Wife and Husband: ఆలోచించండి.. అలగొద్దు!
సంసారంలో ఆలుమగల మధ్య అలకలు ఉండకుండా ఉంటాయా? కానీ అదే పనిగా...గొడవపడితే మాత్రం ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఆ చిర్రుబుర్రుల తాలూకు ఉద్వేగాలు...ఇతర పనులపైనా ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి స్థితికి దూరంగా ఉండాలంటే ఇరువురూ కొన్ని సూచనలు పాటించాల్సిందే.
సంసారంలో ఆలుమగల మధ్య అలకలు ఉండకుండా ఉంటాయా? కానీ అదే పనిగా...గొడవపడితే మాత్రం ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఆ చిర్రుబుర్రుల తాలూకు ఉద్వేగాలు...ఇతర పనులపైనా ప్రభావం చూపిస్తాయి. ఇలాంటి స్థితికి దూరంగా ఉండాలంటే ఇరువురూ కొన్ని సూచనలు పాటించాల్సిందే.
* భార్యాభర్తలన్నాక... ఒకరిపై ఒకరికి ప్రేమతో పాటు తమ సొంతం అనే భావన ఉంటుంది. దాని ఫలితంగానే ఆంక్షలు పెడతారు. అజమాయిషీ చేస్తారు. ఎదుటివారిని అలుసుగానూ తీసుకుంటారు. కానీ, ప్రతిసారీ ఇలా చేస్తుంటే భాగస్వామి చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉంది. అది కాస్తా అసంతృప్తిగా మారితే... రోజూ గొడవలే! ఈ తీరుకి కాస్త దూరంగా ఉంటే సరి...సమస్యలు అవే సర్దుబాటు అవుతాయి.
* అందరి అభిప్రాయాలూ, అభిరుచులూ ఒకేలా ఉండాలనేం లేదు. ఈ సూత్రం భాగస్వామి విషయంలోనూ వర్తిస్తుంది. చెడు అలవాట్ల గురించే మీ బాధ అయితే అవతలివారికి మొహమాటం లేకుండా చెప్పండి. మారాల్సిన అవసరాన్ని కూడా వివరించండి. లేదంటే ఇద్దరి మధ్య అగాధం పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. సమస్య ఏదైనా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి.
* మీ మాటని ఎదుటివారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారంటే.. తప్పు వారిదే కాకపోవచ్చు. మీరు మీ అభిప్రాయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పలేకపోతున్నారేమో గమనించండి. అలాంటి పరిస్థితి ఎదురైతే మీ మాటతీరు మార్చుకోవడానికి వెనుకాడొద్దు. కోపం వచ్చినప్పుడు ఆగి ఆలోచించి మాట్లాడితే సరి... కచ్చితంగా సమస్య సద్దుమణుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.