వేసవిలో అందానికి మూడు చిట్కాలు..!

ఎండ వేడి ఆరోగ్యం పైనే కాదు.. చర్మ సౌందర్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో అందాన్ని సంరక్షించుకోవడానికి ఈ మూడు చిట్కాల్ని పాటించేయండి....

Published : 31 May 2023 19:47 IST

ఎండ వేడి ఆరోగ్యం పైనే కాదు.. చర్మ సౌందర్యం పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ కాలంలో అందాన్ని సంరక్షించుకోవడానికి ఈ మూడు చిట్కాల్ని పాటించేయండి..

పిడికెడు వేపాకుల్ని స్నానం చేసే నీటిలో వేయండి.. ఓ గంట తర్వాత ఆ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడంతో పాటు ఆ నీళ్లు ముఖంపై పడడం వల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గుముఖం పడతాయి.

వేసవిలో మధ్యాహ్నం పూట నిద్ర రావడం, అలసిపోయినట్లుగా అనిపించడం, వేడి-చెమట వల్ల చిరాగ్గా అనిపించడం సహజం. మరి వీటి నుంచి బయటపడాలంటే భోజనంలో భాగంగా పెరుగు లేదా మజ్జిగను తప్పకుండా తీసుకోవాలి. వీటివల్ల చర్మం తేమను సంతరించుకోవడంతో పాటు ఈ కాలంలో వేధించే పిగ్మెంటేషన్, ఎండకు చర్మం కమిలిపోవడం.. వంటి పలు రకాల చర్మ సమస్యలకూ చెక్ పెట్టచ్చు.

ఈ కాలంలో ఎండ వేడి వల్ల చెమట, చెమట వల్ల శరీరం నుంచి దుర్వాసన వెలువడడం సహజం. మరి, దాన్ని తగ్గించుకోవాలంటే శుభ్రపరిచిన వట్టి వేర్లను తాగే నీటిలో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఆపై ఆ వేర్లను తొలగించి ఆ నీటిని తాగితే సరిపోతుంది. అంతేకాదు.. ఈ చిట్కా వల్ల చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని