ఆ టీ పొడితో నెలకు రెండున్నర లక్షలు సంపాదిస్తోంది!
మన ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు తమ అనుభవంతో, పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాల్ని/వంటకాల్ని మనకు పరిచయం చేస్తారు. కానీ మనలో చాలామంది వాటిని పట్టించుకోం. ‘మోడ్రన్’ అంటూ బయట దొరికే అనారోగ్యకరమైన పదార్థాలే మనకు నచ్చేస్తుంటాయి. అయితే చెన్నైకి చెందిన హీనా యోగేశ్ భేడా అలా అనుకోలేదు. చిన్నతనంలో బామ్మ చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలన్నీ ఒంటపట్టించుకుంది. సమయం దొరికినప్పుడల్లా వాళ్లతో వీటి గురించే చర్చించేది. ఇప్పుడివే చిట్కాలకు తన ఆలోచనల్ని జోడించి ఓ టీ స్టార్టప్‌నే ప్రారంభించింది.
Photo: Instagram
మన ఇంట్లో అమ్మమ్మలు, బామ్మలు తమ అనుభవంతో, పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఎన్నో ఆరోగ్యకరమైన పదార్థాల్ని/వంటకాల్ని మనకు పరిచయం చేస్తారు. కానీ మనలో చాలామంది వాటిని పట్టించుకోం. ‘మోడ్రన్’ అంటూ బయట దొరికే అనారోగ్యకరమైన పదార్థాలే మనకు నచ్చేస్తుంటాయి. అయితే చెన్నైకి చెందిన హీనా యోగేశ్ భేడా అలా అనుకోలేదు. చిన్నతనంలో బామ్మ చెప్పిన ఆరోగ్యకరమైన చిట్కాలన్నీ ఒంటపట్టించుకుంది. సమయం దొరికినప్పుడల్లా వాళ్లతో వీటి గురించే చర్చించేది. ఇప్పుడివే చిట్కాలకు తన ఆలోచనల్ని జోడించి ఓ టీ స్టార్టప్‌నే ప్రారంభించింది. అన్ని టీ పొడుల్లో కెఫీన్ ఉంటే నా ఉత్పత్తుల్లో అది ఉండకపోవడమే ప్రత్యేకత అంటోన్న హీనా.. తన టీ బిజినెస్‌తో ఇప్పుడు నెలకు రెండున్నర లక్షలకు పైగానే సంపాదిస్తోంది. డబ్బేమో గానీ.. నలుగురికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నానన్న సంతృప్తే ఎక్కువగా ఉందంటోన్న ఈ ‘టీ లేడీ’ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి..
గతేడాది ఆగస్టును తలచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. అప్పటికి పూర్తిగా తెలిసీ తెలియని కరోనా వైరస్‌తో మనం చేసిన పోరాటమే గుర్తొస్తుంది.. దీనికి తోడు లాక్డౌన్ నిబంధనల రీత్యా ఎంతోమంది ఆర్థికంగా నష్టపోయారు.. ఉద్యోగాలు, వ్యాపారాలూ గాల్లో దీపంలా మారాయి. మరోవైపు రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాల్ని అన్వేషించే పనిలో పడ్డారంతా! ఇదిగో ఇలాంటి ప్రతికూల పరిస్థితులే హీనాకు సానుకూలంగా పరిణమించాయి. ఆరోగ్యాన్ని అందరికీ చేరువ చేసే ఉద్దేశంతో ‘యువ సోల్’ పేరుతో ఓ టీ స్టార్టప్ ప్రారంభించేలా చేశాయి.
అప్పుడొచ్చిన ఆలోచనతో..!
