ఈ అందాల తార ఆర్మీలో చేరింది!
కొంతమందికి ఒక అంశంపై పట్టుంటే.. మరికొందరు బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తుంటారు. తమిళనాడుకు చెందిన అఖిలా నారాయణన్ రెండో కోవకు చెందుతుంది. నటిగా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా యూఎస్ ఆర్మీలో చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తమిళ నటిగా నిలిచింది....
(Photo: Instagram)
కొంతమందికి ఒక అంశంపై పట్టుంటే.. మరికొందరు బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తుంటారు. తమిళనాడుకు చెందిన అఖిలా నారాయణన్ రెండో కోవకు చెందుతుంది. నటిగా తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా యూఎస్ ఆర్మీలో చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి తమిళ నటిగా నిలిచింది. దేశ సేవే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నానంటోన్న ఈ ముద్దుగుమ్మలో ఇంకా ఏయే ప్రత్యేకతలున్నాయో తెలుసుకుందాం రండి..
తమిళనాడుకు చెందిన అఖిలా నారాయణన్ కుటుంబం కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. అయితే చిన్నప్పట్నుంచే కళలపై మక్కువ పెంచుకున్న ఆమెకు సంగీతమంటే మహా ఇష్టం. ఈ మక్కువతోనే గతేడాది ‘కాదంపరి’ అనే తమిళ సినిమాలో నటించింది అఖిల. ఆరుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.
గాయనిగానూ ముద్ర!
తన తొలి చిత్రంతో నటిగానే కాదు.. సంగీతంపై తనకున్న మక్కువతో ఈ సినిమాలో పాటలు కూడా పాడింది అఖిల. ఇలా తన తొలి చిత్రంలో బహుముఖ ప్రజ్ఞ కనబరిచి సక్సెసైందీ తమిళందం. అయితే ప్రస్తుతం నటన కంటే సంగీతం పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టిందీ అందాల తార. ఈ క్రమంలోనే ‘నైటింగేల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ పేరుతో ఓ ఆన్‌లైన్ మ్యూజిక్ స్కూల్‌ని నిర్వహిస్తోంది. ఈ వేదికగా ఆసక్తి ఉన్న పిల్లలకు ఆన్‌లైన్‌లో సంగీత పాఠాలు చెబుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటానంటోన్న ఈ చక్కనమ్మ.. మనసుకు ఏది నచ్చితే ఆ పనే చేస్తానంటోంది.
దేశంపై ప్రేమతో..!
ప్రస్తుతం యూఎస్‌లోనే స్థిరపడిన ఆమెలో దేశభక్తి కూడా అపారం! ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం యూఎస్ ఆర్మీలో లాయర్‌గా చేరేందుకు దరఖాస్తు చేసుకుంది అఖిల. ఇక దానికి సంబంధించిన శిక్షణను ఇటీవలే పూర్తి చేసుకున్న ఆమె.. తాజాగా విధుల్లో చేరింది. ఈ క్రమంలో యూఎస్ సైనిక సిబ్బందికి న్యాయ సలహాదారుగా వ్యవహరించనుందామె. అయితే దేశ సేవ చేయాలన్న తన తపనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైందని.. అందువల్లే తన కల సాకారమైందని అంటోందీ ముద్దుగుమ్మ. ఇలా యూఎస్ ఆర్మీలో చేరిన తొలి తమిళ నటిగా ఘనత సాధించిన ఆమెను చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. ‘బ్యూటీ విత్ బ్రెయిన్స్’ అంటూ కామెంట్లు షేర్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.