Updated : 09/12/2021 15:41 IST

Good Health: ఇలా చేస్తే చలికాలంలో వ్యాయామం ఎంతో ఈజీ!

'అసలే చలికాలం.. తగిలే సుమబాణం..' అని అదేదో పాటలో చెప్పినట్లుగానే చలికాలంలో వీచే చల్లగాలి కూడా శరీరానికి బాణంలానే గుచ్చుకుంటుందిమరి ఇంతటి చలిలో లేవడానికే బద్ధకంగా ఉన్నప్పుడు ఇక వ్యాయామం చేయడానికి అస్సలు మనసొప్పదుఅలాగని వ్యాయామం చేయడం మానేస్తే శారీరకంగామానసికంగా దృఢత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందికాబట్టి ఈ చలికి తట్టుకునేలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. బయట ఎంత చలిగా ఉన్నా వ్యాయామం చేయడం పెద్ద కష్టమనిపించదు. మరి అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ముందు వేడి పుట్టించండి!

వ్యాయామం వల్ల శరీరంలో వేడి పుడుతుందిఇదే చలి నుంచి శరీరానికి వెచ్చదనాన్నిస్తుందికాబట్టి చలిగా ఉందని భయంతో బయటికి వెళ్లకుండా ఉంటే వ్యాయామం చేయలేకపోవడంతో పాటు వెచ్చదనాన్ని కూడా పొందలేంఅందువల్ల ఉదయాన్నే లేచి ఓ పదిహేను నిమిషాల పాటు జాగింగ్‌కి వెళ్లడం మంచిదిదీనివల్ల చలిలో కాసేపు గడిపినట్లుగా ఉండడంతో పాటు తర్వాత చలి తీవ్రత అంతగా తెలియకపోవచ్చుఅలాగే చలికాలంలో వీచే శీతలగాలుల వల్ల శరీరంలోని కండరాలు బిగుసుకుపోయినట్లుగా తయారవుతాయిదీంతో వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదుకాబట్టి మీరు ముందుగా చేసే జాగింగ్ ప్రక్రియ కండరాలు మామూలు స్థితిలోకి వచ్చేందుకు తోడ్పడుతుందిఒక రకంగా చెప్పాలంటే ఇది మీరు తర్వాత చేయబోయే వ్యాయామానికి వార్మప్‌లా కూడా పనిచేస్తుందిఅందుకే వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం మంచిదని చాలామంది నిపుణులు సూచిస్తారు.

తేమ శాతాన్ని పెంచండి..

చలికాలంలో చర్మం తేమను కోల్పోవడంమూత్రం రూపంలో ఎక్కువగా నీరు బయటికి వెళ్లిపోవడం.. వంటి కారణాల వల్ల శరీరంలో తేమ శాతం తగ్గిపోతుందికాబట్టి దాహం వేయకపోయినా నీరుతాజా పండ్ల రసాలు.. వంటి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిదిదీనివల్ల కోల్పోయిన తేమను తిరిగి పొందవచ్చు.

తోడుంటే మంచిది..

చలికాలంలో చలికి వ్యాయామం చేయాలనిపించదు.. కానీ చేయక తప్పదు.. అయితే ఇలాంటప్పుడు ఒక్కరే 'సోలో'గా వ్యాయామం చేసేకంటే మీకు తోడుగా మీ కుటుంబ సభ్యులుఫ్రెండ్స్బంధువులు.. ఎవరినైనా వ్యాయమం చేయమని అడగండిఎందుకంటే ఒక్కరు వ్యాయామం చేయడం కంటే ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తాంకాబట్టి మీతో పాటు ఎవరో ఒకరిని రోజూ తప్పకుండా వ్యాయామం చేయమని చెప్పండిదీంతో బోర్ కొట్టకుండా రోజూ హ్యాపీగా వ్యాయామం చేయచ్చు.

సురక్షితంగా ఇలా..

చలికాలంలో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో.. చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యంఇందులో భాగంగా ఉన్ని దుస్తులుచేతులకు గ్లౌజులుపాదాలకు సాక్సులు ధరించి షూస్ వేసుకోవడం మంచిదిఅలాగే తలకు క్యాప్ పెట్టుకోవడం కూడా మర్చిపోవద్దుఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తేనే చలి నుంచి చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తపడచ్చులేదంటే చలికి చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి.

గాలి వీచే దిశలోనే..

జాగింగ్‌కి వెళ్లినాఆరుబయట వ్యాయామం చేసినా.. గాలి ఏ దిశగా వీస్తుందనేది ముందు గమనించాలిఅలాగే మీరు కూడా గాలి వీచే దిశలోనే వ్యాయామం చేయాలిదీనివల్ల చలి తీవ్రత ఎక్కువగా తెలియకుండా ఉంటుంది.

దుస్తులూ ముఖ్యమే!

ఏ కాలమైనా వ్యాయామం చేసే క్రమంలో చెమటలు పట్టడం సహజంఅలాగని చలికాలంలో వ్యాయామం చేసేటప్పుడు కాటన్ దుస్తులు వేసుకోకపోవడం మంచిదిఎందుకంటే కాటన్ చెమటను పీల్చుకోవడం వల్ల దుస్తులు తడిగా అయిపోయి శరీరానికి మరింత చల్లగా అనిపిస్తుంటుందికాబట్టి ఈ కాలంలో గాలికి త్వరగా ఆరిపోయే సిల్క్ దుస్తులు వేసుకోవడం మంచిదిఅలాగే వ్యాయామం పూర్తయిన తర్వాత దుస్తుల్ని వెంటనే మార్చుకోవాలిఎందుకంటే తడిగా ఉండే దుస్తుల వల్ల శరీరంలోని వేడి క్రమంగా తగ్గిపోతుందిఫలితంగా శరీరం వెచ్చదనాన్ని కోల్పోతుందిఅందుకే తడిగా ఉండే దుస్తుల్ని వెంటనే మార్చుకొని పొడిగా ఉండే వాటిని ధరించడం మంచిది.

చలికాలంలో శరీరాన్ని వ్యాయామం చేసేందుకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఎలాంటి విషయాలు దృష్టిలో ఉంచుకోవాలివ్యాయామం చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటితదితర విషయాల గురించి తెలుసుకున్నారుగామరిమీరు కూడా వీటిని పాటిస్తూ చలికాలంలోనూ క్రమం తప్పకుండా వ్యాయామాన్ని కొనసాగించండి.. తద్వారా ఆరోగ్యంగాఫిట్‌గా ఉండండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని