Parenting: అందరిలో మంచే చూస్తారు..

వేసవిలో పిల్లల ఆగడాలు పెరిగిపోయాయా? అలాంటప్పుడు అసహనం కలిగే మాట నిజమే. కానీ ఆ చిరాకును పక్కనపెట్టి శాంతంగా ఆలోచించండి. స్కూలూ స్నేహితులూ లేకపోతే వాళ్లకీ విసుగే కనుక ఏదైనా వ్యాపకం ఉండాలి.

Published : 26 May 2023 00:01 IST

వేసవిలో పిల్లల ఆగడాలు పెరిగిపోయాయా? అలాంటప్పుడు అసహనం కలిగే మాట నిజమే. కానీ ఆ చిరాకును పక్కనపెట్టి శాంతంగా ఆలోచించండి. స్కూలూ స్నేహితులూ లేకపోతే వాళ్లకీ విసుగే కనుక ఏదైనా వ్యాపకం ఉండాలి. అందుకు చాలానే మార్గాలుంటాయి. మచ్చుకు కొన్ని..

* తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ.. మూడు భాషల్లోనూ ఒక్కో అధ్యాయాన్ని బిగ్గరగా చదవమనండి. ఉచ్చారణ, స్పష్టత, వేగం, తప్పుల్లేకపోవడం లాంటివి లక్ష్యాలు. ఒకరు చదువుతున్నప్పుడు మీతో బాటు తక్కిన పిల్లల్ని కూడా మార్కులు వేయమనండి. ఎవరికి వారే ఇతరుల కంటే బాగా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. భాషపై పట్టు తెచ్చుంటారు.

* ఎప్పుడూ మీరు చెప్పడమే కాదు, వాళ్లతో మాట్లాడించండి. చదివిన కథ, విన్న విషయం, చూసిన సినిమా.. ఇలా దేన్నయినా ఎంత అందంగా చెప్పగలరో చిన్న పోటీ పెట్టండి. అంతకంటే ముందు కొందరు స్టోరీ టెల్లర్స్‌ను పరిచయం చేయండి. కంఠస్వరంతో ఎంత మాయాజాలం చేయొచ్చో గ్రహించి ప్రయత్నిస్తారు. ఇలాంటి నైపుణ్యాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అవి వారి కెరియర్‌కు ఎంతో ఉపయోగపడతాయి.

* కుటుంబసభ్యులు, బంధుమిత్రుల్లో ఎవరెవరిలో ఏయే మంచి గుణాలు ఉన్నాయో రాయమనండి. దీని వల్ల అందరిలో మంచి మాత్రమే చూడటం అలవాటవుతుంది. సానుకూల దృక్పథం వృద్ధి చెందుతుంది.

* ఆయా దేశాల్లో చూడదగిన ప్రదేశాలు, ప్రపంచవ్యాప్త వింతలూ విడ్డూరాలు, ప్రసిద్ధ రచయితలు, శాస్త్రవేత్తలకు గురించి ప్రశ్నలు అడగండి. సరైన సమాధానాలు చెప్పినప్పుడల్లా ప్రశంసించండి. చిన్న చిన్న కానుకలు కూడా ఇవ్వండి. మీకు తీరుబడి ఉన్నప్పుడల్లా పక్కింటి, ఎదురింటి పిల్లలను కూడా చేరదీసి స్ఫూర్తి కలిగించే అంశాలను ఆసక్తికరంగా చెప్పండి.

* క్రాస్‌ వర్డ్‌ పజిల్స్‌ లాంటివి నింపమనండి. వాళ్లకు తెలిసిన అంశాలతో చిన్న చిన్న పజిల్స్‌ వాళ్లనే తయారు చేయమనండి. ఇలాంటివి మెదడుకు పదును పెడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్