ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే..!

ఇప్పటికీ ఇంకా ఎండలు మండిపోతున్నాయి. ఎండ వల్ల చర్మం కందిపోయి నల్లగా మారుతుంటుంది. అందుకే దీని నుంచి బయటపడడానికి వివిధ రకాల క్రీములు, లోషన్లు రాసుకోవడం మామూలే. అయితే వీటితో పాటు మనం తీసుకునే....

Published : 14 Jun 2023 20:40 IST

ఇప్పటికీ ఇంకా ఎండలు మండిపోతున్నాయి. ఎండ వల్ల చర్మం కందిపోయి నల్లగా మారుతుంటుంది. అందుకే దీని నుంచి బయటపడడానికి వివిధ రకాల క్రీములు, లోషన్లు రాసుకోవడం మామూలే. అయితే వీటితో పాటు మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో కూడా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేమిటో తెలుసుకుందామా...

కీరాదోస ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు.. సూర్యరశ్మి నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది. అందులో అధికంగా ఉండే నీటి శాతమే దీనికి కారణం.

క్యారట్లు, చిలగడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కూడా సూర్యరశ్మి ప్రభావం శరీరంపై పడకుండా కాపాడుతుంది.

కొంతమంది సలాడ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటివారు బాదం, పొద్దుతిరుగుడు గింజలు వంటివి సలాడ్లలో భాగం చేసుకోవాలి. ఫలితంగా వీటిలో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు.. వంటివన్నీ ఎండ వల్ల చర్మం కందిపోకుండా రక్షిస్తాయి.

ముదురు రంగుల్లో ఉండే కూరగాయలు, ఆకుకూరల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు.. ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

వీటితో పాటు కలబంద, ఓట్స్, మజ్జిగ.. వంటివి కూడా ఎండ కారణంగా చర్మం కందిపోకుండా సంరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని