నైపుణ్యాలు పెంచుకుంటున్నారా..?

‘నైపుణ్యం.. నిరంతర సాధన ఫలితం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు..’ అన్నారు అబ్దుల్ కలాం. చేసే పనిలోనైనా, కెరీర్‌లోనైనా.. వచ్చే మార్పుల్ని గమనిస్తూ.. నైపుణ్యాలను పెంచుకున్నప్పుడే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. అయితే అలాంటి సాధన చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 03 Jul 2024 12:16 IST

‘నైపుణ్యం.. నిరంతర సాధన ఫలితం. అది అకస్మాత్తుగా వచ్చేది కాదు..’ అన్నారు అబ్దుల్ కలాం. చేసే పనిలోనైనా, కెరీర్‌లోనైనా.. వచ్చే మార్పుల్ని గమనిస్తూ.. నైపుణ్యాలను పెంచుకున్నప్పుడే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. అయితే అలాంటి సాధన చిన్న వయసు నుంచే అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇలా సొంతం చేసుకున్న నైపుణ్యాలే మన తరగని ఆస్తులవుతాయని, అవే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మనల్ని ఉన్నతంగా నిలబెడతాయని చెబుతున్నారు.

మార్పు మంచిదే!

ప్రస్తుతం మన రోజువారీ జీవితాలే కాదు.. కెరీర్‌ కూడా టెక్నాలజీతో ముడిపడిపోయిందని చెప్పాలి. ఇక భవిష్యత్తులో ఇది మరెంత అడ్వాన్స్‌డ్‌గా మారనుందో ఊహించగలం. ఈ క్రమంలో టెక్నాలజీలో వస్తోన్న కొత్త పోకడల్ని అవపోసన పట్టడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందుకు మారుతోన్న సాంకేతికతకు అనుగుణంగానే కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపాలి. ఎలాంటి కొత్త బాధ్యతనైనా అందిపుచ్చుకునే నేర్పును అలవర్చుకోవాలి.

కమ్యూనికేషన్‌ ముఖ్యం!

చాలామందికి నలుగురిలో మాట్లాడాలంటే ఏదో తెలియని బిడియం, భయం ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలనుకునే వారికి ఇవే పెద్ద అవరోధాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. పైగా రిమోట్‌ వర్కింగ్ వాతావరణంలో మీరు మీ బృందంతోనే కాదు.. ఇతర కంపెనీ బృందాలతో, విదేశీ టీమ్‌తోనూ పని/ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడాల్సి రావచ్చు. మీ ఆలోచనల్ని వారితో పంచుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు. ఇలాంటప్పుడు చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు.. వంటివన్నీ ముందు నుంచే అలవర్చుకోవడం మంచిది.

విశ్లేషించగలగాలి!

చాలామందికి నలుగురిలో మాట్లాడాలంటే ఏదో తెలియని బిడియం, భయం ఉంటాయి. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగాలనుకునే వారికి ఇవే పెద్ద అవరోధాలుగా మారుతున్నాయంటున్నారు నిపుణులు. మీరు మీ బృందంతోనే కాదు.. ఇతర బృందాలతో సైతం పని/ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడాల్సి రావచ్చు. మీ ఆలోచనల్ని వారితో పంచుకోవాల్సిన అవసరం ఏర్పడచ్చు. ఇలాంటప్పుడు చక్కటి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు.. వంటివన్నీ ముందు నుంచే అలవర్చుకోవడం మంచిది.

పోటీని తట్టుకునేలా..!

ఈరోజుల్లో పోటీ లేని రంగం, కెరీర్‌ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది భవిష్యత్తులో మరింత తీవ్రంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అలాగని భయపడిపోతే ముందుకు సాగలేం.. అందుకే ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే.. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. ఎంచుకున్న రంగంలో పోటీని అధిగమించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను సొంతం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈ లక్షణాలు ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ముందుకు నడిపించడంతో పాటు.. విజయం సాధించేలా చేస్తాయి.

వీటితో పాటు నిత్య విద్యార్థిగా ఉండడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం.. మొదలైన వాటి ద్వారా భవిష్యత్తులో అనుకున్న రంగంలో రాణించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్