Published : 27/12/2022 00:26 IST

టూరుకు వెళుతున్నారా?

కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. కొత్త ఏడాదిని సరికొత్త ప్రదేశంలో ఆహ్వానించే ప్రణాళికలో ఉన్నారా? అది సురక్షితంగా, సౌకర్యవంతంగా పూర్తవ్వాలంటే.. వీటిపై దృష్టిపెట్టేయండి.

సబ్బు, ఫేస్‌ వాష్‌, క్రీములు ఇక్కడ్నుంచే తీసుకెళ్లండి. కొత్తవెందుకు ఇంట్లోవే తీసుకెళ్లడం నయమన్న ఆలోచన మంచిదే. కానీ.. నెల వారీగా పెద్దవి కొనుక్కుంటాం. వాటితో బరువు సమస్య. వెళ్లే రోజులకు తగ్గట్టుగా చిన్నవి కొనుక్కోవడమో.. వాటినే చిన్న డబ్బాల్లో ప్యాక్‌ చేసుకోవడమో మేలు. ఏ సమయంలోనైనా తీసుకెళ్లడానికి వీలుగా ఉండే బ్యాగును ఎంచుకోండి. తేలిగ్గా, దృఢంగా ఉండేవాటికే ప్రాధాన్యమివ్వాలి. వాటర్‌ప్రూఫ్‌ అయితే మంచిది.

టూరు సరదాగానే కాదు సురక్షితంగానూ సాగాలి! వెళ్లాలనుకున్న ప్రదేశాలు ముందే చూసుకొని ఉంటారు. అక్కడ సిగ్నల్స్‌, వైఫై సమస్యలుండొచ్చు. అందుకే ఆఫ్‌లైన్‌ మ్యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరి.

అడాప్టర్‌, పవర్‌ బ్యాంక్‌ తప్పక తీసుకెళ్లండి. పబ్లిక్‌ ఛార్జింగ్‌ పాయింట్స్‌ ఉపయోగించాల్సి వస్తే పవర్‌ బ్యాంకు ఛార్జింగ్‌కే వాడుకోండి. అనుకోకుండా చిన్న చిన్న దెబ్బలు కొత్త ప్రదేశాల్లో సాధారణమే! వాతావరణం పడకపోవచ్చు. చిన్న ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ను దగ్గరుంచుకుంటే మందుల కోసం పరుగెత్తాల్సిన పనుండదు.

‘ఎందుకైనా మంచిది’ అని దుస్తులు ఎక్కువే పెట్టేసుకుంటాం. తీరా మోసేప్పుడే నీరసం వస్తుంది. తక్కువ బరువు.. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేసుకునే దుస్తులకు ప్రాధాన్యమిస్తే.. ఫొటోల్లో మెరవొచ్చు. అనవసర బరువూ ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని