గర్భ నిరోధక సాధనాలు.. గడువు తీరితే తీయించేసుకోవాలి!
అవాంఛిత గర్భం రాకుండా నిలువరించడానికి ప్రస్తుతం మాత్రలతో పాటు పలు గర్భనిరోధక సాధనాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని అమర్చుకోవడం వరకు శ్రద్ధ వహించినా.. అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి? ఎప్పుడు తొలగించుకోవాలి? అసలు తొలగించుకోవడం...
అవాంఛిత గర్భం రాకుండా నిలువరించడానికి ప్రస్తుతం మాత్రలతో పాటు పలు గర్భనిరోధక సాధనాలూ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని అమర్చుకోవడం వరకు శ్రద్ధ వహించినా.. అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి? ఎప్పుడు తొలగించుకోవాలి? అసలు తొలగించుకోవడం అవసరమా? కాదా? అన్న విషయాల్లో మాత్రం చాలామంది మహిళలు నిర్లక్ష్యం చేస్తారని చెప్పచ్చు. అయితే ఈ అలక్ష్యమే తగదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే గడువు తీరినా ఇవి శరీరంలో ఉంటే వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలకూ దారితీస్తాయని చెబుతున్నారు. మరి, అలా జరగకుండా ఉండాలంటే.. గర్భనిరోధక సాధనాల్ని వాడే క్రమంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలేంటో తెలుసుకోవడం తప్పనిసరి!
ఏళ్ల తరబడి గర్భం రాకుండా నివారించుకోవడానికి మాత్రల కంటే వివిధ రకాల గర్భనిరోధక సాధనాలే (IUDs) ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. పైగా పదే పదే మాత్రలు వేసుకునే బదులు.. ఈ సాధనాల్ని ఒక్కసారి అమర్చుకుంటే ఇక సమస్య ఉండదన్నది చాలామంది మహిళల అభిప్రాయం. అందుకే వీటి వైపే మొగ్గు చూపుతున్నారు.
మొదటిదా? రెండోదా?
అయితే కారణమేదైనా.. గర్భనిరోధక సాధనాలు అమర్చుకునే క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం అంటున్నారు నిపుణులు. ఇందులో రెండు రకాలుంటాయి. ఆయా రకాన్ని బట్టి వాటికి గడువు తేదీ ఉంటుంది.
❀ మొదటిది - కాపర్ ఆధారిత గర్భనిరోధక సాధనాలు.. సాధారణంగా ఇవి అమర్చుకున్న నాటి నుంచి 12 ఏళ్ల పాటు గర్భం రాకుండా నివారిస్తాయంటున్నారు నిపుణులు.
❀ రెండోది - హార్మోన్ ఆధారిత గర్భనిరోధక సాధనాలు.. వీటిలో కొన్ని బ్రాండ్స్ 3 ఏళ్ల పాటు, మరికొన్ని బ్రాండ్స్ 6 ఏళ్ల పాటు రక్షణ కల్పిస్తాయట!
ఏదేమైనా.. వీటి కాల పరిమితిని దృష్టిలో ఉంచుకొని.. గడువు తీరాక తప్పకుండా డాక్టర్ సలహా మేరకు వీటిని తొలగించుకోవడం మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
ఎందుకు తొలగించుకోవాలి?
గడువు తేదీ ముగిశాక కొన్ని ఆహార పదార్థాల్ని తినకుండా పారేస్తుంటాం.. ఎందుకంటే అవి శరీరానికి హాని కలిగిస్తాయి కాబట్టి! గర్భనిరోధక సాధనాలూ అంతే అంటున్నారు నిపుణులు. ఒకవేళ ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే ఈ సమస్యలు తప్పవంటున్నారు.
❀ గడువు తీరాక వీటిని తొలగించుకోకపోతే.. అవి నిరుపయోగంగా మారడంతో పాటు గర్భాశయంలో ఇన్ఫెక్షన్, వాపు.. వంటి సమస్యలకు కారణమవుతుంటాయి. తద్వారా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!
❀ మరోవైపు ఈ సాధనాలు నెలసరి పైనా ప్రతికూల ప్రభావం చూపుతాయట! ఎక్స్పైరీ అయిపోయాక ఇవి తొలగించుకోకపోతే.. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో పాటు నెలసరి నొప్పులూ తీవ్రంగా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.
❀ ఈ సాధనాల్ని తొలగించుకున్నాక.. డాక్టర్ సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో చెకప్స్ చేయించుకోవడమూ ముఖ్యమే! ఎందుకంటే ఇవి గర్భాశయంలో అమర్చాక ఒక్కోసారి అటూ ఇటూ కదిలే ఆస్కారం ఉంటుందట! అలాగే తొలగించే క్రమంలోనూ అవి సులభంగా బయటికి రాకపోతే పలు సమస్యలు ఎదురవ్వచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఓసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని స్పష్టత తెచ్చుకోవడం మంచిది.
❀ ఒకవేళ అమర్చుకున్నాక.. బ్లీడింగ్, కలయిక సమయంలో నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, దుర్వాసనతో కూడిన వెజైనల్ డిశ్చార్జ్, తలనొప్పి, జ్వరం.. వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం మర్చిపోవద్దు.
డాక్టర్ సమక్షంలోనే..!
డాక్టర్ సలహా మేరకు మీకు నప్పే గర్భనిరోధక సాధనం.. వాళ్ల సమక్షంలోనే అమర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే తొలగించుకునే క్రమంలోనూ డాక్టర్నే సంప్రదించాలి. అలాగే ఈ ప్రక్రియ పూర్తయ్యాక వెజైనా దగ్గర నొప్పి, కాస్త బ్లీడింగ్.. వంటివి సహజ లక్షణాలే అంటున్నారు నిపుణులు. ఇక ఆ తర్వాత కలయికలో ఎప్పుడు పాల్గొనచ్చు అన్న విషయం మీరు మీ డాక్టర్ని అడిగి తెలుసుకొని ముందుకెళ్లడం మంచిది. తద్వారా ఎలాంటి సమస్యల్లేకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!