Financial Success: ఆర్థిక విజయం దక్కాలంటే..
ఆర్థిక విషయాలపై అమ్మాయిల్లో ఆసక్తి పెరిగింది. స్వీయ నిర్వహణపై దృష్టిపెడుతున్న వారూ ఎక్కువే. అలాగని దాచుకోవడం వరకే పరిమిత మవుతున్నారా? ఆర్థిక విజయాలను సాధించాలంటే కొన్ని నియమాలు పెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు.
ఆర్థిక విషయాలపై అమ్మాయిల్లో ఆసక్తి పెరిగింది. స్వీయ నిర్వహణపై దృష్టిపెడుతున్న వారూ ఎక్కువే. అలాగని దాచుకోవడం వరకే పరిమిత మవుతున్నారా? ఆర్థిక విజయాలను సాధించాలంటే కొన్ని నియమాలు పెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు.
* ఆర్థిక లక్ష్యాలున్నాయా? అవేంటనుకుంటున్నారా? కెరియర్‌లో చిన్న, పెద్ద లక్ష్యాలుంటాయి కదా! అదే విధానాన్ని డబ్బు విషయంలోనూ పాటించాలి. ఈ ఏడాదిలో కొనాల్సిన నగలు, పిల్లల చదువు కోసం కొంత కూడబెట్టడం, కారు, ఇల్లు కొనుగోలు.. ఇలా స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచుకోవాలి.
* లక్ష్యం ఏర్పరుచుకున్నాక ఎంత, ఎలా పొదుపు చేయాలనేది నిర్ణయించుకోవాలి. కేవలం భద్రపరిస్తేనే సరిపోదు. వడ్డీ వచ్చే రికరింగ్, ఫిక్స్‌డ్ డిపాజిట్లలోనూ మదుపు చేయాలి. ఈ క్రమంలో కొన్ని అనుకోని ఖర్చులు వచ్చినా మీ ప్రణాళిక దెబ్బతినకుండా ప్లాన్ చేసుకోవాలి.
* ఇంటి బడ్జెట్ మనకు కొత్తేమీ కాదు. చాకచక్యంగా నిర్వహించుకుంటాం. అయితే, ఖర్చులే కాదు.. పొదుపు విషయంలోనూ పద్దు పాటించండి. ఎంత ఎక్కడ పెట్టుబడి పెట్టాం, ఏమేమి తీసుకున్నాం వంటివీ రాసి పెట్టుకొంటే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదు.
* ధరించినా, దాచినా మనలో చాలామందికి బంగారమే పెట్టుబడి. అయితే వాటిని కొని దాచడం కంటే రిటర్న్స్ అవకాశమున్న గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టండి. ఏదైనా కొనడానికి.. దాచిన మొత్తం సరిపోలేదని అప్పు చేయొద్దు. దీర్ఘకాలిక లక్ష్యాలను కొనసాగిస్తూనే ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో చూసుకోవాలే తప్ప రుణం తీసుకొనైనా కొనాలనే తాపత్రయం మాత్రం వద్దు. ఇల్లు, పొలం వంటి వాటికి లోను గురించి ఆలోచించొచ్చు. మిగతా వేటి విషయంలోనైనా అప్పులకు దూరంగా ఉండడమే మేలు. ఆ అలవాటు చేసుకుంటేనే ఆర్థికంగా విజయం సాధ్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.