Financial Literacy: ఆర్థిక అక్షరాస్యత ఉందా?
ఎన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. ఆర్థిక విషయాలకి వచ్చేసరికి మగవాళ్లపై ఆధారపడే మహిళలే ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. కొందరికి ఆసక్తి ఉన్నా.. సొంత నిర్వహణ చేసుకోవాలన్నా ఎలా మొదలుపెట్టాలన్నది సందేహం. అందుకే ముందు ఆర్థిక అక్షరాస్యతపై దృష్టిపెట్టమంటున్నారు నిపుణులు.
ఎన్ని రంగాల్లో దూసుకుపోతున్నా.. ఆర్థిక విషయాలకి వచ్చేసరికి మగవాళ్లపై ఆధారపడే మహిళలే ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు. కొందరికి ఆసక్తి ఉన్నా.. సొంత నిర్వహణ చేసుకోవాలన్నా ఎలా మొదలుపెట్టాలన్నది సందేహం. అందుకే ముందు ఆర్థిక అక్షరాస్యతపై దృష్టిపెట్టమంటున్నారు నిపుణులు. అంటే..
* బ్యాంకు అకౌంట్ ఉందా? మీకంటూ ప్రత్యేకంగా ఉండాలి.. జాయింట్ అకౌంట్ కాకూడదు. ఉంటే ఖాతా నిర్వహణ స్వయంగా చూసుకోవడం మొదలుపెట్టండి. ప్రాథమిక నియమం... ఎంత దగ్గరి వారికైనా పాస్‌వర్డ్ ఇవ్వొద్దు. దాన్ని రూపొందించుకోవడంలో ఎవరైనా సాయం చేసినా, పిన్ నెంబరు తర్వాత మార్చేయండి.
* రోజూ సాయంత్రం ఎంత ఖర్చు పెట్టారు.. దేనికి ఖర్చు పెట్టారు వంటివి చెక్ చేసుకోండి. నగదు లావాదేవీలన్నింటినీ విడిగా ఓ పుస్తకంలోనూ రాసుకుంటూ ఉంటే ఆదాయ, వ్యయాలపై అవగాహన వస్తుంది.
* ప్రతి బ్యాంకులోనూ ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్ లాంటివి చేయచ్చు. వాటిలో ఎలా పొదుపు చేయాలి, ఎంత వడ్డీ అనేవి చూడండి. వెంటనే పొదుపు ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఎంత మొత్తం పెట్టొచ్చు నుంచి మధ్యలో తీసుకోవడం వీలవుతుందా లాంటివి తెలుసుకుంటే చాలు.
* పర్సనల్, ఎడ్యుకేషన్.. లాంటి లోన్లు ఎలా తీసుకోవచ్చు, మీకెంత వరకూ వస్తుంది, ఎప్పటి నుంచి కట్టడం ప్రారంభించాలి వంటివీ తెలుసుకోండి. భవిష్యత్తులో ఈ సమాచారం సాయపడుతుంది. ఆర్థిక లక్ష్యాలేమైనా ఉన్నాయా? అంటే ఏడాదిలో ఫలానాది కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవడం, పై చదువులకు.. ఎంత అవసరం.. ఎంత మొత్తం పొదుపు చేయాలి వంటివీ అంచనా వేసుకొని, దాయడం మొదలుపెట్టినా చాలు. అన్నీ అందరికీ తెలియవు. అలాగని కూర్చొనుంటే ఎప్పటికీ అర్థమవవు. ఎక్కడో చోట ప్రారంభమవ్వాలి. తెలుసుకుంటూ సాగాలి. అప్పుడే నైపుణ్యం సాధించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.