thati bellam: తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే, మీరు అస్సలు వదలరు!

పోషకవిలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు అంటున్నారు నిపుణులు. నెలసరి సమస్యలుసహా పలురకాల అనారోగ్యాలను దూరం చేసి, ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో ఇస్తుందని సూచిస్తున్నారు.

Updated : 24 Apr 2023 12:34 IST

పోషకవిలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు అంటున్నారు నిపుణులు. నెలసరి సమస్యలుసహా పలురకాల అనారోగ్యాలను దూరం చేసి, ఆరోగ్యకరమైన ప్రయోజనాలెన్నో ఇస్తుందని సూచిస్తున్నారు.

* తాటిబెల్లంలోని ఖనిజలవణాలు చక్కెరతో పోలిస్తే 60 రెట్లు ఎక్కువ. కాబట్టి.. టీ, కాఫీ, పండ్లరసాలకు ఈ బెల్లాన్ని వినియోగించొచ్చు. జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

* ఇందులోని ఇనుము, మెగ్నీషియం రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను పెంచుతాయి. దీంతో రక్తహీనత ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మాన్ని కాపాడతాయి. ఎక్కువ మోతాదులో ఉండే కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకల బలహీనత నుంచి రక్షిస్తాయి. నెలసరి, అధిక బరువు సమస్యలకు చెక్‌ పెడుతుంది. మైగ్రేన్‌ వచ్చినప్పుడు నోట్లో చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరుస్తుంది.  

* పొడిదగ్గు, జలుబు వంటివాటికి ఇది ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం (Palm jaggery) పొడి, పావుచెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. జలుబు వల్ల చేరిన శ్లేష్మాన్ని తొలగించి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకీ దూరంగా ఉండొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్