రాగి పాత్రలను ఈజీగా శుభ్రం చేయండిలా..!
'అబ్బబ్బా.. చస్తున్నాను.. ఇంటి పనంతా చేసుకోలేక..' అంటోంది సుష్మ నేను వాళ్లింటికి వెళ్లేసరికి.. నేను, సుష్మ స్కూల్ డేస్ నుంచీ కలిసి చదువుకున్నాం..
'అబ్బబ్బా.. చస్తున్నాను.. ఇంటి పనంతా చేసుకోలేక..' అంటోంది సుష్మ నేను వాళ్లింటికి వెళ్లేసరికి.. నేను, సుష్మ స్కూల్ డేస్ నుంచీ కలిసి చదువుకున్నాం.. ఆదివారం సెలవు కదా అని తనని కలవడానికి వెళ్లాను.. నేను ఇంట్లోకి వెళ్లేసరికి తన డైలాగులు విన్నాంగా.. 'ఎందుకంత చిరాకు పడుతున్నావ్.. ఏమైందే' అడిగాను నేను.. తను చెప్పిన సమాధానం విని నాకు నవ్వొచ్చింది. 'యాంటిక్ పీసెస్, తాతముత్తాతల కాలం నాటివంటూ పాతకాలం రాగి పాత్రలను తెచ్చి ఇంట్లో పెడతారు మా ఆయన. వాటిని క్లీన్ చేసుకోలేక నా ప్రాణం పోతోందనుకో.. ఎంత రుద్దినా మురికి పోదే? నా సెలవు మొత్తం దీనికే వేస్ట్ అవుతోంది' అంటూ బాధపడిపోయింది.
మరీ సుష్మలాంటి పరిస్థితి కాకపోయినా.. వాటిని క్లీన్ చేసుకోవడం కష్టమైన పనే.. మురికిని వదిలించాలంటే రుద్ది, రుద్ది చేతులు నొప్పెట్టాల్సిందే.. మీ పరిస్థితి కూడా ఇదేనా? అయితే ఇప్పటి నుంచి మీకా కష్టాలుండవు. ఎందుకంటారా? మన వంటింట్లోనే దొరికే పదార్థాలతో ఈజీగా వాటిని క్లీన్ చేసే పద్ధతుల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు కాబట్టి.. ఆసక్తిగా ఉంది కదూ.. మరి అవేంటో చూసేద్దామా?
వెనిగర్, బేకింగ్ సోడా
వెండి వస్తువుల లాగానే రాగిని కూడా బేకింగ్ సోడా, వెనిగర్‌తో క్లీన్ చేయొచ్చు. వెనిగర్‌ని స్ప్రే బాటిల్లో వేసి రాగి వస్తువుల మీద స్ప్రే చేయండి. తర్వాత తడిగా ఉన్న వెనిగర్ మీద బేకింగ్ పౌడర్ని చల్లండి. అది అతుక్కుపోతుంది. దీన్ని నిమిషం పాటు అలాగే ఉంచితే ఇవి రెండూ మురికిని తొలగిస్తాయి.
మీ కోసం ఇంకో పద్ధతి.. ఒక మెత్తని గుడ్డను తీసుకోండి. దాని మీద బేకింగ్ పౌడర్ వేసి కాస్త నీటిని కలపండి. అది మిశ్రమంగా మారుతుంది. ఈ మిశ్రమంతో రాగి పాత్రలను తోమండి. తర్వాత వెనిగర్ చల్లండి. ఒకసారి దాంతో తుడిచేసి వేడి నీటిలో కడగండి. ఇలా చేయడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి.
బేకింగ్ సోడా, నిమ్మరసం
కాపర్ గిన్నెలు, ప్యాన్స్ వంటివి క్లీన్ చేయడానికి ఈ టిప్ ఉపయోగపడుతుంది. బేకింగ్‌సోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి ఒక మెత్తని గుడ్డతో దాన్ని తీసుకొని రాగి గిన్నెలను రుద్దండి. తర్వాత వాటిని క్లీన్ చేయండి. అలాగే నిమ్మబద్దను ఉప్పు, బేకింగ్ పౌడర్లలో ముంచి దాంతో రాగి గిన్నెలను క్లీన్ చేయచ్చు. మురికి చాలా తొందరగా వదిలిపోతుందంటే నమ్ముతారా?
పిండి, ఉప్పు, వెనిగర్
ఒక కప్పు వెనిగర్‌లో టేబుల్‌స్పూను ఉప్పును కలపండి. దీన్లో గోధుమపిండిని కొద్దికొద్దిగా కలుపుతూ గట్టి మిశ్రమంగా తయారయ్యేలా చేయండి. ఈ మిశ్రమంతో రాగి వస్తువులను రుద్దండి. మరకలు పడిన చోట దాన్ని రుద్ది ఒక పావుగంట అలాగే ఉంచేయండి. తర్వాత దాన్ని వేడినీటితో కడిగేయండి. ఎంత మొండి మరకలైనా ఇలా చేస్తే సులభంగా తొలగిపోతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!