ఈ వేసవి సమస్యలకు పరిష్కారమిలా..!

చెమట, డీహైడ్రేషన్.. వేసవిలో ఈ సమస్యలు తప్పవు. ఇక వీటికి తోడు ట్యాన్, సన్‌బర్న్, చెమట కాయలు.. ఇలాంటి సమస్యల జాబితాకు అంతుండదు. మరి వీటికి పరిష్కారం....

Updated : 26 May 2023 21:16 IST

చెమట, డీహైడ్రేషన్.. వేసవిలో ఈ సమస్యలు తప్పవు. ఇక వీటికి తోడు ట్యాన్, సన్‌బర్న్, చెమట కాయలు.. ఇలాంటి సమస్యల జాబితాకు అంతుండదు. మరి వీటికి పరిష్కారం..? ఇదిగో.. ఇలా!

కలబందతో..

సమస్య ఉన్న ప్రాంతంలో కలబంద గుజ్జుని నేరుగా అప్త్లె చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత రోజ్‌వాటర్ సహాయంతో చేతివేళ్లతో మృదువుగా కాసేపు రుద్దుకోవాలి. అనంతరం చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకి రెండుసార్లు చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా చెమటకాయలు, సన్‌బర్న్.. వంటివి సునాయాసంగా తగ్గుముఖం పడతాయి. అలాగే ట్యానింగ్ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

టీ ట్రీ ఆయిల్‌తో..

వేసవిలో తలెత్తే చర్మ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు సమర్థంగా ఉపకరించే వాటిలో టీ ట్రీ ఆయిల్ కూడా ఒకటి. చెమటకాయలు ఎక్కువగా వచ్చి ఎర్రగా మారినప్పుడు, మంట, దురద వంటివి అధికంగా ఉన్నప్పుడు టీ ట్రీ ఆయిల్‌లో ముంచిన దూదితో వాటిపై మృదువుగా అద్దుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభించే అవకాశాలుంటాయి. అలాగే దీనిని ఉపయోగించడం ద్వారా సన్‌బర్న్, ట్యానింగ్.. వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

ఈ ప్యాక్‌లు కూడా..

సమస్య ఉన్న ప్రాంతంలో తేనె రాసి కాసేపు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి.

గుప్పెడు వేపాకులు తీసుకొని తగినన్ని నీళ్లు జత చేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి కాసేపు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేయాలి.

రోజ్‌వాటర్‌లో ముంచిన దూదితో సమస్య ఉన్న ప్రాంతంలో రోజుకి 2 లేదా 3 సార్లు మృదువుగా రుద్దుకోవాలి.

పుచ్చకాయ గుజ్జు లేదా రసాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి కాసేపు ఆరనిచ్చి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

కర్పూరాన్ని పౌడర్‌గా చేసి అందులో కాస్త వేపనూనె వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రాంతంలో అప్త్లె చేసి 3 నుంచి 5 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత కడిగేసుకోవాలి.

ఈ చిట్కాలన్నీ వేసవిలో ఎదురయ్యే చర్మ సంబంధిత సమస్యలకు సులభంగా చెక్ పెట్టడమే కాదు.. చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉండేలానూ చేస్తాయి. ఎండాకాలంలో ఈ చిట్కాలు పాటించడంతో పాటు వీలైనంత ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం ద్వారా డీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా విముక్తి పొందచ్చు. చర్మం తాజాగా, ఆరోగ్యంగా మెరిసేలా చేయచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్