కెఫీన్ లేని.. ఆరోగ్యకరమైన, రోగనిరోధక శక్తిని పెంచే టీ పొడిని అందరికీ అందించాలన్నదే ‘యువ సోల్’ ముఖ్యోద్దేశం! మరి, ఈ క్రమంలో టీనే ఎందుకు అని అడిగితే.. ‘ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా టీ అనేది ఎంతోమంది జీవనశైలిలో భాగం. అయితే బయట దొరికే టీ పొడుల్లో కెఫీన్ ఉంటుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమి, గుండె-ఊపిరితిత్తుల సమస్యలు.. ఇలా ఎన్నెన్నో అనారోగ్యాలు తలెత్తుతాయి. అదే ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారుచేసిన టీ పొడి తీసుకుంటే ఈ సమస్యలేవీ ఉండవు.. పైగా ఆరోగ్యానికి మంచిది కూడా! అందుకే కెఫీన్ లేకుండా సహజసిద్ధమైన టీ పొడుల్ని తయారుచేయాలని నిర్ణయించుకున్నా. గతేడాది లాక్డౌన్ సమయంలో ఈ ఆలోచన నాకు కలిసొచ్చింది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు.. మా పెద్ద బాబు డెలివరీ సమయం కంటే ఏడు వారాలు ముందే పుట్టాడు. అయితే వాడు ఎదుగుతున్న కొద్దీ త్వరగా అలసిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోయి వివిధ అనారోగ్యాల బారిన పడడం.. వంటివి చూశాం. అప్పుడే నా చిన్నతనంలో మా బామ్మ చెప్పిన సహజసిద్ధమైన చిట్కాలు గుర్తొచ్చాయి.
అది వర్కవుటైంది!
ఈ క్రమంలోనే వాడిలో శారీరక సత్తువ పెంచుతూ, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పదార్థాల గురించి వెతకడం ప్రారంభించా. మునగాకు (Moringa Leaves) లో ఆ గుణాలన్నీ ఉన్నాయని తెలుసుకొని వాటిని పొడి చేసి అందించడం మొదలుపెట్టా. ఆ తర్వాత మా బాబు గతంలో కంటే తక్కువగా జబ్బు పడడం, అది కూడా క్రమంగా తగ్గుతూ మనలాగే ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండడం దగ్గర్నుంచి గమనించా. అలాగని అక్కడితో నా రీసెర్చిని ఆపలేదు. ఎందుకంటే ప్రకృతి మనకు ప్రసాదించే పదార్థాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.. ఇందులో భాగంగానే తిప్పతీగ, అశ్వగంధ.. వంటి వాటి గురించి శోధించి మరింత సమాచారం క్రోడీకరించా. ఇవన్నీ నిద్రలేమి సమస్యను దూరం చేస్తూనే.. శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి అందిస్తాయన్న విషయం నాకు అర్థమైంది. అందుకే వీటితో కెఫీన్ లేకుండా టీ పొడి తయారుచేయాలన్న నిర్ణయానికొచ్చా. ఇలా వీటి గురించి శోధించడానికి, టీ స్టార్టప్ ప్రారంభించడానికి లాక్డౌన్ సమయం నాకు బాగా ఉపయోగపడింది.
21 రకాల టీ పొడులు!
మొత్తానికి అలా 21 రకాల సహజసిద్ధమైన, కెఫీన్ లేని టీ పొడుల్ని తయారుచేయడం మొదలుపెట్టా. వీటిలో చామొమైల్, హైబిస్కస్ రోజ్, తులసి లెమన్‌గ్రాస్ జింజర్, మునగాకు, అశ్వగంధ, మిక్స్డ్.. వంటి పొడులకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం మా వద్ద నలుగురు మహిళలు పని చేస్తున్నారు. సేల్స్, అడ్వర్టైజింగ్.. వంటి పనులన్నీ నేనే చూసుకుంటున్నా. ప్రస్తుతం మా ఉత్పత్తులు మా వెబ్సైట్లోనే కాదు.. బయట సూపర్మార్కెట్స్, ఆన్లైన్ గ్రాసరీ వెబ్సైట్స్లోనూ లభ్యమవుతున్నాయి. రెండు లక్షలతో మొదలైన నా వ్యాపారం గాడిలో పడడానికి కొన్ని నెలల సమయం పట్టింది. ప్రస్తుతం నెలకు రెండున్నర లక్షల దాకా ఆదాయం వస్తోంది. నిజానికి నాకు డబ్బు కన్నా నా ఆలోచనతో ఇతరులకు ఆరోగ్యాన్ని చేరువ చేస్తున్నానన్న సంతృప్తే ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో నా వ్యాపారాన్ని విదేశాలకూ విస్తరించాలనుకుంటున్నా..’ అంటూ తన టీ స్టోరీ గురించి పంచుకుంది హీనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!