రాగి పాత్రలు శుభ్రమిలా..!

రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడం కష్టమైన పనే.. మురికిని వదిలించాలంటే రుద్ది, రుద్ది చేతులు నొప్పెట్టాల్సిందే.. అయితే మన వంటింట్లోనే దొరికే పదార్థాలతో ఈజీగా....

Published : 03 Mar 2023 21:55 IST

రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడం కష్టమైన పనే.. మురికిని వదిలించాలంటే రుద్ది, రుద్ది చేతులు నొప్పెట్టాల్సిందే.. అయితే మన వంటింట్లోనే దొరికే పదార్థాలతో ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవచ్చు.  మరి అవేంటో చూసేద్దామా?

వెనిగర్, బేకింగ్ సోడా

వెండి వస్తువుల లాగానే రాగిని కూడా బేకింగ్ సోడా, వెనిగర్‌తో క్లీన్ చేయొచ్చు. వెనిగర్‌ని స్ప్రే బాటిల్‌లో వేసి రాగి వస్తువుల మీద స్ప్రే చేయండి. తర్వాత తడిగా ఉన్న వెనిగర్ మీద బేకింగ్ పౌడర్‌ని చల్లండి. అది అతుక్కుపోతుంది. దీన్ని నిమిషం పాటు అలాగే ఉంచితే ఇవి రెండూ మురికిని తొలగిస్తాయి.

ఇంకో పద్ధతి.. ఒక మెత్తని గుడ్డను తీసుకోండి. దాని మీద బేకింగ్ పౌడర్ వేసి కాస్త నీటిని కలపండి. అది మిశ్రమంగా మారుతుంది. ఈ మిశ్రమంతో రాగి పాత్రలను తోమండి. తర్వాత వెనిగర్ చల్లండి. ఒకసారి దాంతో తుడిచేసి వేడి నీటిలో కడగండి. ఇలా చేయడం వల్ల మరకలు సులభంగా తొలగిపోతాయి.

బేకింగ్ సోడా, నిమ్మరసం

కాపర్ గిన్నెలు, ప్యాన్స్ వంటివి క్లీన్ చేయడానికి ఈ టిప్ ఉపయోగపడుతుంది. బేకింగ్‌సోడా, నిమ్మరసం, ఉప్పు కలిపి ఒక మెత్తని గుడ్డతో దాన్ని తీసుకొని రాగి గిన్నెలను రుద్దండి. తర్వాత వాటిని క్లీన్ చేయండి. అలాగే నిమ్మబద్దను ఉప్పు, బేకింగ్ పౌడర్‌లలో ముంచి దాంతో రాగి గిన్నెలను క్లీన్ చేయచ్చు.

పిండి, ఉప్పు, వెనిగర్

ఒక కప్పు వెనిగర్‌లో టేబుల్‌స్పూను ఉప్పును కలపండి. దీన్లో గోధుమపిండిని కొద్దికొద్దిగా కలుపుతూ గట్టి మిశ్రమంగా తయారయ్యేలా చేయండి. ఈ మిశ్రమంతో రాగి వస్తువులను రుద్దండి. మరకలు పడిన చోట దాన్ని రుద్ది ఒక పావుగంట అలాగే ఉంచేయండి. తర్వాత దాన్ని వేడినీటితో కడిగేయండి. ఎంత మొండి మరకలైనా ఇలా చేస్తే సులభంగా తొలగిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్