Relationship: ప్రేమించడంతో సరిపోదు...

ప్రేమబంధంతో మనసులు కలిశాయనుకుంటే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ కృషి చేస్తేనే ఆ బంధం శాశ్వతం అవుతుందంటున్నారు నిపుణులు.

Published : 02 Jun 2023 00:17 IST

ప్రేమబంధంతో మనసులు కలిశాయనుకుంటే సరిపోదు. దాన్ని నిలబెట్టుకోవడానికి ఇద్దరూ కృషి చేస్తేనే ఆ బంధం శాశ్వతం అవుతుందంటున్నారు నిపుణులు.

కొందరు లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటూ తేలికగా ప్రేమలో పడిపోతారు. వారి మనసునీ తమ ప్రేమతో ముడిపడేలా చేయగలరు. మరికొందరు అవతలివ్యక్తి గురించి తెలిసిన తర్వాత ప్రేమించడం మొదలు పెడతారు. ప్రేమికులుగా ఆ సమయంలో ప్రేమంత మధురమైది మరేదీ ప్రపంచంలో లేదనిపిస్తుంది. ఒకరికొకరు తమ గురించి అవతలివారికి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎదుటివారి గురించి తెలుసుకోవడానికి ఉవ్విళ్లూరతారు. ఇరువురి నడుమ ప్రతి చిన్న విషయమూ తీయగా అనిపిస్తుంది. చిన్నచిన్న చిలిపి తగవులు కూడా ఆ ప్రేమికులను మరింత దగ్గర చేస్తాయి. ఒకరితో మరొకరు ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు.

కృషితో.. ఏడడుగులు నడిచిన తర్వాత కొత్త కాపురాన్ని తీయగా ప్రారంభించడంతో ఆ నూతన దంపతులకు జీవితం రంగుల మయంగా అనిపిస్తుంది. మధురమైన ఆ ప్రేమ బంధానికి రెండో భాగం మొదలవుతుంది. ఆ తర్వాత దాన్ని శాశ్వతం చేసుకోవాల్సిన బాధ్యత ఇరువురిదీ. మొదట్లో ఉండే ప్రేమను కలకాలం ఉండేలా నిలబెట్టు కోవడానికి భార్యాభర్తలిద్దరూ కృషి చేయాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడం ప్రారంభించాలి. వారి బలాలు, బలహీనతలను గుర్తించి గౌరవించాలి. బలాలను ప్రశంసించక పోయినా ఫరవాలేదు. బలహీనతలను మాత్రం విమర్శించకూడదు. అలా చేస్తే వారిని అవమానించినట్లుగా భావించే ప్రమాదం ఉంటుంది.  

పంచుకొని.. మనసుకు నచ్చినవారిని ప్రేమించేలా చేసుకోవడంలో పడ్డ కష్టం కన్నా, ఆ బంధానికి కట్టుబడి, దాన్ని శాశ్వతం చేసుకోవడానికి మరెన్నో రెట్లు కష్టపడాల్సి ఉంది. ఇరువురూ తమకంటూ సమయాన్ని కేటాయించుకోవాలి. సంతోషాన్ని మాత్రమే కాకుండా, జీవితంలో వివిధ దశల్లో వచ్చే సవాళ్లను కూడా కలిసి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు అది ఏ ఒక్కరిదైనా ఇరువురిదీ అనుకోవాలి. తమ బాధ్యతగా స్వీకరించి పంచుకొని, చర్చించాలి. కుటుంబ సమస్యలనూ.. సున్నితంగా పరిష్కరించుకోగలగాలి. అప్పుడే ఇరువురి మనసులూ.. ఒకేలా ఆలోచించడం మొదలు పెడతాయి. ఒకరి కోసం మరొకరు అన్నట్లు మనసులు ముడిపడి, ఇద్దరి మధ్య ప్రేమ బంధం శాశ్వతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్