Relationship: అత్తగారితో కష్టంగా ఉంది...

మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మావారు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆయన నచ్చజెప్పడంతో ఒప్పుకొన్నారు కానీ మా అత్తగారికి మా పెళ్లి ఇష్టంలేదు. కట్నం ఇవ్వలేదని మా పుట్టింటివాళ్లని ఏదో సందర్భంలో నిందిస్తుంటారు.

Published : 29 May 2023 00:11 IST

మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. మావారు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఆయన నచ్చజెప్పడంతో ఒప్పుకొన్నారు కానీ మా అత్తగారికి మా పెళ్లి ఇష్టంలేదు. కట్నం ఇవ్వలేదని మా పుట్టింటివాళ్లని ఏదో సందర్భంలో నిందిస్తుంటారు. ఇంటి పనులన్నీ నేనే చేసినా విసుక్కుంటూనే ఉంటారు. ఆడపడుచు ఒక్క పనీ చేయదు. ఆమెకి కూడా చెప్పాలి కదా! ఈ విషయాలు చెప్పబోతే మావారికి విసుగొస్తోంది. ఈ ఇంటి పరిస్థితులు ఏమీ బాగాలేవు. ఏం చేయాలో బోధపడక సతమతమైపోతున్నాను.

- ఓ సోదరి

న సంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు ఎంత గారాబంగా పెరిగినా.. అత్తగారింటికి వెళ్లాక ఇంటిపనులు చేసుకోవడం మామూలే. అత్తగారు, ఆడపడుచులతో సఖ్యత ఉంటే ఇంటి వాతావరణం అనుకూలంగా, ఆనందంగా ఉంటుంది. మీ విషయంలో వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లయినందున మీపై కొంత వ్యతిరేకత, కొద్దిగా చిన్నచూపు ఉన్నాయనిపిస్తోంది. మీ వారిని ఏమీ అనలేక పరోక్షంగా మీ మీద అయిష్టత చూపుతుండొచ్చు. ఆడపడుచు పనిచేయడంలేదని పోల్చుకోకండి. ఆ అమ్మాయి పెళ్లయి అత్తగారింటికి వెళ్తే అక్కడ ఎటూ బాధ్యతలు తప్పవని తల్లిదండ్రులు చూసీచూడనట్లు ఊరుకుంటారు. మొన్నటి దాకా మీరైనా అంతే కదా! అని అర్థం చేసుకోండి. ఆమె పని చేయడంలేదని అసంతృప్తి చూపితే అత్తగారి నుంచి ఇంకాస్త వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. తన తల్లి, చెల్లి మీద మీరు తరచూ ఫిర్యాదు చేస్తుంటే...మీ భర్తకు మీమీద ఉన్న సదభిప్రాయం తగ్గిపోయే అవకాశం ఉంది. దీనివల్ల సానుభూతి దొరక్కపోగా ప్రేమా తగ్గొచ్చు. కనుక పరిస్థితులను అర్థం చేసుకుని కాస్త సర్దుకుపోవడం అలవాటు చేసుకోండి. మీ అలసటను మాత్రమే తెలియజేస్తూ మీవారి నుంచి సాయం తీసుకోండి. అత్తగారితో, ఆడపడుచుతో ఆత్మీయంగా మాట్లాడుతుండండి. ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. వాళ్లు మిమ్మల్ని తప్పకుండా అర్థంచేసుకుంటారు. ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోండి. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్