బాబుకి హెయిర్ కటింగ్.. ఈ అదిరిపోయే ఐడియా చూశారా?
చాలామంది మహిళలు తల్లి కావాలని ఆరాటపడుతుంటారు. కానీ, తల్లైన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకవైపు శరీరంలో వచ్చే మార్పులు.. మరోవైపు పిల్లలు పెట్టే అల్లరి భరించలేక ఇబ్బంది...
(Photos: Screengrab)
చాలామంది మహిళలు తల్లి కావాలని ఆరాటపడుతుంటారు. కానీ, తల్లైన తర్వాత అసలైన సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒకవైపు శరీరంలో వచ్చే మార్పులు.. మరోవైపు పిల్లలు పెట్టే అల్లరి భరించలేక ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు స్నానం చేయించడం దగ్గర్నుంచి అన్నం తినిపించే వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా వాటిని లెక్క చేయకుండా తల్లి ప్రేమను చాటుకుంటారు. అయితే నేటితరం మహిళలు వినూత్నంగా ఆలోచించి తమ సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని కనుగొంటున్నారు. ఇలానే ఓ మహిళ తన బాబుకు హెయిర్ కట్ చేసే విషయంలో వినూత్నంగా ఆలోచించింది. ఈ క్రమంలో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా...
పిల్లలకు ఒక వయసు వచ్చే వరకు హెయిర్ కట్ చేయాలంటే చాలా కష్టం. వారు తలను అటూ ఇటూ తిప్పుతూ సతాయిస్తుంటారు. కొంతమంది కటింగ్ మొదలుపెట్టకముందే ఏడుపు లంకించుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది ఓ తల్లి. అయితే తను వినూత్నంగా ఆలోచించి ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొంది. ఇందుకోసం మొదటగా ఒక కార్టన్ బాక్స్‌ను తీసుకుంది. దానికి ఒకవైపు రెండు గుండ్రటి రంధ్రాలు చేసింది. ఆ తర్వాత పైభాగాన కూడా మరో రంధ్రం చేసింది. బాబు రెండు కాళ్లూ రెండు రంధ్రాల నుంచి బయటకు వచ్చేట్టుగా బాక్స్ లోపల కూర్చోబెట్టింది. ఆ తర్వాత పైభాగాన ఉన్న రంధ్రంలోకి తల వచ్చేట్టుగా కార్టన్ బాక్స్‌ను క్లోజ్ చేసి టేప్ వేసింది. అంతే..! ఎలాంటి ఇబ్బందీ లేకుండా సులభంగా బాబుకి ట్రిమ్మర్‌తో కటింగ్ పూర్తి చేసింది. ఈ వీడియోని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది.
ఈ వీడియో నాగాలాండ్ డీజీపీ రుపిన్ శర్మ దృష్టికి వచ్చింది. ఆ తల్లి ఆలోచనకు ముగ్ధుడైన ఆయన ఈ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. పలువురు ఆ తల్లిని ఉద్దేశిస్తూ ‘స్మార్ట్ మామ్’, ‘ఆల్బర్ట్ ఐన్‌స్టీన్’, ‘సిక్స్ సిగ్మా సొల్యూషన్’.. అంటూ కామెంట్లతో ముంచేస్తున్నారు. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.