Amniotic fluid: ఉమ్మనీరు పెరిగేందుకు..

గర్భిణుల్లో ఉమ్మనీరు తగ్గితే చాలా ప్రమాదం. శిశువు కదిలేందుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని ఆహార మార్పులతో ఉమ్మనీరుని పెంచొచ్చంటున్నారు వైద్యులు.

Updated : 22 May 2023 03:58 IST

గర్భిణుల్లో ఉమ్మనీరు తగ్గితే చాలా ప్రమాదం. శిశువు కదిలేందుకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని ఆహార మార్పులతో ఉమ్మనీరుని పెంచొచ్చంటున్నారు వైద్యులు..

* ఉమ్మనీరు స్థాయులను పెంచాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో వేగంగా ఉమ్మనీరు అభివృద్ధి చెందుతుంది.

* నీరు అధికంగా ఉండే దోసకాయలు, పాలకూర, బ్రకొలీ, టొమాటో, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌ వంటివి తినాలి. వీటితో శరీరానికి సరిపడా నీరు సమృద్ధిగా అందుతుంది. పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లల్లో నీరు అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే సరి.

* కొబ్బరి నీళ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వికారాన్ని తగ్గించి అజీర్తి సమస్యలను దూరం చేస్తాయి. ఉమ్మనీరుని వృద్ధి చేయటమే కాకుండా శిశువు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతాయి. అన్నింటికంటే ముందు డాక్టర్లను సంప్రదిస్తే అవసరాన్ని బట్టి తగిన మందులు సూచిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్