Child Care: పోషణ అందేదెలా?

కొందరు పిల్లలు సరిగా తినకుండా మారం చేస్తుంటారు. దాంతో సరైన పోషణ అందుతుందో లేదో అన్న ఆందోళన తల్లుల్లో నిత్యం ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినటానికి నిపుణులు ఏం సలహాలిస్తున్నారో తెలుసుకుందామా! పిల్లలకు ఇష్టమైందే.. పెద్దల్లానే పిల్లలు కూడా వారికి ఇష్టమైనవే తినాలనుకుంటారు.

Published : 28 Apr 2023 00:38 IST

కొందరు పిల్లలు సరిగా తినకుండా మారం చేస్తుంటారు. దాంతో సరైన పోషణ అందుతుందో లేదో అన్న ఆందోళన తల్లుల్లో నిత్యం ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తినటానికి నిపుణులు ఏం సలహాలిస్తున్నారో తెలుసుకుందామా!

1. పిల్లలకు ఇష్టమైందే.. పెద్దల్లానే పిల్లలు కూడా వారికి ఇష్టమైనవే తినాలనుకుంటారు. ఏం తినాలన్నది వారినే నిర్ణయించుకోనివ్వండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు పెట్టాలి. చపాతీ, పన్నీరు, కూరగాయలు, పండ్లు వంటివి ముక్కలుగా చేసి వారంతట వారే తినేలా చూడాలి.

2. నిద్ర చాలా ముఖ్యం..  సరిగా తినడం లేదంటే దానికి నిద్ర లేమి కూడా కారణం కావచ్చు. కంటినిండా నిద్రపోని పిల్లలు చిరుతిళ్లకు అలవాటు పడి అన్నం తినడానికి ఇష్టపడరు. కాబట్టి పిల్లలకు మంచి నిద్ర అందేలా చూడాల్సిన బాధ్యత మనదే.

3. ఆడుతూ పాడుతూ.. తినే సమయంలో ఫోన్లు, టీవీ వంటివి చూపించకూడదు. దానివల్ల వారు రుచిని ఆస్వాదించలేరు. ఎంత తింటున్నామన్న ధ్యాసా ఉండదు. బదులుగా వారికి నచ్చే ఆట వస్తువులు ఇవ్వటం లేదా మంచి సంగీతం వినిపిస్తే ప్రశాంతంగా తినగలుగుతారు.

4. తొందర వద్దు.. రోజూ ఏ సమయంలో తినాలో ఒక నియమం ఏర్పరచాలి. రోజులో కనీసం ఒక్కసారైనా వాళ్లతో కలిసి మనమూ తినాలి. మనం తినే పదార్థాలను వారికీ రుచి చూపించాలి.  తొందరగా తినెయ్యాలనే మన ఆత్రుతను వారిపై రుద్దకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్