Business Women: వ్యాపార విజయం కోసం

ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ మహిళలు తమదైన శైలిలో దూసుకు పోతున్నారు. తమ ఉత్పత్తులను తామే మార్కెట్‌ చేసుకునే క్రమంలో కాస్త కంగారు పడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించేయండి.

Published : 29 Apr 2023 00:18 IST

ఉద్యోగాల్లోనే కాదు, వ్యాపారాల్లోనూ మహిళలు తమదైన శైలిలో దూసుకు పోతున్నారు. తమ ఉత్పత్తులను తామే మార్కెట్‌ చేసుకునే క్రమంలో కాస్త కంగారు పడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించేయండి.

అర్థమయ్యే పేరు... ఏ వ్యాపారమైనా విజయవంతం కావాలంటే వినియోగదారులు అవసరం. అభివృద్ధి చెందాలంటే ఒకసారి వచ్చిన వాళ్లు మళ్లీ మళ్లీ రావాలి. అందుకే, కొందరు ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఆన్‌లైన్‌ వేదికలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో లోగోలను అర్థంకాకుండా తయారు చేస్తున్నారు. అలా చేస్తే ఇవి సామాన్యులకు చేరడం కష్టమవుతుంది. అలా కాకుండా వెబ్‌సైట్‌, యాప్‌, సోషల్‌మీడియా హ్యాండిల్స్‌ పేర్లు అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడే వినియోగదారులు సులభంగా చేరుకోగలరు.

సానుకూలంగా... సైట్‌ను విజిట్‌ చేస్తున్న వినియోగదారుల ప్రొఫైల్స్‌ను ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ఏ సమయంలోనైనా వారి ప్రశ్నలను, అనుమానాలను నివృత్తి చేసేలా ఉండాలి. వినియోగదారులు ఇష్టపడే మాధ్యమం ద్వారానే వారిని సంప్రదించాలి. వారి ఆసక్తులు, ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ఉత్పత్తుల్లో లోటుపాట్లును సవరించుకోవాలి.

దీర్ఘకాలిక సంబంధాలు... ఏదో అమ్మామా, పనైపోయింది అన్నట్టు కాకుండా... వినియోగదారులతో దీర్ఘకాలిక అనుబంధాన్ని  కొనసాగించగలగాలి. అప్పుడే వారి సానుకూల రివ్యూలు, రిఫరెన్సుల ద్వారా కొత్త ఖాతాదారులను సంపాదించుకోవచ్చు.

పోటీ తట్టుకుని... అవసరమైనప్పుడు ఎక్కడైనా, ఎవరితోనైనా మాట్లాడగలగాలి. అవకాశం ఉన్న ప్రతి వేదికపైనా ఉత్పత్తిని పరిచయం చేయగలగాలి. దీనికోసం ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి.

ఒక సారి అమ్మకాలు బానే ఉన్నాయి అనుకుంటే కొంత మంది ఇక దానిపై పెద్దగా దృష్టి పెట్టరు. అలా కాక ఎప్పటికప్పుడు పోటీ కంపెనీల ఉత్పత్తులను పరిశీలిస్తూ, దీటుగా మన వాటిని మెరుగుపరచుకున్నప్పుడే మార్కెట్లో నిలబడగలం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్