Relationship: తప్పొప్పులు ఎంచొద్దు... మనోధైర్యం ఇవ్వండి!
ఆలు మగలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, మానసిక ఒత్తిడి... ఇద్దరి మధ్య అపార్థాలకూ, అసహనానికి కారణమవుతున్నాయి. కోప తాపాల్ని ఇట్టే పెంచేస్తున్నాయి.
ఆలు మగలు ఇద్దరూ పనిచేస్తేనే కానీ గడవని రోజులివి. వేర్వేరు పనివేళలు, మానసిక ఒత్తిడి... ఇద్దరి మధ్య అపార్థాలకూ, అసహనానికి కారణమవుతున్నాయి. కోప తాపాల్ని ఇట్టే పెంచేస్తున్నాయి. ఇలాంటప్పుడు తప్పొప్పులు ఎంచుకోవడం మొదలుపెడితే... దూరం మరింత పెరుగుతుంది. అలాకాకుండా ఉండాలంటే...
* ఆలుమగల బంధంలో... అనురాగం మాత్రమే సరిపోదు. పరస్పర నమ్మకం, బాధ్యత ఉండాలి. కష్టసుఖాలను చెరిసగం పంచుకోగలగాలి. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడమే కాదు... భాగస్వామీ వాటిని తెలుసుకునేలా వ్యవహరించాలి. మీ దినచర్యను గమనించుకుని మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. వారాంతపు సెలవులూ, షిఫ్ట్‌లూ... ఇతరత్రా సందర్భాలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని పనులనూ పంచుకుంటే సరి. తప్పుల్ని ఒకరిపై మరొకరు నెట్టుకోకుండా సాఫీగా సాగిపోతాయి.
* గొడవ ఎప్పుడు మొదలైందన్న విషయాలను పక్కన పెట్టి... ఎప్పటెప్పటివో విషయాలను చేర్చి వాదనకు దిగుతుంటారు కొందరు. మీదీ అదే పద్ధతైతే... మార్చుకోవాల్సిందే. ఎప్పుడొచ్చిన కష్టాన్ని అప్పుడే పరిష్కరించుకోవాలి. దేన్నీ తెగేదాకా లాగకుండా ఉండగలిగే సర్దుబాటే మీ సంసారంలో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది.
* ఇంటిపనైనా, ఉద్యోగ బాధ్యతలైనా ఎవరి స్థాయికి వారికవే ఎక్కువ. అభిరుచులూ, అలవాట్ల విషయంలోనూ మీ అసహనంతో ఎదుటివారిని చులకన చేయొద్దు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య తగాదాలకు ఇవే ప్రధాన కారణమవుతున్నాయి. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, మీరు చేయగలిగే పనులైతే అందిపుచ్చుకుని సాయం చేయడం, మనోధైర్యాన్ని నింపడం వంటి వాటి వల్ల ఒకరికొకరు మరింత దగ్గరవుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!