ఇక నుంచైనా పక్కాగా.!

ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసి నప్పుడు ఆ కష్టం మనకి పొరపాటున కూడా రాదనుకుంటాం. కానీ అది నిజం కాదు. కష్టాలకి మనం అతీతులమేం కాదు.

Published : 23 Dec 2022 00:30 IST

* ఎవరికైనా కష్టం వచ్చిందని తెలిసి నప్పుడు ఆ కష్టం మనకి పొరపాటున కూడా రాదనుకుంటాం. కానీ అది నిజం కాదు. కష్టాలకి మనం అతీతులమేం కాదు. అందుకే ఓ ఆర్నెల్లు మనం ఉద్యోగానికి వెళ్లకపోయినా ఫర్వాలేదు అనుకొనేంత అత్యవసర నిధిని ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి.

* ఊరు వెళ్లాలనుకుంటున్నా, ఇంట్లో చిన్నవేడుక ఉన్నా అనేక రకాలుగా సంసిద్ధంగా ఉంటాం. ఇలా కాకపోతే ఇలా అనుకుంటాం. కానీ ఇదే రకమైన ఆర్థికపరమైన ప్రణాళిక డబ్బుని ఖర్చు పెట్టే ప్రతి విషయంలోనూ ఉండాలి. అప్పుడే వారికి ఆర్థిక స్వేచ్ఛ దొరుకుతుందంటారు నిపుణులు.

*  ‘ఆర్థికంగా మన కుటుంబానికున్న భరోసా ఏంటి?’ అనే విషయంలో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ఒక చర్చ నడవాలంటారు నిపుణులు. అప్పుడే ఆర్థిక సవాళ్లను సులభంగా దాటగలరని చెబుతారు.

* సంపాదించడం మాత్రమే కాదు... పన్నులు, క్రెడిట్‌స్కోర్‌, మనకు తెలియకుండా పడే హిడెన్‌ ఛార్జెస్‌ వంటివాటిని రాకెట్‌ సైన్స్‌ అనుకోకుండా అవగాహన పెంచుకుంటే వృథా ఖర్చుని నియంత్రించుకోగలుగుతాం. ధైర్యంగా ఆర్థిక నిర్ణయాలూ తీసుకోగలుగుతాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్