Success Mantra: ఈ అయిదూ మీ దగ్గర ఉన్నాయా?
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో సాధించాలని, విజేతలుగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే కొందరు మాత్రమే దాన్ని నిజం చేసుకొని, తామనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. చాలామంది అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ అక్కడికి చేరుకోలేకపోవడానికి ఎన్నో కారణాలను....
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో సాధించాలని, విజేతలుగా గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే కొందరు మాత్రమే దాన్ని నిజం చేసుకొని, తామనుకొన్న లక్ష్యాన్ని చేరుకొంటారు. చాలామంది అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. కానీ అక్కడికి చేరుకోలేకపోవడానికి ఎన్నో కారణాలను చెబుతుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైనది 'నా దగ్గర అంత డబ్బు లేదు' అనే సమాధానం. అందరూ పుట్టగానే ధనవంతులు కారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ అచంచలమైన దీక్షతో ముందడుగు వేసి ఆకాశపుటంచుల్ని తాకినవారెందరో.. కేవలం డబ్బు వల్ల కాదు.. కానీ కొన్ని లక్షణాల వల్ల విజయం మీ సొంతమవుతుంది. వాటిని అలవాటు చేసుకోవడం ద్వారా ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మన లక్ష్యాన్ని చేరుకొని తీరతామంటున్నారు నిపుణులు.. మరి అవేంటో తెలుసుకుందామా..
ధైర్యం..
జీవితంలో ఏదైనా సాధించాలని గట్టిగా అనుకొనేవారికి ఉండాల్సిన మొదటి లక్షణం ధైర్యం. కానీ చాలామందిలో ఇది లోపించడం వల్ల వారు తామనుకొన్న లక్ష్యానికి చేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక అవసరాలు, కుటుంబ పరిస్థితులకు తలొగ్గి తమకు దొరికిన ఉద్యోగం చేస్తున్నవారు ఎంతోమంది ఉంటారు. అయితే తాము అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామనే బాధ వారిలో తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని తమ లక్ష్యాన్ని చేరుకొనే ప్రయత్నం మొదలుపెడితే.. తన కుటుంబం మళ్లీ ఎక్కడ ఇబ్బందుల పాలవుతుందనే ఉద్దేశంతో చాలామంది సామర్థ్యం, తెలివితేటలు అన్నీ ఉన్నప్పటికీ ప్రస్తుతం తామున్న పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ధైర్యం చేసి కోరుకొన్న లక్ష్యంపై దృష్టి సారించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొదట కొన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ దీర్ఘకాలంలో అదే మీకు మేలు చేస్తుంది. అలా చేసినప్పుడే మీ గెలుపు దిశగా తొలి అడుగు పడుతుంది.
నిర్ణయ సామర్థ్యం..
ఒక పనిని చేపట్టి.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ చాలామంది సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. పైగా ఇంకొందరికైతే ఏం చేయాలో ఇతరులు చెబితేనే గానీ చేయలేరు. ఇలాంటి లక్షణాలున్న వారు నిర్దేశించుకొన్న లక్ష్యం ఎంత చిన్నదైనప్పటికీ దాన్ని చేరుకోలేరు. కాబట్టి ఇతరుల అనుమతి కోసం ఎదురు చూడకుండా.. మీరు చేయాల్సిన పనిని చేయడం ప్రారంభించాలి. అలాగే ఏ విషయంలోనైనా సరే సొంతంగా నిర్ణయం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఇతరుల సలహా తీసుకొని దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు కానీ ఇతరులపై పూర్తిగా ఆధారపడటం మంచిది కాదు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. అంతేకాదు.. మీరు చేస్తున్న పనికి మీరే బాస్లా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కొన్ని రోజులకు మీలోని నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి.
సరైన ఆలోచనా విధానం..
అందరికీ ఆలోచనా సామర్థ్యం ఒకే స్థాయిలో ఉంటుంది. అయితే దాన్ని ఎంత వరకు ఉపయోగించుకొంటున్నాం? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? అనే విషయాలపై ఆధారపడి మన తెలివితేటల్ని, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. అయితే చాలామంది తమకు అవసరమైన వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా పరిస్థితులు తమకు అనుకూలంగా లేవనే నిరాశావాదంలో కూరుకుపోతుంటారు. లేదా తాము పని చేస్తున్న టీంలో తమ ఐడియాను ఏ ఒక్కరు సమర్థించకపోయినా... సరే తనను టీంలో అందరూ వ్యతిరేకిస్తున్నట్టుగా తెగ బాధపడిపోతుంటారు. ఇలాంటి వారికి ఎన్ని తెలివితేటలున్నప్పటికీ చిన్న చిన్న విషయాలకు సైతం ప్రతికూలంగా స్పందించడం, ఆలోచించడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరికొందరు తమకు చక్కటి ఆలోచనలున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో తడబడుతుంటారు. అయితే ఇలాంటివారు సాధన చేయడం ద్వారా తమని తాము విజయపథంలో నడిపించుకోగలరు. అలాగే.. ఇతరులకి మనం చెప్పాలనుకొన్నదాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. అందుకే తెలివితేటలకు తోడు చక్కటి ఆలోచనావిధానాన్ని సైతం పెంపొందించుకోవడం ద్వారా లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
కలసిమెలసి పనిచేసే నేర్పు..
కొందరిలో అప్పచెప్పిన పనిని సమయానికి సమర్థంగా నిర్వహించే సామర్థ్యం ఉన్నప్పటికీ వారు ఇతరులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించరు. మరికొందరు తమ బృందంలోని ఇతర సభ్యులతో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు తమకు తెలిసిన నైపుణ్యాలను ఇతరులతో పంచుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఇలాంటి లక్షణాలు మీకేమైనా ఉంటే వెంటనే వదులుకోవాల్సిందే. ఎందుకంటే.. ప్రస్తుతం ఎవరైనా సరే బృందంలో భాగంగానే పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు అనవసరమైన ఇగోలు, భేషజాలకు పోతే.. ప్రతిభ ఉన్నప్పటికీ మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకే సొంతంగా ఓ సంస్థను ప్రారంభించే ఆలోచన ఉంటే ఇలాంటి ధోరణి వల్ల కింది స్థాయి ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇతరులతో కలసి పనిచేసే తత్వాన్ని అలవరచుకోవాలి.
పట్టుదల..
లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల లేకపోయినట్త్లెతే ఎన్ని సానుకూల లక్షణాలున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించదు. అందుకే ఏదయినా పనిని చేపట్టినప్పుడు దాన్ని పూర్తి చేయాలనే దృక్పథంతో వ్యవహరించాలి. ఇది లేకపోయినట్త్లెతే.. మనం చేరాల్సిన గమ్యం తక్కువ దూరమైనప్పటికీ దాన్ని చేరుకోలేకపోవచ్చు. ఎందుకంటే.. దాన్ని చేరుకొనే క్రమంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైతే.. వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయలేం. అందుకే గట్టి పట్టుదలతో పాటుగా అనుకొన్న పనిని సాధించాలనే దీక్ష కూడా ఉండటం తప్పనిసరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!