగించకూడదు. వీటితో పాటు హెయిర్ స్ప్రే, లిప్జెల్ లాంటి వాటిని కూడా మంటలకు దూరంగా ఉంచాలి.
శానిటైజర్
కరోనా వల్ల ప్రస్తుతం శానిటైజర్ ఉపయోగించడం కామనైపోయింది. అయితే దీన్ని చేతులకు రుద్దుకొని స్టౌ వెలిగించడం, మంటకు దగ్గరగా వెళ్లడం వల్ల మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇందులోని ఆల్కహాల్‌కు మంటల్ని వాపింపజేసే స్వభావం ఉండడమే దీనికి కారణం. అలాగే వంటింట్లో పనులు చేసేటప్పుడు శానిటైజర్‌కి బదులుగా శుభ్రంగా సబ్బునీటితో చేతులు కడుక్కోవడం ఉత్తమం. అలాగే శానిటైజర్ బాటిల్‌ని సైతం కిచెన్‌లో ఉంచకపోవడమే మంచిది. అలాగే బ్లీచ్, స్టెయిన్ రిమూవర్.. వంటి లాండ్రీ ఉత్పత్తులు కూడా వంటింట్లో ఉంచకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!