Parenting: ఇప్పుడే ఇవన్నీ ఎందుకనుకుంటున్నారా?

చాలామంది పిల్లలకు ఏమైనా పనులు నేర్పించాలంటే నెమ్మదిగా వాళ్లే నేర్చుకుంటారులే అనేస్తారు. కానీ జీవన నైపుణ్యాలు నేర్చుకోడానికి ఎదిగే వయసే సరైన సమయమట.

Published : 24 May 2023 00:49 IST

చాలామంది పిల్లలకు ఏమైనా పనులు నేర్పించాలంటే నెమ్మదిగా వాళ్లే నేర్చుకుంటారులే అనేస్తారు. కానీ జీవన నైపుణ్యాలు నేర్చుకోడానికి ఎదిగే వయసే సరైన సమయమట. వారికి 12ఏళ్లు వచ్చేలోపు ఈ అలవాట్లు నేర్పించాలంటున్నారు నిపుణులు..

* స్టవ్‌ మీద చేసే వంటలు కాకపోయినా కనీసం శాండ్‌విచ్‌లు, షేక్‌లు వంటివి వారే స్వయంగా తయారుచేసుకునేలా ఉండాలి.

* నిద్ర లేవగానే బెడ్‌షీట్లు మడతపెట్టుకోవటం, వాళ్ల వస్తువులు సర్దుకోవటం, గదిని శుభ్రం చేసుకోవటం వంటివి తెలిసుండాలి. అలానే రోజూ ప్రయాణించే మార్గాలు, ఇంటి నుంచి స్కూలుకి వెళ్లే మార్గం గుర్తుంచుకోగలగాలి.

* కనీస అవసరాలైన పాలు, పెరుగు, కిరాణా సామాన్లు వంటి కనీస వస్తువులను దగ్గరలోని దుకాణాల నుంచి తీసుకొచ్చే నైపుణ్యం ఉండాలి. అలానే అపాయాలప్పుడు ప్రాథమిక చికిత్స అందించే వస్తువులు, మందుల గురించి తెలుసుకొని ఉంటే మంచిది. పెద్ద వాళ్లు సమయానికి లేకపోతే వాళ్లే చికిత్స చేసుకుంటారు.

* ఒకొక్కసారి మనకు ఏదైనా పనిపడి బయటకెళ్లే సందర్భం రావొచ్చు. ఇంట్లో ఎవరు ఉన్నా, లేకపోయినా సరే తన కన్నా చిన్నవాళ్లను చూసుకునే నైపుణ్యం పెద్ద పిల్లలకు రావాలి. అలానే వాళ్ల అభిప్రాయాలు, ఆలోచనలు ఎదుటివారికి స్పష్టంగా చెప్పగలిగే నేర్పు ఉండాలి. 

* ఈ వయసు కల్లా పిల్లలు సొంతంగా వాళ్ల హోం వర్క్‌ వాళ్లే చేసుకునేలా ఉండాలి. ఏమైనా సందేహాలు వస్తే తీర్చొచ్చు. అంతేకాని వాళ్ల పని కూడా మీరే చేయకూడదు. అంతేకాదు కుటుంబంలో కనీసం ఒకరిద్దరివైనా ఫోన్‌ నంబర్లు కంఠత వచ్చేలా చూడాలి. అప్పుడే తెలియని ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు ఇవి ఉపయోగపడతాయి. అలానే ఏవి సురక్షిత ప్రాంతాలో, ఏవి కావో వాళ్లకు కనీస అవగాహన ఉండాలి. అప్పుడే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్