మేకప్‌ వేసుకోనందుకు... ఉద్యోగమే పోయింది!

సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం రావాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలుంటే చాలు. కానీ, న్యూయార్క్‌లోని ఓ కంపెనీ మాత్రం ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి మేకప్‌ వేసుకోలేదని ఉద్యోగమే ఇవ్వలేదట.

Published : 01 Jun 2024 13:03 IST

సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం రావాలంటే అందుకు తగ్గ నైపుణ్యాలుంటే చాలు. కానీ, న్యూయార్క్‌లోని ఓ కంపెనీ మాత్రం ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి మేకప్‌ వేసుకోలేదని ఉద్యోగమే ఇవ్వలేదట. మెలిస్సా వీవర్‌ అనే అమ్మాయి ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌ ఉద్యోగానికి అప్లై చేసుకుందట. అందులో భాగంగా జూమ్‌ మీటింగ్‌లో ఇంటర్వ్యూకి హాజరైందట. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు చెప్పి, ఎంపికవుతానని చాలా కాన్ఫిడెంట్‌గా ఉందట. కొన్ని రోజుల తర్వాత ‘మీరు ఈ ఉద్యోగానికి ఎంపికకాలేదు’ అని తనకు వచ్చిన ఈ మెయిల్‌ చూసి షాక్‌ అయిందట. వెంటనే, ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి ఫీడ్‌బ్యాక్‌ పంపాల్సిందిగా రిక్వెస్ట్‌ పెట్టిందట. ‘‘ కంపెనీకి ఎలాంటి నైపుణ్యాలు, ఎంత అనుభవం కావాలో అన్నీ మీలో ఉన్నాయి. సంస్థ విలువలకు తగినట్లూ ఉన్నారు. కానీ, వీపీ- స్థాయి ఉద్యోగానికి సరిపోయేలా మీరు మీ అప్పియరెన్స్‌ మీద శ్రద్ధ పెట్టలేదు. మేకప్‌ లేకుండా వచ్చారు. అందుకే మిమ్మల్ని ఎంపికచేయలేదు’’ అని సమాధానమిచ్చారట. ‘సెన్సిటివ్‌ చర్మం, కళ్లు ఉండడం వల్లే నేను మేకప్‌ చేసుకోలేదు. దీన్నే అశ్రద్ధ అంటే ఎలా?’ అంటూ ఆమె సామాజిక మాధ్యమాల్లో తన బాధను పంచుకుంటూ వీడియో షేర్‌ చేసింది. దాంతో నెటిజన్లు ‘‘ ఈ కారణంతో ఉద్యోగం ఇవ్వకపోవడం దారుణం. మేకప్‌ వేసుకోనందుకు మగవాళ్ల విషయంలోనూ ఇలానే చేస్తారా?’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్